Lord Shiva statue
-
ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ప్రారంభం.. విశేషాలివే
జైపూర్: రాజస్థాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్. ‘విశ్వాస్ స్వరూపం’గా పిలిచే ఈ విగ్రహం ప్రారంభోత్సవంలో సీఎంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారి బాబు, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి పాల్గొన్నారు. రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ‘రామ కథలోని ప్రతి అంశం ప్రేమ, సామరస్యం, సోదరభావం గురించి చెబుతుంది. దేశంలో ప్రస్తుతం అదే అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అలాంటి కథలను చెప్పించాల్సిన అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు సీఎం అశోక్ గెహ్లోట్. ఆయనతో పాటు యోగా గురు రామ్‌దేవ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గలాబ్ చాంద్ కటారియా సహా ఇతర నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విగ్రహం విశేషాలు.. ► మహా శివుడి అతిపెద్ద విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది. ► 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. ద్యానం చేస్తున్నట్లు ఉన్న కైలాశనాథుడు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తాడు. ► ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు 10 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకోసం 3,000 టన్నుల స్టీల్, ఐరన్ ఉపయోగంచారు. 2.5లక్షల క్యుబిక్ టన్నులు కాంక్రిట్, ఇసుకను వాడి పూర్తి రూపాన్నిచ్చారు. ► ఈ శివుడి విగ్రహ నిర్మాణానికి 2012, ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మొరారి బాబుల సమక్షంలోనే శంకుస్థాపన చేశారు. ► ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహం. లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించాం. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి. World's tallest statue of shiva was inaugurated in rajsamand distict in Rajasthan pic.twitter.com/WDJgVlzXmE — Priyadarshini soni (@PriyaSo62807043) October 29, 2022 ఇదీ చదవండి: ఇది కదా జాక్‌పాట్.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం -
మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న
మంగళగిరి (గుంటూరు): మంగళగిరిలో గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి (శివాలయం) వద్ద దాతలు మాదల వెంకటేశ్వరరావు, గోపికృష్ణ, వెంకటకృష్ణ దంపతులు నిర్మించిన 51 అడుగుల పరమ శివుడి విగ్రహాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ సభలో పేర్లు చదివే సమయంలో ఒక్క మహిళ పేరు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తాను గతంలో మంగళగిరి విచ్చేసిన సందర్భంలో నృసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. 51 అడుగుల పరమశివుడి విగ్రహాన్ని నిర్మాణం చేసిన మాదల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తనచేత ఆవిష్కరింపచేయడం సంతోషంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరిస్తానని తెలిపారు. తొలుత బీజేపీ నాయకుడు జగ్గారపు శ్రీనివాసరావు నివాసంలో అల్పాహారం స్వీకరించి అనంతరం లక్ష్మీనృసింహస్వామి వారిని, గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకోగా ఆలయ ఈఓలు ఏ.రామకోటిరెడ్డి, జేవీ నారాయణలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మార్కెట్ యార్డు చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి, శివాలయం ట్రస్ట్ బోర్టు చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మీరాధిక, బోర్డు సభ్యులు కొల్లి ముసలారెడ్డి, కొల్లి వెంకటబాబూరావు, అద్దంకి వెంకటేశ్వర్లు, నక్కా సాంబ్రాజ్యం, రేఖా వకులాదేవి, జంపని చిన్నమ్మాయి తదితరులు పాల్గొన్నారు. పరమ శివుడి విగ్రహ ఆవిష్కరణ అనంతరం కొబ్బరికాయ కొట్టిన గవర్నర్ దత్తాత్రేయ దేశం సుభిక్షంగా ఉండాలన్నదే ఆకాంక్ష.. గుంటూరు మెడికల్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారని, దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డులోని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు గృహంలో ఆయన విందు స్వీకరించారు. పలువురు బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ గుంటూరు నగర బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మాదిరిగా అలై బలై కార్యక్రమాన్ని ఏపీలో కూడా నిర్వహిస్తామన్నారు. గుంటూరులో ఉన్న శ్రేయోభిలాషులను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ నేతలు మాగంటి సుధాకర్ యాదవ్, జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపారాణి, మాధవరెడ్డి, రంగ, వెలగలేటి గంగాధర్, విజయ్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పారిశ్రామిక వేత్త అరుణాచలం మాణిక్యవేల్, విశ్రాంత డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, ఉన్నారు. -
సూర్యలంకలో ‘శివ లింగ’ ప్రతిష్ట
బాపట్ల టౌన్: సూర్యలంక సాగర తీరంలోని శివక్షేత్రంలో ఆదివారం శివలింగాన్ని కమిటీ సభ్యులు ప్రతిష్టించారు. ఈ సందర్భంగా శివక్షేత్ర నిర్మాణ సంఘం అధ్యక్షుడు మంతెన దశరథ మహారాజు మాట్లాడుతూ సూర్యలంక తీరానికి పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వీలుగా తీరంలో శివక్షేత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన సూర్యలంక తీరంలో నిత్యం పూజలు నిర్వహించే విధంగా శివాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో కమిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అడ్డగడ సుబ్బారావు, సెక్రటరి సంగమేశ్వరశాస్త్రి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.