తిరుమల: ఇస్రో శాస్త్రవేత‍్తలు మంగళవారం ఉదయం శ్రీవేంకటేశ‍్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ కౌంట్‌డౌన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపధ‍్యంలో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత‍్యేక పూజలు చేశారు. ప్రయోగం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత్తలు
Published Tue, Feb 14 2017 8:22 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM
Advertisement
Advertisement