ఏఆర్ రెహమాన్పై ఫత్వా
తన సంగీతంతో ఎల్లలు చేరిపేసిన ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు అదే సంగీతంతో వివాదాలకు కారణమయ్యాడు. ఇరాన్లో రూపొందిచిన ఓ చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ ముస్లిం మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఏఆర్ రెహమాన్ మత వ్యతిరేఖి అంటూ ముంబయ్ కేంద్రంగా పని చేస్తున్న సున్ని ముస్లిం గ్రూపు రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది. ప్రొఫెట్ మహమ్మద్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వివాదాస్పద చిత్రానికి సంగీతం అందించినందుకు గాను ముంబై కేంద్రంగా ఉన్న ఓ సున్నీ ముస్లిం సంస్థ రెహమాన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది.
ఇరానీయన్ దర్శకుడు మాజీద్ మజిదీ దర్శకత్వంలో 'ప్రొఫెట్ మొహమ్మద్' జీవిత కథ ఆధారంగా మూడు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో తొలి భాగంగా విడుదలైన 'మొహమ్మద్ : ద మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అదించారు. అయితే ఈ చిత్రంలో ప్రొఫెట్ జీవితంలోని కొన్ని సంఘటనలను వక్రీకరించారని పలు ముస్లిం సంస్థలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ముస్లిం మత సిద్దాంతాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ముస్లిం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రెహమాన్పై ఫత్వా జారీ చేశాయి. భారత ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.