గొత్తికోయలు మూఢనమ్మకాలు వీడాలి
Published Thu, Sep 29 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
ఏటూరునాగారం : గొత్తికోయలు మూఢ నమ్మకాల వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య సూచించారు. గోగుపల్లి లింగాపురం గ్రామ గొత్తికోయ మహిళ పోచమ్మ ప్రసవం కోసం వెళ్తుండగా మంగళవారం దారి మధ్యలో కవలలకు జన్మనిచ్చిన విషయం విదితమే. ఇందులో ఓ శిశువు మృతి చెందగా మరో శిశువు, తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండగా.. పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ మేరకు సామాజిక ఆస్పత్రిలో ఉన్న పోచమ్మ ఆరోగ్య పరిస్థితిని అప్పయ్య పరీక్షించి మాట్లాడారు. వైద్యాధికారులు శిరీష, క్రాంతికుమార్, మంకిడి వెంకటేశ్వర్లు, ఏఎ¯ŒSఎం ధనలక్ష్మి ఉన్నారు.
Advertisement
Advertisement