Reliance Entertainment
-
కోర్టులో రిలయన్స్ పిటిషన్.. కంగువ విడుదలకు అడ్డంకులు
సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో పలు అడ్డంకులు వచ్చేలా కనిపిస్తున్నాయి. రిలయన్స్ నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో కంగువ సినిమా రిలీజ్ విషయంలో మద్రాస్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్ రాజా రుణం పొందారు. అయితే, ఇప్పటికే రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది.తమకు చెల్లించాల్సిన డబ్బు అందేవరకు సూర్య నటించిన గంగువ సినిమా విడుదలను ఆపేయాలని రిలయన్స్ నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లింది. మరోవైపు తంగళాన్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయకూడదని ఆ పిటిషన్లో పేర్కొంది. జస్టిస్ కుమారేష్ బాబు ముందు కేసు విచారణకు వచ్చినప్పుడు, స్టూడియో గ్రీన్ ఇలా తెలిపింది. 'నవంబర్ 7 వరకు సమయం కావాలని కోరింది. అప్పటి వరకు 'కంగువ'ను విడుదల చేయబోమని తెలిపింది. ఈ క్రమంలో తంగలాన్ చిత్రాన్ని కూడా నవంబర్ 7వరకు విడుదల చేయబోమని హామీ ఇచ్చింది. దీనిని నమోదు చేసుకున్న న్యాయమూర్తి కేసు విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే, కంగువ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఆ సమయంలోపు ఈ కేసు క్లియర్ కాకపోతే సినిమా విడుదలకు చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలే పేర్కొంటున్నాయి. -
హాయిగా నవ్వుకుంటారు
‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ వినోదాత్మక చిత్రం. మూఢ నమ్మకాలపై సెటైర్లా ఉండే ఈ కథ కొత్తగా అనిపించింది.. అందుకే నిర్మించాం. మా సినిమా చూసి ప్రేక్షకులు రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు’’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ నెల 29న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ– ‘‘వ్యాపారరీత్యా అమెరికా వెళ్లాం. అక్కడ 2016లో ఓ హాలీవుడ్ మూవీ నిర్మించాం. 2017కి ఇండియా వచ్చి, తెలుగులో మొదటి సినిమాగా ‘జార్జ్ రెడ్డి’ నిర్మించాం. ఏఆర్ శ్రీధర్ చెప్పిన కథ నచ్చడంతో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ తీశాం. మా బ్యానర్లో నిర్మించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఆగస్టు 18న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి -
38 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ క్షణాలు.. కపిల్ దేవ్ భావోద్వేగపు వ్యాఖ్యలు
‘‘1983 జూన్ 25న జరిగిన వరల్డ్ కప్ పోటీలో నా సార థ్యంలోని భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచిన క్షణాలు మరచిపోలేనివి. 38 ఏళ్ల తర్వాత ‘83’ ద్వారా మరోసారి ఆ క్షణాలను వెండితెరపై ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకున్న నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకోన్ నటించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో దీపికా పదుకోన్, సాజిద్ నడియాద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘1983లో ఇండియా వరల్డ్ కప్ గెలవగానే భారతదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. ‘83’ ట్రైలర్ చూశాక కపిల్ దేవ్ నటించారా? అనిపించింది. ఆ పాత్రలో రణ్వీర్ అంతలా ఒదిగిపోయారు’’ అన్నారు. రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ– ‘‘కపిల్దేవ్లాంటి లెజెండ్ పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు. విష్ణు ఇందూరి మాట్లాడుతూ– ‘‘83’ రషెస్ చూసుకున్న ప్రతిసారీ కన్నీళ్లు వచ్చాయి.. అంతలా ఈ చిత్రంలోని భావోద్వేగాలుంటాయి’’ అన్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్రను జీవా అద్భుతంగా చేశాడు. నేను, నాగార్జున ఇంజినీరింగ్‌లో క్లాస్మేట్స్. కాలేజ్‌లో సైలెంట్‌గా ఉన్న నాగ్.. ‘శివ’తో వైలెంట్‌గా ట్రెండ్ సెట్ చేశాడు’’ అన్నారు. కబీర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం కపిల్‌తో పాటు అప్పటి టీమ్‌ని కలిసి సలహాలు తీసుకున్నాను. అప్పటి వార్తా కథనాలనూ రిఫరెన్స్‌గా తీసుకున్నాను. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న క్షణాలు, ఆ తర్వాత పరిస్థితులను చూపించాం’’ అన్నారు. ‘‘అందరూ... ముఖ్యంగా యువతరం చూడాల్సిన సినిమా ఇది’’ అని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సుభాశిష్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్లో వాటా కొన్న టాంగ్ మీడియా పార్ట్నర్స్
ముంబై: అనిల్ అంబానీ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్కు చెందిన ఫిల్మ్, టీవీ స్టూడియో, ఐఎం గ్లోబల్‌లో మెజారిటీ వాటాను టాంగ్ మీడియా పార్ట్నర్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక కొత్త టీవీ ప్రొడక్షన్ జాయింట్ వెంచర్ కోసం టాంగ్ మీడియా, ఐఎం గ్లోబల్ కంపెనీలు కలిసి ఆసియా ఇంటర్నెట్ దిగ్గంజ టెన్సెంట్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా..ఈ కంపెనీలు టీవీ ప్రసారాల కంటెంట్ , టీవీ ప్రోగ్రామ్‌లు, సినిమాల కోసం, డిస్ట్రిబ్యూషన్, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫార్మ్ విస్తరణ కోసం పెట్టుబడులు పెడతాయి. ఐఎం గ్లోబల్ సంస్థకు, కొత్తగా ఏర్పాటు చేసిన టీవీ ప్రొడక్షన్ జాయింట్ వెంచర్‌కు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా స్టువర్ట్ ఫోర్డ్ వ్యవహరిస్తారు. ఐఎం గ్లోబల్ టెలివిజన్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మార్క్ స్టెర్న్ అదే పదవిలో కొనసాగుతారు. వినూత్నమైన వినోదాత్మకమైన కంటెంట్ డెవలప్మెంట్, దీనికి కావలసిన నిధుల సమకూర్చడం, పంపిణి తదితర రంగాల్లో లాస్ ఏంజెల్స్, షాంఘై కేంద్రాలుగా టాంగ్ మీడియా పార్ట్నర్స్ కార్యకలాపాలు సాగిస్తోంది. టాంగ్ పార్ట్నర్స్ వాటా కొనుగోలు కారణంగా తమకు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు సమకూరుతాయని ఐఎం గ్లోబల్ సీఈఓ స్టువర్ట్ ఫోర్డ్ పేర్కొన్నారు. 2007లో ఫోర్డ్చే ప్రారంభించిన ఐఎం గ్లోబల్ సంస్థ.. ప్రపంచ అగ్రశ్రేణి ఫిల్మ్, టెలివిజన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫార్మ్‌ల్లో ఒకటి. -
గేమింగ్ స్టార్టప్‌లలోకి రిలయన్స్
భారతదేశంలో మొబైల్ గేమింగ్ క్రమేపీ బలంగా పుంజుకుంటోంది. ఈ రంగంలో స్టార్టప్‌లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ మార్కెట్‌పై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎక్కువగా దృష్టిసారించింది. ఈ ఏడాది 20 గేమింగ్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వీటికి మార్కెటింగ్, టెక్నాలజీ పరంగా సాయపడేందుకు రూ. 33.28 లక్షల (50వేల డాలర్లు) పెట్టుబడులను రిలయన్స్ గేమ్స్ ప్రకటించింది. వచ్చే 18-24 నెలల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారత్ మారుతుందని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ డిజిటల్ సీఈవో అమిత్ ఖండుజాని అన్నారు. ఈ క్రమంలో దేశీయ మొబైల్ గేమ్ మార్కెట్ వృద్ధిచెందడం గేమ్ డెవలపర్స్ కు చక్కని అవకాశమని తెలిపారు. కొన్నేళ్ల క్రితం కేవలం 40 గేమింగ్ స్టార్టప్ లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 250కు పైగా ఉన్నట్టు ఆయన చెప్పారు. భారత మార్కెట్ అభివృద్ధి చెందుతున్న గేమ్ హబ్ అని, వచ్చే 3-4 ఏళ్లలో దాదాపు 50వేల మంది నిపుణులు దీనిలో భాగస్వాములవ్వాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రిలయన్స్ అనిల్ ధీరూభాయి గ్రూపునకు చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ టీమ్‌తో భాగస్వామి అవుతున్నట్టు అమిత్ ప్రకటించారు. దీంతో రాజ్‌కోట్‌కు చెందిన ఈ టీమ్ కు అధికారిక భాగస్వామిగా రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ మారింది. రిలయన్స్ గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా 5 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ స్టూడియోలతో కలిసి రిలయన్స్ గేమ్స్ పనిచేస్తోంది. -
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్లాన్ సి స్టూడియో జేవీ
ఫ్రైడే ఫిల్మ్వర్క్స్తో కలిసి చిత్ర నిర్మాణం న్యూఢిల్లీ: చిత్ర నిర్మాణం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, నీరజ్ పాండే, శీతల్ భాటాయాల ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ప్లాన్ సి స్టూడియోస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ జేవీలో ఇరు సంస్థలకు 50:50 శాతం వాటాలున్నాయి. ప్లాన్ సి స్టూడియోస్ తొలి చిత్రంగా అక్షయ్ కుమార్ హీరోగా టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వంలో రుస్తోమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీరజ్, శీతల్ వంటి సృజనాత్మక వ్యక్తులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ ఎండీ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా చెప్పారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో ఒప్పందం చెప్పుకోదగినదని నీరజ్ పాండే వ్యాఖ్యానించారు. వినోదాత్మక అంశాలతో వినూత్నమైన సినిమాలను అందిస్తామని పేర్కొన్నారు. -
ఎంతో ప్రేమగా..!
ఎన్టీఆర్‌కు 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో..’. ఇప్పటివరకూ ఆయన నటించిన 24 చిత్రాల్లోని లుక్స్‌కి పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా ఎన్టీఆర్ కనిపించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఇటీవల లండన్‌లో భారీ షెడ్యూల్ జరిపామనీ, తదుపరి షెడ్యూల్‌ను అక్టోబర్ 20న మొదలుపెడతామని బీవీయస్‌యన్ ప్రసాద్ తెలిపారు. స్పెయిన్‌లో జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో ఈ పాత్రలో ఒదిగిపోయారని ఆయన తెలిపారు. ‘ఛత్రపతి’ ప్రసాద్ అనిపించుకోవడం ఆనందం! ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ‘ఛత్రపతి’ విడుదలై, బుధవారానికి పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా బీవీయస్‌యన్ మాట్లాడుతూ - ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘డ్రైవర్ బాబు’. 1986లో విడుదలైన ఈ చిత్రంలో శోభన్‌బాబు హీరోగా నటించారు. అప్పట్నుంచీ 2005 వరకు ఎన్నో చిత్రాలు నిర్మించాను. ఆ విధంగా ఇండస్ట్రీలో నాకు చాలా గుర్తింపు వచ్చింది. కానీ, పబ్లిక్‌లో కూడా నాకో ఇమేజ్ తెచ్చిన చిత్రం ‘ఛత్రపతి’. 2005లో విడుదలైన ఈ చిత్రం నా ఇంటి పేరులా స్థిరపడిపోయింది. అప్పట్నుంచీ అందరూ నన్ను ‘ఛత్రపతి’ ప్రసాద్ అంటుంటారు. అది ఆనందంగా ఉంటుంది’’ అన్నారు. -
ఫాంటమ్ ఫిల్మ్స్‌తో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ జట్టు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్(అడాగ్)నకు చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్.. ఫాంటమ్ ఫిల్మ్స్‌తో జట్టు కట్టింది. తమ సినిమా నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార విభాగం ఈ మేరకు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుందని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. జాయింట్ వెంచర్(జేవీ)లో చెరో 50 శాతం వాటా ఉంటుందని వెల్లడించింది. ఫాంటమ్ ఫిల్మ్ ్స కంపెనీని ప్రముఖ డెరైక్టర్లు అనురాగ్ కాశ్యప్, వికాశ్ బహల్, విక్రమాధిత్య మోత్వానే, మధు మాంటెనాలు నెలకొల్పారు. భారత్, విదేశాల్లో సినిమాల పంపిణీతోపాటు ఏటా కనీసం 5-6 సినిమాలు నిర్మించాలనేది ఈ జేవీ ప్రణాళిక.