![మోడీ కోసం జశోదా బెన్ ప్రత్యేక ప్రార్థనలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81406903319_625x300.jpg.webp?itok=EurxByYG)
మోడీ కోసం జశోదా బెన్ ప్రత్యేక ప్రార్థనలు
పలన్పూర్: ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఆయన భార్య జశోదా బెన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మోడీ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించి, విజయాలు సాధించాలని దేవుణ్ని కోరారు. శుక్రవారం గుజరాత్లోని బనస్కాంత జిల్లా మగర్వాద గ్రామంలో వెలసిన వీరభద్ర మహారాజ్ ఆలయాన్ని జశోదా బెన్ సందర్శించారు.
శ్రావణ మాసం సందర్భంగా వేలాది మంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. 1980 ప్రాంతంలో ఇక్కడ టీచర్గా పనిచేశానని, అప్పట్లో ఈ ఆలయానికి తరచూ వెళ్లానని జశోదా బెన్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి తాను బదిలీ అయ్యాక మళ్లీ రాలేదని, తన భర్త కోసం ప్రార్థనలు చేయడానికి ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చానని బెన్ చెప్పారు. జశో్దా బెన్కు మోడీ దూరంగా ఉంటున్నా ఆమె భర్త కోసం పూజలు చేస్తుంటారు.