బెగ్గర్ లుక్లో బాలీవుడ్ బ్యూటీ | Deepika Padukone Shocking Look as Beggar | Sakshi
Sakshi News home page

బెగ్గర్ లుక్లో బాలీవుడ్ బ్యూటీ

Published Fri, Nov 11 2016 2:23 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

బెగ్గర్ లుక్లో బాలీవుడ్ బ్యూటీ

బెగ్గర్ లుక్లో బాలీవుడ్ బ్యూటీ

ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు దీపికా పదుకొనే. అందం అభినయంతో పాటు అదృష్టం కూడా బాగా ఉన్న ఈ బ్యూటి హాలీవుడ్ బాలీవుడ్ లను దున్నేస్తోంది. ముఖ్యంగా పీరియాడిక్ స్టోరీస్ తో పాటు వెస్ట్రర్న్ లుక్స్ లోనూ వావ్ అనిపిస్తోంది. ఇలాంటి బ్యూటి ఒక్కసారిగా అడుక్కునే అమ్మాయిలా కనిపిస్తే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ ఫోటోలు ఈ అందాల రాశి అభిమానులకు నిద్రపట్టనివ్వటంలేదు. ఇప్పటి వరకు గ్లామరస్ లుక్ లో కనిపించిన దీపికా ఒక్కసారిగా డీగ్లామర్ లుక్ లో అది కూడా అడుక్కునే అమ్మాయిగా కనిపించే సరికి షాక్ అవుతున్నారు. సినిమా వివరాలు పూర్తిగా వెళ్లడించకపోయినా.. ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిదీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం దీపిక ఇలా తయ్యారయ్యిందట. మరి సినిమాలో కొన్ని సీన్స్ వరకే ఇలా ఉంటుందా..? లేక సినిమా ఇలాగే కనిపిస్తుందా..? అన్న విషయం తెలియలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement