
ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు దీపికా పదుకొనే. అందం అభినయంతో పాటు అదృష్టం కూడా బాగా ఉన్న ఈ బ్యూటి హాలీవుడ్ బాలీవుడ్ లను దున్నేస్తోంది. ముఖ్యంగా పీరియాడిక్ స్టోరీస్ తో పాటు వెస్ట్రర్న్ లుక్స్ లోనూ వావ్ అనిపిస్తోంది. కొంత కాలం క్రితం దీపిక బెగ్గర్ లుక్‌లో కనిపించిన ఫోటోలు ఆమె అభిమానులను కలవరపెట్టాయి. పూర్తి డీగ్లామర్ లోలుక్ లో దీపికను చూసేందుకు అభిమానులు ఇష్టపడలేదు.
ఇరానియన్ దర్శకుడు మాజిద్ మజిది దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెయాండ్ ది క్లౌడ్స్’ చిత్రం కోసం దీపిక అలా తయారయింది. అయితే దీపికతో ట్రయల్ షూట్ చేసిన దర్శకుడు ఆమె ఆ పాత్రకు సూట్ అవ్వదన్న ఉద్దేవంతో మరో నటిని తీసుకున్నాడు. ఆ పాత్రలో మాళవిక మోహన్ నటించింది. ఇప్పటికే పలుదేశాలలో విడుదలైన ‘బెయాండ్ ది క్లౌడ్స్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు తన ప్రతీ సినిమాలోనూ దీపికతో ఏదైన పాత్ర చేయించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment