9/11 అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?
అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద అల్ కాయిదా దాడి జరిగి ఇప్పటికి దాదాపు 16 ఏళ్లయింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ కాయిదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి, వాటితో ట్విన్ టవర్స్‌ను ఢీకొన్న ఈ ఘటనతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. పెంటగాన్ ప్రధాన కార్యాలయం కూడా దారుణంగా దెబ్బతిన్న ఈ ఘటనకు సంబంధించి, ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని అరుదైన ఫొటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా ఈ ప్రమాదాన్ని చూసినవాళ్లు ఎలా స్పందించారు, నష్టం ఎలా సంభవించిందనే విషయాలను ఈ ఫొటోలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
కుప్పకూలిపోయిన గోడలు, చెలరేగుతున్న మంటలు, విమాన శకలాలు.. ఇలా రకరకాల ఫొటోలు కూడా వ ఈటిలో ఉన్నాయి. అల్ కాయిదా మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేసి, ఈ దాడులకు ఉపయోగించింది. పెంటగాన్‌ను ఒకటి ఢీకొనగా, మరో రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడికి ఉపయోగించారు. నాలుగో విమానంలో ప్రయాణికులు హైజాకర్ల మీద తిరగబడగా.. వాళ్లు దాన్ని పెన్సల్వేనియా సమీపంలో ఒక పొలంలో కూల్చేశారు. కొన్ని ఫొటోలలో గ్యాస్ మాస్కులు ధరించిన గార్డులు ఒక కుక్క పిల్లను శిథిలాల నుంచి రక్షించారు. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది మరణించారు. ఎక్కువమంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన దాడిలోనే ప్రాణాలు కోల్పోయారు.