బియాండ్ ది క్లౌడ్స్ చిత్రంలో దృశ్యం
తమిళసినిమా: బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఏప్రిల్ 20వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రముఖ ఇరానీ దర్శకుడు మజీద్ మజీదీ చిత్రాలు భాషలకతీతంగా ఉంటాయి. సెంటిమెంట్స్‌ను కలబోసి జనరంజక చిత్రాలను తెరకెక్కించే ఈ దర్శకుడు తొలిసారిగా తమిళంలో దర్శకత్వం వహిస్తున్న చిత్రం బియాండ్ ది క్లౌడ్స్. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
నూతన నటుడు ఇషాన్ కట్టర్ హీరోగానూ మలయాళ నటి మాళవిక మోహన్ హీరోయిన్‌గానూ నటించిన ఈ చిత్రం భాష, సంస్కృతిలకతీతంగా సగటు మనిషిని ఎలా ప్రేమించాలన్న టచ్చింగ్ సన్నివేశాలను కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుందంటున్నారు చిత్ర నిర్మాతలు. జీవితాన్ని చిన్న చిన్న అందమైన విషయాలను, మధురమైన స్మృతులను మాట్లాడే చిత్రంగా బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఉంటుందని తెలిపారు.ఈ చిత్రం ఆడియో ఇటీవల నిడారంబరంగా విడుదలై మంచి ఆదరణను పొందుతోందని వారు తెలిపారు.
దీని గురించి నిర్మాతలలో ఒకరైన జి.స్టూడియోస్ అధినేత సుజాయ్ తెలుపుతూ ఈ చిత్రం విడుదలనంతరం ఇండియాలో దర్శకుడు మజిద్ అభిమానుల సంఖ్య మరింత పెరుగుతుందనే భావాన్ని వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రాన్ని అన్ని దేశాల్లోనూ ఒకే రోజున విడుదల చేయనున్నామని తెలిపారు. పెద్ద పెద్ద కలలతో తిరిగే 22 ఏళ్ల అమీర్ అనే యువకుడు తప్పు దారి పడితే అతన్ని కాపాడడానికి తన సహోదరి, వారి కోసం పోలీసుల చేతుల్లో అరెస్ట్ అయిన కథానాయకి అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం ఇదని చెప్పారు.
మరో నిర్మాత షరీన్ మందిరి కేడియా మాట్లాడుతూ మజీద్ చిత్రాన్ని ఏక కాలంలో ప్రపంచ దేశాల్లో విడుదల చేయ డం ఆయన అభిమానులకే కాకుండా తమకు చాలా ఉత్సాహంగా ఉందన్నారు. మజిద్ కల్పన కథ భాషలకు అతీతంగా భావోద్రేకాలతో కూడి ప్రపంచ దేశాల్లోని ఆయన అభిమానులందరికి మంచి విందు అవుతుందన్నారు. నామా పిక్చర్స్ అధినేత కిషోర్ మాట్లాడుతూ బియాండ్ ది క్లౌడ్స్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment