Majid majidi
-
ఏప్రిల్ 20న తెరపైకి బియాండ్ ది క్లౌడ్స్
తమిళసినిమా: బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఏప్రిల్ 20వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రముఖ ఇరానీ దర్శకుడు మజీద్ మజీదీ చిత్రాలు భాషలకతీతంగా ఉంటాయి. సెంటిమెంట్స్‌ను కలబోసి జనరంజక చిత్రాలను తెరకెక్కించే ఈ దర్శకుడు తొలిసారిగా తమిళంలో దర్శకత్వం వహిస్తున్న చిత్రం బియాండ్ ది క్లౌడ్స్. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. నూతన నటుడు ఇషాన్ కట్టర్ హీరోగానూ మలయాళ నటి మాళవిక మోహన్ హీరోయిన్‌గానూ నటించిన ఈ చిత్రం భాష, సంస్కృతిలకతీతంగా సగటు మనిషిని ఎలా ప్రేమించాలన్న టచ్చింగ్ సన్నివేశాలను కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుందంటున్నారు చిత్ర నిర్మాతలు. జీవితాన్ని చిన్న చిన్న అందమైన విషయాలను, మధురమైన స్మృతులను మాట్లాడే చిత్రంగా బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఉంటుందని తెలిపారు.ఈ చిత్రం ఆడియో ఇటీవల నిడారంబరంగా విడుదలై మంచి ఆదరణను పొందుతోందని వారు తెలిపారు. దీని గురించి నిర్మాతలలో ఒకరైన జి.స్టూడియోస్ అధినేత సుజాయ్ తెలుపుతూ ఈ చిత్రం విడుదలనంతరం ఇండియాలో దర్శకుడు మజిద్ అభిమానుల సంఖ్య మరింత పెరుగుతుందనే భావాన్ని వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రాన్ని అన్ని దేశాల్లోనూ ఒకే రోజున విడుదల చేయనున్నామని తెలిపారు. పెద్ద పెద్ద కలలతో తిరిగే 22 ఏళ్ల అమీర్ అనే యువకుడు తప్పు దారి పడితే అతన్ని కాపాడడానికి తన సహోదరి, వారి కోసం పోలీసుల చేతుల్లో అరెస్ట్ అయిన కథానాయకి అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం ఇదని చెప్పారు. మరో నిర్మాత షరీన్ మందిరి కేడియా మాట్లాడుతూ మజీద్ చిత్రాన్ని ఏక కాలంలో ప్రపంచ దేశాల్లో విడుదల చేయ డం ఆయన అభిమానులకే కాకుండా తమకు చాలా ఉత్సాహంగా ఉందన్నారు. మజిద్ కల్పన కథ భాషలకు అతీతంగా భావోద్రేకాలతో కూడి ప్రపంచ దేశాల్లోని ఆయన అభిమానులందరికి మంచి విందు అవుతుందన్నారు. నామా పిక్చర్స్ అధినేత కిషోర్ మాట్లాడుతూ బియాండ్ ది క్లౌడ్స్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. -
దీపిక సూట్ అవ్వదు, అందుకే తీసేశా..!
ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు దీపికా పదుకొనే. అందం అభినయంతో పాటు అదృష్టం కూడా బాగా ఉన్న ఈ బ్యూటి హాలీవుడ్ బాలీవుడ్ లను దున్నేస్తోంది. ముఖ్యంగా పీరియాడిక్ స్టోరీస్ తో పాటు వెస్ట్రర్న్ లుక్స్ లోనూ వావ్ అనిపిస్తోంది. కొంత కాలం క్రితం దీపిక బెగ్గర్ లుక్‌లో కనిపించిన ఫోటోలు ఆమె అభిమానులను కలవరపెట్టాయి. పూర్తి డీగ్లామర్ లోలుక్ లో దీపికను చూసేందుకు అభిమానులు ఇష్టపడలేదు. ఇరానియన్ దర్శకుడు మాజిద్ మజిది దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెయాండ్ ది క్లౌడ్స్’ చిత్రం కోసం దీపిక అలా తయారయింది. అయితే దీపికతో ట్రయల్ షూట్ చేసిన దర్శకుడు ఆమె ఆ పాత్రకు సూట్ అవ్వదన్న ఉద్దేవంతో మరో నటిని తీసుకున్నాడు. ఆ పాత్రలో మాళవిక మోహన్ నటించింది. ఇప్పటికే పలుదేశాలలో విడుదలైన ‘బెయాండ్ ది క్లౌడ్స్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు తన ప్రతీ సినిమాలోనూ దీపికతో ఏదైన పాత్ర చేయించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. -
బెగ్గర్ లుక్‌లో బాలీవుడ్ బ్యూటీ
ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు దీపికా పదుకొనే. అందం అభినయంతో పాటు అదృష్టం కూడా బాగా ఉన్న ఈ బ్యూటి హాలీవుడ్ బాలీవుడ్ లను దున్నేస్తోంది. ముఖ్యంగా పీరియాడిక్ స్టోరీస్ తో పాటు వెస్ట్రర్న్ లుక్స్ లోనూ వావ్ అనిపిస్తోంది. ఇలాంటి బ్యూటి ఒక్కసారిగా అడుక్కునే అమ్మాయిలా కనిపిస్తే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ ఫోటోలు ఈ అందాల రాశి అభిమానులకు నిద్రపట్టనివ్వటంలేదు. ఇప్పటి వరకు గ్లామరస్ లుక్ లో కనిపించిన దీపికా ఒక్కసారిగా డీగ్లామర్ లుక్ లో అది కూడా అడుక్కునే అమ్మాయిగా కనిపించే సరికి షాక్ అవుతున్నారు. సినిమా వివరాలు పూర్తిగా వెళ్లడించకపోయినా.. ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిదీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం దీపిక ఇలా తయ్యారయ్యిందట. మరి సినిమాలో కొన్ని సీన్స్ వరకే ఇలా ఉంటుందా..? లేక సినిమా ఇలాగే కనిపిస్తుందా..? అన్న విషయం తెలియలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
ఆమెను ఇలా చూశారా!
బాలీవుడ్లో ఎన్నో గ్లామరస్ పాత్రల్లో నటించి అలరించిన దీపికా పదుకొనే తన కొత్త సినిమాలో వినూత్న పాత్ర పోషించబోతున్నది. ప్రఖ్యాత ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిద్ స్వయంగా తెరకెక్కిస్తున్న సినిమాలో ఆమె డీగ్లామరస్ పాత్ర చేయబోతున్నది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబైలోని ధోబీఘాట్లలో జరిగింది. ఈ సందర్భంగా మేకప్ లేకుండా నిరుపేదగా కనిపించిన దీపిక ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్లో ‘బాజీరావు మస్తానీ’ వంటి వరుస హిట్ సినిమాలను అందించిన దీపిక త్వరలో హాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి హాలీవుడ్ సినిమా ‘ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ‘చిల్డ్రన్ ఆప్ హేవెన్’, ‘ద కలర్ ఆఫ్ ప్యారడైజ్’, ‘మహమ్మద్’ వంటి అవార్డు విన్నింగ్ సినిమాలు తీసిన మజిద్ భారత్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టులో దీపిక కీలకమైన పాత్ర పోషిస్తున్నది. -
ఏఆర్ రెహమాన్‌పై ఫత్వా
తన సంగీతంతో ఎల్లలు చేరిపేసిన ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు అదే సంగీతంతో వివాదాలకు కారణమయ్యాడు. ఇరాన్లో రూపొందిచిన ఓ చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ ముస్లిం మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఏఆర్ రెహమాన్ మత వ్యతిరేఖి అంటూ ముంబయ్ కేంద్రంగా పని చేస్తున్న సున్ని ముస్లిం గ్రూపు రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది. ప్రొఫెట్ మహమ్మద్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వివాదాస్పద చిత్రానికి సంగీతం అందించినందుకు గాను ముంబై కేంద్రంగా ఉన్న ఓ సున్నీ ముస్లిం సంస్థ రెహమాన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. ఇరానీయన్ దర్శకుడు మాజీద్ మజిదీ దర్శకత్వంలో 'ప్రొఫెట్ మొహమ్మద్' జీవిత కథ ఆధారంగా మూడు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో తొలి భాగంగా విడుదలైన 'మొహమ్మద్ : ద మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అదించారు. అయితే ఈ చిత్రంలో ప్రొఫెట్ జీవితంలోని కొన్ని సంఘటనలను వక్రీకరించారని పలు ముస్లిం సంస్థలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ముస్లిం మత సిద్దాంతాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ముస్లిం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రెహమాన్‌పై ఫత్వా జారీ చేశాయి. భారత ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఇరాన్లో రెహమాన్ హవా!
ఏఆర్ రెహమాన్ పేరు ఇప్పుడు ఇరాన్లో మార్మోగిపోతోంది. ఇటీవలే ఆయన ఓ ఇరాన్ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరించారు. మజిద్ మజిది దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పేరు ‘మహమ్మద్-ద మెసెంజర్ ఆఫ్ గాడ్’. ఇరాన్ సినీ చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓ భారతీయ స్వరకర్త పాటలందించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం గత నెల 26న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. ‘‘ఇస్లామ్ మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మతంలోని సారాన్ని, ఆత్మను తెర మీద ఆవిష్కరించింది. సుమారు 200 మంది సంగీత కళాకారులతో ఇరాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఈజిప్ట్, ఇండియా దేశాల్లో రికార్డింగ్ చేశాం. మిక్సింగ్ ఇక్కడే చెన్నైలో జరిగింది. నేను చేసిన రిస్కీ ఎటంప్ట్లో ఇదొకటి . కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల వల్ల ఇస్లాం మతం మీద చాలా మందికి దురభిప్రాయాలు ఏర్పడ్డాయి. శాంతి, మానవత్వం పరిమళించిన మతం ఇస్లాం అని చెప్పడమే దర్శకుని అభిమతం. దాన్ని చాలా బాగా చూపించారు’’ అని ఏఆర్ రెహమాన్ చెప్పారు.