mohammad
-
‘మిలాద్ ఉన్ నబి’: మహా ప్రవక్త జననం
అజ్ఞానతిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతులతో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు 1450 సంవత్సరాలు అవుతున్నా ఆ మహనీయుని బోధలు మనవద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని గనక మనం ఆచరించగలిగితే, నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించు కోవచ్చు. నేటి పరిస్థితుల నేపథ్యంలో ముహమ్మద్ ప్రవక్త(స) బోధనల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.క్రీ.శ. 571 ఏప్రిల్ నెల ఇరవయ్యోతేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో ముహమ్మద్ ప్రవక్త(స) జన్మించారు. తల్లి దండ్రులు ఆమినా, అబ్దుల్లాహ్. ఈ మహనీయుడు జన్మించక ముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య అక్కున చేర్చుకున్నారు. నీతి, నిజాయితీ, సేవాతత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఈ కారణంగానే ఆయన ప్రజల మనసులు చూరగొని ‘సాదిఖ్ ’గా, ‘అమీన్’ గా పిలవబడ్డారు. ముహమ్మద్‌కు చదవడం, రాయడం రాదు. అయినా ఆయన బోధలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. నాటి యావత్ అరేబియా ద్వీపకల్పమంతా ఆయన బోధనలకు ఆకర్షిత మైంది. ఫలితంగా సమస్త దుర్మార్గాలూ అంతమయ్యాయి. అసత్యం, అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితనం, హత్యలు, అత్యాచారాలు అన్నీ సమసి పోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుంచి, స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్ళూనుకుంది. అన్నిరకాల చెడులు, అసమానతలుఅంతమై పొయ్యాయి.బడుగులు, బలహీనుల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి, సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే, ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ‘ముహమ్మద్ ’ మాత్రమేనని ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూల గ్రంథాలన్నీ ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహా పురుషులను గురించి మైకేల్ హెచ్.హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రశంసించిన ఆమహనీయులు నేడు మనమధ్యలేరు.కాని ఆయన బోధనలు మనవద్ద సురక్షి తంగా ఉన్నాయి. మనం వాటిని ఆచరించ గలిగితే చాలు. ఎందుకంటే, నేటి మన సమాజం అన్నిరకాల అవలక్షణాలతో సతమతమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతప్రగతి సాధించినా, నైతిక, ధార్మిక, మానవీయ రంగాల్లోమాత్రం తిరోగమనంలోనే ఉన్నామన్నది నిజం. నేటి మన సమాజంలో ఏరంగమూ సంతృప్తికరంగాలేదు. ఎంత ప్రగతిపథంలో పయనిస్తున్నా, నేటికీ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. స్త్రీలకు రక్షణలేని పరిస్థితి. అవినీతి, అక్రమాలకు కొదవే లేదు. మద్య΄ానం, జూదం, అశ్లీలం, అంటరానితనం, నిరక్షరాస్యత, ఆడసంతానం హత్యలు, అత్యాచారాలు, హత్యా రాజకీయాలు నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ సమసి΄ోవాలంటే, సమాజం నుండి ఈ దుర్మార్గాలు అంతం కావాలంటే, నీతి, నిజాయితీలతో కూడిన, ఎలాంటి వివక్ష, తారతమ్యాలకు తావులేని, ఉన్నత మానవీయ విలువలతో నిండిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్ నిర్మాణం కావాలంటే ఈ అమృత బోధనలను అధ్యయనం చేయాల్సిన, ఆచరించాల్సిన అవసరం ఉంది.(నేడు ప్రవక్త జయంతి ‘మిలాదున్నబీ’)– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Bangladesh Political Crisis: బంగ్లాలో నేడే తాత్కాలిక సర్కారు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో గురువారం తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ బుధవారం ఈ మేరకు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. యూనుస్ సర్కారుకు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న 84 ఏళ్ల యూనుస్ హుటాహుటిన స్వదేశం చేరుకోనున్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని బంగ్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇదో గొప్ప అవకాశం. మతిలేని హింసతో దాన్ని చేజార్చుకోవద్దు. హింసకు పూర్తిగా స్వస్తి చెబుదాం. పారీ్టలతో పాటు అందరికీ ఇది నా విజ్ఞప్తి’’ అన్నారు. సాహస విద్యార్థుల వల్లే దేశంలో ఇంతటి విప్లవం సాధ్యమైందని ప్రశంసించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనుస్ పేరును విద్యార్థి సంఘాల నేతలే ప్రతిపాదించడం తెలిసిందే. రెచి్చపోయిన మూకలు బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హింసాకాండ బుధవారం కూడా నిరి్నరోధంగా కొనసాగింది. హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఒక్క మంగళవారమే దేశవ్యాప్తంగా 29 మంది పార్టీ మద్దతుదారులను హతమార్చారు. దాంతో గత నెల రోజుల్లో దేశవ్యాప్త హింసకు బలైన వారి సంఖ్య 470 దాటింది. హిందువుల ఇళ్లు, వ్యాపార సముదాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకుంటూ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రఖ్యాత జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని లూటీ చేశారు. అనంతరం దాన్ని నేలమట్టం చేశారు. ఆయన ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించుకున్న 3,000 పై చిలుకు సంగీత పరికరాలలకు నిప్పు పెట్టారు. దాంతో కుటుంబంతో సహా రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పలుచోట్ల ముస్లిం యువకులు, మత పెద్దలు ఆలయాలకు, హిందువుల నివాసాలకు రక్షణ కల్పిస్తూ కన్పించారు. మరోవైపు పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. పరిస్థితి మరింత విషమిస్తుందన్న వదంతులకు జడిసి వారు మూకుమ్మడిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి తోడు పోలీస్స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! శాంతిభద్రతల పరిరక్షణకు విద్యార్థులు, యువకులే రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ను నియంత్రణ తదితర బాధ్యతలు నిర్వర్తిస్తూ కన్పించారు. శాంతిభద్రతలను కాపాడటం కేవలం సైన్యం వల్ల అయ్యే పని కాదని ఆర్మీ చీఫ్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నట్టు చెప్పుకొచ్చారు.ప్రొఫెసర్ నెత్తిన ముళ్ల కిరీటం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ‘పేదల బ్యాంకర్’గా, బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ పితామహునిగా పేరొందారు. 1940లో చిట్టగాంగ్‌లో జని్మంచిన ఆయన ఢాకా వర్సిటీలో చదువుకున్నారు. పీహెచ్డీ తర్వాత పలు విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా చేశారు. బంగ్లాకు తిరిగొచ్చి బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్‌ను స్థాపించారు. పేదలకు చిన్న రుణాలిచ్చే ఈ మైక్రోఫైనాన్స్ సంస్థ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో యూనుస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. షేక్ హసీనా 2008లో రెండోసారి అధికారంలోకి వచి్చనప్పటి నుంచీ ఆమెతో మనస్ఫర్ధలొచ్చాయి. అవినీతి సహా ఆయనపై పలు ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. కారి్మక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలి ఆర్నెల్ల జైలు శిక్ష పడటంతో యూనుస్ దేశం వీడారు. ఖలీదా ర్యాలీ విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బుధవారం ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించింది. గృహనిర్బంధం నుంచి విడుదలైన పార్టీ చీఫ్ బేగం ఖలీదా జియా (79) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు మూకుమ్మడిగా కదిలి షేక్ హసీనా సర్కారును సాగనంపడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. ‘‘ఇది హింసా ప్రతీకారాలకు సమయం కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రేమ, శాంతి, సామరస్యాలు. అవే దేశ పునరి్నర్మాణానికి చోదక శక్తులు కావాలి’’ అన్నారు. ‘‘యువతే మన భవిత. వారి కలలను సాకారం చేసేలా ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దుకుందాం. రక్తపాతం, విధ్వంసం, ఆగ్రహావేశాలు, ప్రతీకారాలకు తావియ్యొద్దు’’ అని పిలుపునిచ్చారు.400 మంది భారతీయులు వెనక్కు కల్లోలం నేపథ్యంలో అక్కడున్న భారతీయులు ముందుజాగ్రత్తగా వెనక్కు వస్తున్నారు. వారికోసం ఎయిరిండియా, ఇండిగో బుధవారం ఢాకా నుంచి ఢిల్లీ, కోల్‌కతాకు ప్రత్యేక విమానాలు నడిపాయి. వాటిలో 400 మందికి పైగా తిరిగొచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి అత్యవసరం కాని 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్టు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంత ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.కొంతకాలం భారత్‌లోనే హసీనా: వాజెద్ ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే గడుపుతారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బుధవారం వెల్లడించారు. పలు దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోసం హసీనా ప్రయతి్నస్తున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘మా అమ్మ ప్రస్తుతం ఢిల్లీలో నా సోదరితో పాటు ఉన్నారు. కొంతకాలం అక్కడే ఉంటారు’’ అని చెప్పారు. లండన్ వెళ్లాలని హసీనా భావించగా ఆశ్రయం కలి్పంచేందుకు బ్రిటన్ నిరాకరించడం తెలిసిందే. -
పార్ట్-2 కూడా ఉంది.. చావడానికైనా రెడీ: రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హై టెన్షన్ క్రియేట్ చేశాయి. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం మజ్లిస్ నేతలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ మజ్లిస్ నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మరోవైపు.. రాజాసింగ్ వీడియోపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్.. ముస్లింల మనోభావాలు కించపరిచారంటూ మజ్లిస్ నేతలు ఆందోళనలకు దిగారు. మంగళవారం ఉదయం ఎంఐఎం ఎమ్మెల్యే బలాల.. సీపీ కార్యాలయానికి వెళ్లారు. రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో పోలీసులు.. యూ ట్యూబ్‌ను రాజాసింగ్ వీడియో తొలగించాలని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు యూ ట్యూబ్ వివాదాస్పద వీడియోను తొలగించింది. ఇదంతా జరుగుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. మునావర్‌కు కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చేప్పాను. కౌంటర్ వీడియోను యూట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగినా నేను సిద్ధం. ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నాను. ఇది కూడా చదవండి: మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హైటెన్షన్ -
అత్యంత ఖరీదైన ఔషదం.. వారం రోజుల్లోనే రూ.18 కోట్లు
కన్నూర్: మానవత్వమే మిన్న అని మరోసారి రుజువైంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని కాపాడేందుకు అందరూ ఒక్కటై సాయం అందించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు రూ.18 కోట్లకు పైగా విరాళాల రూపంలో అందించారు. కేరళకు చెందిన పీకే రఫీక్, మరియమ్మ దంపతుల కుమారుడు మొహమ్మద్ (18 నెలలు) స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతున్నాడు. రెండో సంవత్సరం వచ్చేలోగా ఆ చిన్నారికి ఈ డోస్ అందించాల్సి ఉంటుందని వైద్యులు వారికి సూచించారు. ఇందుకు అవసరమైన సాయం సేకరించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఎం.విజిన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ వారం క్రితం క్రౌడ్‌ఫండ్ ద్వారా విరాళాలు అందించాలని ప్రజలను కోరింది. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేపట్టారు. దీంతో వారం రోజుల వ్యవధిలోనే చిన్నారి బ్యాంకు అకౌంట్లో రూ.18 కోట్లకు పైగానే డబ్బు జమయ్యాయి. బ్యాంకు అకౌంట్‌కు రూ.18 కోట్లకు పైగానే అందాయని, ఇక విరాళాలు అందివ్వవద్దని మత్తుల్ పంచాయతీ ప్రెసిడెంట్ ఫరిషా సోమవారం ప్రజలను కోరారు. కాగా, మొహమ్మద్ సోదరి అఫ్రా(15)కు కూడా గతంలో ఇదే వ్యాధి సోకడం గమనార్హం. -
పాక్ జవాబు కోసం ఎదురుచూపు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆమె’కోసం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి సైబర్ నేరంలో పట్టుబడిన పాకిస్తాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ కేసులో సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు పాక్ సమాధానం కోసం ఎదురు చూస్తు న్నారు. ఈ కేసులో కీలకఘట్టమైన ‘కాన్సులర్ యాక్సెస్’3 నెలల క్రితమే పూర్తయినా ఇప్పటి వరకు ఆ దేశం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇతడికి ఆ దేశం జారీ చేసిన పాస్‌పోర్ట్, దాని ఆధారంగా తీసుకున్న వీసాల పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆరునెలల క్రితమే లేఖ రాశారు. గతేడాది జూన్ ఆఖరివారంలో ఢిల్లీ వెళ్లిన బృందం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ద్వారా ఈ లేఖను పంపారు. నమ్మించి వివాహం... నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ పాకిస్తానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి అతడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ‘కూతురినే’ వేధించి కటకటాల్లోకి... ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించింది. దీంతో అతడు కక్షకట్టి ఆమె కుమార్తె నగ్న చిత్రాలు తీసి కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. గత నెల్లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో అతడు అబ్బాస్ పేరుతో బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్ పోర్ట్ తీసుకున్నట్లు వెల్లడైంది. నిర్ధారించాలంటే ‘ధ్రువీకరించాల్సిందే’.. మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్లు ఉన్న సర్టిఫికెట్ల తోపాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపుకార్డులతోపాటు పాక్ పాస్‌పోర్ట్‌కు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి వద్ద ఉన్న సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005– 08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇక్రమ్ 2009 వరకు పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. అతడు పాక్ జాతీయు డనే అంశంతోపాటు ఈ విషయాన్నీ పాక్ ధ్రువీకరిస్తేనే బోగస్వ్యవహారం నిర్ధారణ సాధ్యమవుతుంది. తీహార్‌కు వచ్చిన కాన్సులేట్ అధికారులు... గత ఏడాది నవంబర్‌లో సైబర్‌క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌ను కోర్టు అనుమతితో ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అక్కడి నుంచే పాకిస్తాన్ కాన్సులేట్ అధికారులకు సమా చారం ఇచ్చారు. అతడు పాక్ జాతీయుడని ధ్రువీకరిస్తే అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను జారీ చేయాలి. వీటి ఆధారంగానే ఈ కేసులో తదుపరి చర్యలు ఉండనున్నాయి -
4 బంతుల్లో 4 వికెట్లు
జైపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2018–19 సీజన్లో అరుదైన ఘనత నమోదైంది. రాజస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ పేసర్ ముదస్సిర్ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 99వ ఓవర్ బౌలింగ్ చేసిన ముదస్సిర్ (5/90) మూడో బంతికి చేతన్ బిస్త్ (159; 24 ఫోర్లు)ను ఆ తర్వాత వరుసగా తజిందర్ సింగ్ (0), రాహుల్ చహర్ (0), తన్వీర్ ఉల్ హఖ్ (0)లను ఎల్బీడబ్ల్యూలుగా పెవిలియన్ పంపాడు. రంజీ చరిత్రలో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం ఇది రెండో సారైతే... ఆ నాలుగు ఎల్బీడబ్ల్యూలే కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఢిల్లీ ఆటగాడు శంకర్ సైనీ (1988 హిమాచల్ ప్రదేశ్‌పై) ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూకశ్మీర్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. మరో హ్యాట్రిక్..: మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తమిళనాడు పేసర్ ఎం. మొహమ్మద్ మరో హ్యాట్రిక్ నమోదు చేశాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 142వ ఓవర్ చివరి బంతికి యశ్ దూబే (6)ను ఔట్ చేసిన మొహమ్మద్ (4/98) తన మరుసటి ఓవర్ తొలి రెండు బంతులకు రజత్ పాటిదార్ (196; 17 ఫోర్లు, 1 సిక్స్), మిహిర్ హిర్వాణి (0)లను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు. -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా ముస్తాక్ అహ్మద్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడిగా మహ్మద్ ముస్తాక్ అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సోమవారం జరిగిన హెచ్ఐ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్రొ నింగోమ్బం, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆసిమా అలీ, భోలనాథ్ సింగ్ (జార్ఖండ్) ఉపాధ్యక్షులుగా, రాజీందర్ సింగ్ (జమ్మూ కశ్మీర్) కార్యదర్శిగా ఎన్నికవగా, కోశాధికారిగా తపన్ కుమార్ దాస్ (అస్సాం) కొనసాగనున్నారు. మహిళల హాకీ మాజీ కెప్టెన్ అసుంత లక్రా, ఫిరోజ్ అన్సారి (చత్తీస్‌గఢ్)లు సంయుక్త కార్యదర్శులయ్యారు. -
పండగ పూట పలావు ముక్కల కత!
ఈద్గాలో నమాజు అయిపోయినాక ఒక్కరికి కూడా ఈద్‌ముబారక్ చెప్పకుండా, ఛాతీ ఛాతీ కలిపి వాటేసుకోకుండా, చిల్లర డబ్బుల కోసరం వెంటపడే బుడబుక్కలోళ్లని పుణ్యానికి కూడా పట్టించుకోకుండా ఏందో అర్జెంటు పనున్నట్టుగా యింటికొచ్చేస్తాడు మా నాయిన. ఆయన వెనకనే మా అన్నా నేనూ. పలావొండుంటారు కదా. అదీ కత. కానీ మా నాయిన పుణ్యమా అని ఏ రంజాను పండక్కి కూడా పస్టు పస్టు తినే బాగ్యం మాకు లా. ముందు పెండెం రవికి క్యారేజి కట్టాలి. ఆనేకనే మేము తినాలి. మా నాయినమ్మా అమ్మా అయితే అప్పుడు కూడా తినేదానికిలా. రవికి కట్టిన క్యారేజీని మా నాయిన తీసకెళ్లి వాళ్లింట్లో యిచ్చొచ్చేసినాక – పలావెంకారెడ్డోళ్లొచ్చి పండగ దావత్ చేసెళ్లినాక – బిస్తర్ ఎత్తుకొని, బాసన్లు సర్దుకొని, అప్పుడు తినాలి మా నాయినమ్మా అమ్మా. పాపం వాళ్లు పొద్దుననంగా లేచి పరగడుపున వంటపని మొదలుపెట్టి, మావుసం ముక్కులు శుద్దం చేసుకొని, కొబ్బరి మసాలా నూరుకొని, గోంగూర వొలుచుకొని, కట్టెల పొయ్యిమీద సస్తా బతకతా అంతా రెడీ చేసి పెట్టుంటే మా నాయిననేవోడు నమాజు నుంచి రావడంతోటే ‘మీరు తిన్నారంటమ్మే’ అని అడగబళ్లా? ‘రవికి క్యారేజీ కట్టినారంటమ్మే’ అని అడగతాడు.అడగటమే కాకుండా అటకమీది నుంచి అయిదు డబ్బాల క్యారేజీ దించి, దాని నిండుగా ఆయన సొహస్తాలతో పలావు ముక్కలూ, ఖుర్మా, గట్టి సేమ్యాలూ, పాలసేమ్యాలూ దిట్టంగా పెట్టుకుంటాడు. మా అమ్మా నాయినమ్మా ఎంతో యిష్టంగా ఒండుకున్న పలావులోని ముక్కలన్నీ మా నాయిన లోడుకొని లోడుకొని పోతా వున్నా వాళ్లిద్దరూ నోరు మెదపడానికి లా. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకొని చూస్తా వుండిపోవాల్సిందే. యింతకీ యీ పెండెం రవి ఎవరో తెలియాలంటే గరానా వొంశెస్తుడైన మా నాయిన పూటకు ఠికానా లేని కరెంటు పనోడు ఎట్టయినాడనే కథను తెలుసుకునే పనుంది.మా నాయిన సొంతూరు కావలికి ఉత్తరం తట్టున్న రామాయపట్నం. ‘తెట్టు’ దగ్గిర దిగి మూడు మైళ్లు తూర్పుకెళితే తెల్లటి యిసకా, దూరంగా బులుగు రంగులో సముద్రం ఆనేక మా ఊరూ అవుపిస్తాయి. పొట్టి పెంకుల యిళ్లతో, తాటాకు వసారాలతో, చిల్లచెట్లతో, బకింగ్ హాము కాలవతో బలే కళగా వుంటుంది మా వూరు. మేం పిలకాయలుగా వున్నప్పటి కంటే మా నాయినోళ్ల చిన్నతనంలోనే మా వూరు యింకా కళగా వుండేదంట. అట్టా కళగా వున్నరోజుల్లోనే ఆడ మా తాత మొహమ్మద్ సాయిబు చేపలాపారం చేస్తా లాట్గవర్నర్ అమ్మా మొగుడిలా చెలాయిస్తా వుండేవాడంట. అప్పట్లో మా తాత చేతి కింద నాలుగు నాటు పడవలు, పదిమంది పట్టెపోళ్లు, లెక్కలు రాయడానికి ఇద్దరు గుమాస్తాలు వుండేవాళ్లంట. మా తాత హయాములో మాకు సముద్రం దగ్గిర పదిహేనెకరాల సరుగుడు తోట, తెట్టు దగ్గిర రోడ్డు వారగా బెంగుళూరు మామిడితోట,ఆరెకరాల పొలం వుండేవి. (యిప్పుడు యాబై అంకణాల యింటి జాగా మాత్రమే మిగిలింది.) అట్టా డబ్బుదస్కం తిండీ గిండీ జంజామతంగా వున్న మా యింట్లో మా నాయిన ఒక్కగానొక్క మొగపిల్లోడిగా పుట్టినాడు. అందువల్ల మా తాతకీ, మా నాయినమ్మకీ, మా నాయిన కంటే ముందూ వెనకా పుట్టిన మా ముగ్గురు మేనత్తలకీ మా నాయినంటే బలే గారాబం. మా నాయిన యిది కావాలంటే కావాలి. అది వద్దంటే వద్దు రీతిలో చలాయించినాడు. ముందు నుంచీ కూడా మా నాయినకు చదువంటే బలే యింటరెస్టు వుండటం చూసి మా తాత మా నాయిన్ని ఫస్టుఫారం అయిపోయినాక నెల్లూరులోని సిఎంసి హైస్కూలులో సెకండ్ ఫారం చేర్పించినాడు.ఇస్కూల్లో చదువుకోవడం, కుమార్గల్లీలోని మా పెదత్త (మా నాయిన పెదక్క) యింట్లో తిని పొణుకోవడం తప్పితే యింకో పని ఎరగని మా నాయినకు ఎస్ఎల్సిలో పడింది దెబ్బ. అది కూడా మా పెదత్త బర్తయిన నెల్లూరు సాయిబు రూపంలో. నెల్లూరు సాయిబంటే మా యిలాకాలో చిన్న కత కాదు. ఆయనంత శ్రీమంతుడు, జల్సా మనిషి యింకెవ్వరూ లేరు మా యిళ్లలో. (నెల్లూరు టౌనోడినని బలే డాబుసరిచూపిస్తాడు కాబట్టి మా యిళ్లల్లో ఆయన్ని నెల్లూరు సాయిబు అని పిలస్తారు). మా పెదత్త కట్నం కింద ‘ఊదుబుట్ట’ నిండుగా ఎనబై సవర్ల బంగారాన్ని మా తాత పెడితే ‘నేనంత లెవిలు తక్కువోణ్ణా’అని నలగరి ముందర నగల బుట్టని కాలితో తన్నినాడంటే నెల్లూరు సాయిబు మిడిసిపాటు అప్పట్లో అలా వుండేది. ఒకప్పుడు కుమార్గల్లీలో సగం ఆస్తులకు ఓనరయిన మా నెల్లూరు సాయిబు గానాబజానా ఆడోళ్ల పిచ్చిలో పడి ఆస్తులన్నీ కరగపెట్టుకున్నా, బెట్టుసరికి పోయి, ‘నవాబుగారూ’ అంటా మళ్లా ఏ పిలుపు వచ్చినా కాదనుకుండా తయారయి పోతా వుండేవాడంట. అట్టాంటి అలివిగాని మనిషైన నెల్లూరు సాయిబు ఒకరోజు వున్నట్టుండి మా పెద్దత్తను పట్టుకొని సావగొట్టేసినాడు – ‘బిడ్డలు ఎదిగొస్తా వున్నారు... నీ జల్సాలు మానుకోయ్యా’ అని నోరు తెరిచి చెప్పిన పాపానికి. సావగొట్టడమే గాకుండా ‘నువు నాకు అక్కర్లేదు పో’ అని మా పెదత్తని మా తాతింటికి తరిమేసినాడు. ఆమె వెనుకనే ఏడ్చుకుంటా మా నాయిన. ఆ రావడం రావడం మూడు నెలల దాక మా పెదత్త పోనేలా. నెల్లూరు సాయిబు రానేలా. యింక చేసేదేముంది. లక్షణంగా పరీక్షలు రాయాల్సిన మా నాయిన గోళ్లు గిల్లుకుంటా ఇంట్లో కూచుండిపోయినాడు. అప్పటికే మా తాత యాపారంలో లాసయిపోయి, మా రెండో అత్త పెళ్లికి సరుగుడు తోట అమ్మకనూకి, చేతిలో డబ్బులాడక అల్లాడతా వున్నాడు. ఆ టయిములో మా పెదత్తొచ్చి నెత్తిన కూచోవడమే కాకుండా మా నాయిన చదువు ఖరాబై పోవడంతో ఆ విసుగునంతా మా నాయిన మీద చూపించినాడంట మా తాత. ఒకరోజు మా బరెగొడ్డు పేడేస్తా వుంటే – ‘రే.. అబయా.. గమ్మున్నట్టా కూచోకపోతే ఆ పేడైనా ఎత్తరాదా’ అన్నాడంట మా నాయినతో.అంతే. మా నాయినకు పొడుచుకొచ్చేసింది.‘యీ నా కొడుకు నన్నింత మాటంటాడా?’ అని అదే రోజు రాత్రి మా యినప్పెట్టెలో నుంచి పదో యిరవయ్యో అంటే ఎల్లికొల్ల కదా. వాటితో రెండు రోజుల పాటు హాయిగా నెల్లూరులో తిరిగి ఆనేక బస్సెక్కి నేరుగా కర్నూల్లో దిగినాడంట మా నాయిన. ఆడ ఏమి చేయాల్నో తెలియక ఆఖరకుఎవుర్నో బతిమిలాడుకొని కరెంటు పనిలో చేరిపోయినాడు.కర్నూలులో మా నాయన పని అట్టా వుంటే రామాయపట్నంలో మా తాత పని యింకోలాగా వుంది. పాపం, కొడుకు కనిపించకుండా పోయేసరికి పిచ్చోడాల తయారయ్యి ఊరూరా తిరిగి వెతకడం మొదలు పెట్టినాడాయన. ఆరు నెలలకి కూడా మా నాయిన కాణ్ణుంచి ఉత్తరం పత్తరం లాకపోయేసరికి ‘వారం రోజుల్లో నా కొడుకుని చూపించినావో సరేసరి. లాకపోతే సముద్రంలో దూకిచస్తా’ అని ఫైనలు వార్నింగిచ్చేసింది మా నాయినమ్మ. దాంతో మా తాత ‘ఎట్టరా బగమంతుడా’ అనుకుంటా వుంటే ఏడో నెలలో మా నాయిన ఊర్లోకి దిగినాడు, ఒక చేతిలో కరెంటు పనితో యింకో చేతిలో ఎనబై రూపాయిల తొలి సంపాదనతో.ఇదీ మా నాయన కరెంటు పనోడైన కత.నిజానికి యీడతో కతయిపోవాల్సిందేకానీ మా నాయన మామూలోడు కాదు కాబట్టి యింకా కత నడిపించినాడు. మాతాత అన్న మాటని అన్నాళ్లు పోయినా మనసులో నుంచి చెరిపెయ్యకుండా ‘నువ్వూ వద్దూ నీ ఆస్తీ వద్దు’ అంటా కావలికి వచ్చేసినాడు.కావలిలో మా నాయినకు దొరికిన గురువే పెండెం రవి.అప్పట్లో ఆయన పెద్ద ఎలక్ట్రికల్ కాంట్రాక్టరు. మంచి పలుకుబడున్నోడే కాకుండా బలే మనసున్న మనిషాయన. కావల్లో దిక్కూ దివాణం లాకుండా తిరుగుతున్న మా నాయిన్ను చూసి పెండెం రవే పిలిచి ఆయన చేతికిందకు తీసుకున్నాడు. అంతేగాకుండా కన్నకొడుకాల పోషించి పెద్ద పనిమంతుడిలా తీర్చిదిద్దినాడు.అందుకనే మా నాయినకు రవీ అంటే అంత బయం. అంత బక్తి. రంజాను పండగొస్తే ఆయనకు క్యారేజీ కట్టి తీసకెళ్లి ఇస్తేనే మా నాయినకు పండగ చేసుకున్నట్టు లెక్క. లాకుంటేలా.అయితే దేనికైనా మితం వుండబళ్లా?ఆ సముచ్చరం క్యారేజీ తీసకపోయిన మా నాయన మళ్లా కాసేపటికే వచ్చి యింకో క్యారేజీ కావాలని కూచున్నాడు.‘రవోళ్ల కూతురూ అల్లుడూ వచ్చుండారు. వాళ్లకు కూడా పలావు పెట్టబళ్లా?’ అని డిమాండు చేసినాడు. ఆయన డిమాండింగు చూసి మా అమ్మకు సర్రన ఎక్కింది కోపం. ‘యాడుందయ్యా అంత? ఏం బళ్లేదులే’ అనింది అడ్డం చెబుతా.మా నాయిన వింటేగా. ‘పండగ చేసుకునేది మనం తినడానికంటమ్మే. తీ గబాల్న’ అంటా మళ్లా రెండో క్యారేజీలో పలావూ, ముక్కలూ పెట్టుకొని వెళ్లిపోయినాడు. ఆ దెబ్బకి దబరలోని సగం ముక్కలుఖాళీ. పలావెంకారెడ్డోళ్లు దావత్‌కి వచ్చినాక ‘యీ ఒక్క ముక్కే.. యీ ఒక్క ముక్కే’ అంటా మా నాయిన ఎచ్చులకి పోయి మిగిలిన ముక్కలన్నీ కూడా ఖాళీ చేయించేశాడు.యింకేముంది? మొత్తం ఖాళీ!అంతా అయిపోయినాక ఎంకారెడ్డోళ్లని సాగనంపి, ఆకొక్క వేసుకొని, ఫ్యాను కింద హాయిగా నిదరపోతున్న మా నాయిన్ను ఊసురోమంటా చూసినారు మా నాయినమ్మా అమ్మా.ఉత్త మెతుకులూ టమేటా తొక్కులూ మిగిలిన పలావు దబర తట్టే చూస్తా ‘యీ నా కొడుకుని కని ఏనాడు బాగుపడ్డానని’ అనింది మా నాయినమ్మ మంటగా.‘యీ మహానుబావుణ్ణి కట్టుకొని ఏమి సుకపడ్డానని?’ అనింది మా అమ్మ కచ్చగా.ఆనేక వాళ్లిద్దరూ పొయ్యిలోని బొగ్గుతో మొకాలు కడుక్కొని, ఆ ఉత్త మెతుకులనే గోంగూరతో కలుపుకొని తిని, గమ్మున పొణుకున్నారు. -
హుస్సాముద్దీన్‌కు కాంస్యం
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో షక్రియర్ అహ్మదోవ్ (రష్యా) చేతిలో హుస్సాముద్దీన్ ఓడిపోయాడు. మరోవైపు వికాస్ (75 కేజీలు), అమిత్ (49 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. -
‘యోగికి ఆ ముస్లిం యువకుడంటే ప్రేమ’
లక్నో: ఓ ముస్లిం యువకుడికి ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎంత అంటే అతడు ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కలిసేలాగా.. ఒక్కోసారి పెద్ద పెద్దవారికే దొరకని సీఎం అపాయింట్మెంట్ అతడికెలా సాధ్యం అని అనుకుంటున్నారా? మరేంలేదు ఆ యువకుడు సేవలు చేసేది గోరఖ్‌నాథ్ ఆలయంలో. అవును.. పేద కుటుంబం నుంచి వచ్చిన మహ్మద్ అనే నేటి యువకుడు పదేళ్ల ప్రాయంలోనే గోరఖ్‌నాథ్ ఆలయానికి చేరుకున్నాడు. అతడి తండ్రి ఇనాయతుల్లా నుంచి బాధ్యతలు అందుకొని స్వచ్ఛంద సేవకుడిగా ఇక్కడి ఆలయంలోని గోశాలలో పనిచేస్తున్నాడు. ఇందులో సేవలందించే ఇతర సన్యాసుల మాదిరిగానే అతడు కూడా ఇప్పటికీ ఓ బ్యాచిలర్. కొంతమొత్తం పైకంతోపాటు అక్కడే భోజనం చేస్తూ హాయిగా సంతోషంగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడంట. దిగ్విజయ్నాథ్, వైద్యనాథ్ మఠాదిపతులుగా ఉన్న సమయంలో మహ్మద్ తండ్రి ఇనాయతుల్లా సేవలందించగా యోగి ఆదిత్యనాథ్ మఠాదిపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహ్మద్ సేవలందిస్తున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిందుమతస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన మత ఆచారాలు పాటిస్తుంటాడు. ‘నేను నా బాల్యం మొత్తాన్ని ఇంట్లో మాదిరిగానే గోరఖ్‌నాథ్ ఆలయంలో గడిపాను. నా జీవితకాలం మొత్తం ఇక్కడే పనిచేస్తాను. యోగీజీ నాకు చాలా గౌరవం ఇస్తారు.. ప్రేమ చూపిస్తారు. గోవులపట్ల నా అంకిత భావాన్ని యోగీజీ బాగా ఇష్టపడతారు. ఆయన గోవులు తినేవరకు బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు’ అని మహ్మద్ తెలిపారు. ‘ఆయన కరడుగట్టిన హిందుత్వవాదిగా కనిపించినప్పటికి వ్యక్తిగతంగా మాత్రం ఆయన ప్రతిఒక్కరికి అండగా ఉంటారు. గౌరవిస్తారు’ అని కూడా మహ్మద్ చెప్పాడు. -
ప్రవక్త మార్గం అనుసరణీయం
– లావుబాలీ దర్గా పీఠాధిపతి అబ్దుల్లా హుసేన్ బాద్షా ఖాద్రి కర్నూలు (ఓల్డ్‌సిటీ): మహమ్మద్ ప్రవక్త మార్గం అనుసరణీయమని లావుబాలీ దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా అబ్దుల్లా హుసేన్ బాద్షా ఖాద్రి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక దర్గా ఆవరణలోని ఫైజానే లతీఫ్ మదరసాలో హిఫ్జ్ విద్యార్థులు, ఉర్దూ పాఠశాలల విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలపై ప్రసంగాలు నిర్వహించారు. మెరుగైన ప్రసంగాలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి మార్గం చూపారన్నారు. ఆయన అల్లా ఆదేశాలను ఆచరించి చూపిన గొప్ప ప్రవక్త అని కొనియాడారు. కార్యక్రమంలో దర్గా సజ్జాదే నషీన్ ఖల్ఫాయే అక్బర్ సయ్యద్‌షా హాషిం ఆరిఫ్‌పాషా ఖాద్రి, సయ్యద్‌షా అల్తాఫ్ హుసేని, సయ్యద్‌షా సుల్తాన్ మొహియుద్దీన్ హుసేని, మొయీజ్పాషా ఖాద్రి, సయ్యద్ షుజావుద్దీన్ అహ్మద్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మిలాద్–ఉన్–నబీ
-
మహమ్మద్ ప్రవక్త మార్గం అనుసరణీయం
– కర్నూలులో ఘనంగా మిలాద్–ఉన్–నబీ వేడుకలు – నగరంలో ముస్లింల భారీ ర్యాలీ – రాజ్‌విహార్ సెంటర్లో బహిరంగ సభ, మిలాద్ పతాకావిష్కరణ – ప్రముఖుల హాజరు కర్నూలు(రాజ్‌విహార్): మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం అనుసరణీయమని అహ్లె సున్నతుల్ జమాత్ కార్యదర్శి సయ్యద్ షఫి పాషా ఖాద్రి అన్నారు. ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం కర్నూలులో మిలాద్–ఉన్–నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాతబస్తీలోని లతీఫ్ లావుబాలి దర్గా ప్రాంతం నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు ముస్లింలు భారీ ప్రదర్శనతో వచ్చారు. రోజా దర్గా, కొత్తపేట తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన ర్యాలీలు స్థానిక కిడ్స్ వరల్డ్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలిశాయి. ఇందులో వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం రాజ్‌విహార్ సెంటర్లోని మిలాద్ చౌక్‌లో అహ్లె సున్నతుల్ జమాత్ కార్యదర్శి సయ్యద్ షఫి పాషా ఖాద్రి అధ్యక్షతన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో చివరి ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా అని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గాల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీలు బుట్టా రేణుక, టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్ ఖాన్, హజరత్ లతీఫ్ లావుబాలీ దర్గా సజ్జాదేనషీన్ ఖలీఫాయే అక్బర్ సయ్యద్‌షా హాషిం ఆరిఫ్ పాషా ఖాద్రి అతిథులుగా హాజరై ప్రసంగించారు. – ప్రవక్తది శాంతి మార్గం : బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గాలు శాంతికి దోహదపడతాయి. హిందూ, ముస్లింల ఐక్యతకు కర్నూలు నగరం గొప్ప చిహ్నం అని, దీనిని ఇలాగే కొనసాగించాలి. ఒకరికొకరు ప్రేమలు పంచుకుంటూ కలిసి పండుగలు చేసుకోవాలి. ప్రవక్త మద్యం, వడ్డీ వ్యాపారం వంటి వాటికి నిషేధం విధించడం, మహిళలకు సమున్నత స్థానం కల్పించడం మంచి పరిణామాలన్నారు. – సర్వమానవాళి సంక్షేమానికి కృషి చేశారు : టీజీ వెంకటేష్, ఎంపీ మహమ్మద్ ప్రవక్త సర్వ మానవాళి సంక్షేమం కోసం కృషి చేశారు. ఆయన జీవితం ఆదర్శనీయం. కర్నూలు ప్రజలు కుల మతాలకు అతీతంగా జీవిస్తున్నారు. వ్యాపారాలు, సేవా, సహాయ కార్యక్రమాలను కలిసే చేసుకుంటున్నారు. అందరూ బాగుండేందుకు ఈ మార్గం ఉత్తమమైంది. మహమ్మద్ ప్రవక్త గొప్ప వారు : ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే మహమ్మద్ ప్రవక్త చాలా గొప్ప వ్యక్తి. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముస్లింలు బతకడం అభినందనీయం. బక్రీదు, వినాయకచవితి పండుగలు ఒకే సారి వచ్చినా కలిసిమెలిసి చేసుకోవడం నగర ప్రజల మత సామరస్యానికి ప్రతీక. ముస్లింల మార్గదర్శి : హఫీజ్ ఖాన్, వైఎస్ఆర్ సీపీ కర్నూలు సమన్వయకర్త. మహమ్మద్ ప్రవక్త (స.అ.స.) ముస్లిం జీవితాలకు మార్గదర్శి. 1,24,000 ప్రవక్తల్లో మహమ్మద్ ప్రవక్త గొప్పవారు. భార్య, భర్త, తండ్రి కొడుకులు, తోటి వాళ్లు ఇలా అన్ని వర్గాల బంధాలను తెలిపిన మహనీయులు. తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నదని చాటిచెప్పి మహిళకు సమాజంలో మహోన్నత స్థానం కల్పించారన్నారు. ఆయన ఐదుపూటల నమాజు ఒక్కటే కాదు దేశభక్తిని కూడా నేర్పారు. – ఆయన విశ్వప్రవక్త: సయ్యద్‌షా ఆరిఫ్‌పాషా ఖాద్రి మహమ్మద్ ముస్లింలకే కాదు, విశ్వానికే ప్రవక్త. శత్రువులను సైతం కరుణించే గొప్ప మనస్తత్వం ఆయనది. ఆదిదంపతులు ఆదమ్, హవాల సంతతి కావడంతో ఎవరెన్ని చెప్పినా మనమంతా సోదరులమే. – ఘనంగా మిలాద్ పతాకావిష్కరణ.. లతీఫ్ లావుబాలి దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ అబ్దుల్లా హుసేని బాద్షా నేతృత్వంలో రాజ్‌విహార్ సెంటర్లోని జుల్ఫిషా, చందేషా దర్గాలో మిలాద్ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ మిలాద్ కమిటీ అధ్యక్షుడు బి.ఇంతియాజ్ అలీ ఖాన్‌తో పాటు కమిటీ సభ్యులు, దర్గాల పీఠాధిపతులు, ముతవల్లులు సయ్యద్ అన్వర్‌బాష ఖాద్రి, సయ్యద్ దాదాబాష ఖాద్రి, వైఎస్ఆర్ సీపీ జాయింట్ సెక్రటరీ తెర్నకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీ సెల్ కార్యదర్శి ఎస్ఎ రహిమాన్, నగర కార్యదర్శి నూరుల్లా ఖాద్రీ, నాయకులు నజీర్ ఆహ్మద్ ఖాన్, నజీర్ ఆహ్మద్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఏఆర్ రెహమాన్‌పై ఫత్వా
తన సంగీతంతో ఎల్లలు చేరిపేసిన ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు అదే సంగీతంతో వివాదాలకు కారణమయ్యాడు. ఇరాన్లో రూపొందిచిన ఓ చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ ముస్లిం మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఏఆర్ రెహమాన్ మత వ్యతిరేఖి అంటూ ముంబయ్ కేంద్రంగా పని చేస్తున్న సున్ని ముస్లిం గ్రూపు రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది. ప్రొఫెట్ మహమ్మద్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వివాదాస్పద చిత్రానికి సంగీతం అందించినందుకు గాను ముంబై కేంద్రంగా ఉన్న ఓ సున్నీ ముస్లిం సంస్థ రెహమాన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. ఇరానీయన్ దర్శకుడు మాజీద్ మజిదీ దర్శకత్వంలో 'ప్రొఫెట్ మొహమ్మద్' జీవిత కథ ఆధారంగా మూడు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో తొలి భాగంగా విడుదలైన 'మొహమ్మద్ : ద మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అదించారు. అయితే ఈ చిత్రంలో ప్రొఫెట్ జీవితంలోని కొన్ని సంఘటనలను వక్రీకరించారని పలు ముస్లిం సంస్థలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ముస్లిం మత సిద్దాంతాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ముస్లిం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రెహమాన్‌పై ఫత్వా జారీ చేశాయి. భారత ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.