ఆమెను ఇలా చూశారా!
ఆమెను ఇలా చూశారా!
Published Thu, Nov 10 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
బాలీవుడ్‌లో ఎన్నో గ్లామరస్ పాత్రల్లో నటించి అలరించిన దీపికా పదుకొనే తన కొత్త సినిమాలో వినూత్న పాత్ర పోషించబోతున్నది. ప్రఖ్యాత ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిద్ స్వయంగా తెరకెక్కిస్తున్న సినిమాలో ఆమె డీగ్లామరస్ పాత్ర చేయబోతున్నది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబైలోని ధోబీఘాట్‌లలో జరిగింది. ఈ సందర్భంగా మేకప్ లేకుండా నిరుపేదగా కనిపించిన దీపిక ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
బాలీవుడ్‌లో ‘బాజీరావు మస్తానీ’ వంటి వరుస హిట్ సినిమాలను అందించిన దీపిక త్వరలో హాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి హాలీవుడ్ సినిమా ‘ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ‘చిల్డ్రన్ ఆప్ హేవెన్’, ‘ద కలర్ ఆఫ్ ప్యారడైజ్’, ‘మహమ్మద్’ వంటి అవార్డు విన్నింగ్ సినిమాలు తీసిన మజిద్ భారత్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టులో దీపిక కీలకమైన పాత్ర పోషిస్తున్నది.
Advertisement
Advertisement