హాయిగా నవ్వుకుంటారు  | Slum Dog Husband movie released on 29th of this month | Sakshi
Sakshi News home page

హాయిగా నవ్వుకుంటారు 

Published Tue, Jul 25 2023 12:31 AM | Last Updated on Tue, Jul 25 2023 12:32 AM

Slum Dog Husband movie released on 29th of this month - Sakshi

‘‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ వినోదాత్మక చిత్రం. మూఢ నమ్మకాలపై సెటైర్‌లా ఉండే ఈ కథ కొత్తగా అనిపించింది.. అందుకే నిర్మించాం. మా సినిమా చూసి ప్రేక్షకులు రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు’’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి. సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ ఈ నెల 29న విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి మాట్లాడుతూ– ‘‘వ్యాపారరీత్యా అమెరికా వెళ్లాం. అక్కడ 2016లో ఓ హాలీవుడ్‌ మూవీ నిర్మించాం. 2017కి ఇండియా వచ్చి, తెలుగులో మొదటి సినిమాగా ‘జార్జ్‌ రెడ్డి’ నిర్మించాం. ఏఆర్‌ శ్రీధర్‌ చెప్పిన కథ నచ్చడంతో ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ తీశాం. మా బ్యానర్‌లో నిర్మించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ ఆగస్టు 18న రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.   – అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement