Beyond The Clouds
-
తొలి చిత్రంతోనే బాలీవుడ్‌కు..
తమిళసినిమా: లక్కు అంటే అలా ఉండాలి అనేంతగా వర్ధమాన నటుడు ఇషాన్ కట్టర్ అవకాశాన్ని దక్కించుకుంటున్నాడు. బియాండ్స్ ద క్లౌడ్స్ అనే బహుభాషా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు మజిద్ మజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తొలిసారి పలు భాషల్లో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని చాలా ఖుషీ అయిపోతున్నాడు ఇషాన్ కట్టర్. అంతే కాదు ఇది ముంబైలోని ధారవి ప్రాంతానికి చెందిన అమీర్ అనే పనిపాటలేని కుర్రాడిగా నటించనున్నాడట. అందుకోసం ఆ ప్రాంత కుర్రాడిగా మారడానికి రెడీ అయ్యి ధారవి ప్రాంతంలో తిరుగుతూ అక్కడి యువకులతో పరిచయం చేసుకుని వారితో గడుపుతూ వారి యాస,భాసల గురించి తెలుసుకున్నాడు. ధారవి కుర్రాడిగా ఇషాన్ కట్టర్ చాలా నేచురల్‌గా నటిస్తున్నాడని చిత్ర వర్గాలు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నాయి. చిత్రంలోని ప్రతి సన్నివేశం గురించి దర్శకుడు మజీద్ మజీద్‌ను అడిగి తెలుసుకుని పాత్రలో లీనం అయ్యి నటిస్తున్నాడని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫైట్స్ సన్నివేశాల్లో ధారవి ప్రాంత యువకులు ఎలా ప్రవర్తిస్తారన్నది గ్రహించి అలానే నటించాడట. దర్శకుడు మజీద్ మజీద్ ఈ చిత్రంలో ఇషాన్ కట్టర్‌కు స్నేహితుడిగా ఆ పాత్రానికి చెందిన ఆకాశ్ అనే యువకుడిని ఎంపిక చేశారు. అంతే కాదు ఆ ప్రాంతానికి చెందిన చాలా మందిని ఈ చిత్రంలో నటింపజేస్తున్నారట. ఇందులో కథానాయకి పాత్రకు మాళవిక మీనన్ అనే నవ నటిని పరిచయం చేస్తున్నారు. చిత్ర ప్రారంభానికి ముందు షూటింగ్ సమయంలోనూ ఇషాన్ కట్టర్, ఆకాశ్‌ల మధ్య స్నేహం చిత్రానికి బాగా ప్లస్ అయ్యిందట. ఆకాశ్ స్వతహానే మంచి రాపర్ కావడంతో ర్యాప్ సంగీతంలో ప్రావీణ్యం కలిగిన ఆకాశ్ నుంచి సంగీతం గురించి తెలుసుకునే అవకాశం లభించిందని ఇషార్ కట్టర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. జీ.స్టూడియో, నామా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బియాండ్ ద క్లౌడ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 20న విడుదలకు ముస్తాబవుతోందని చిత్ర వర్గాలు తెలిపాయి. -
ఏప్రిల్ 20న తెరపైకి బియాండ్ ది క్లౌడ్స్
తమిళసినిమా: బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఏప్రిల్ 20వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రముఖ ఇరానీ దర్శకుడు మజీద్ మజీదీ చిత్రాలు భాషలకతీతంగా ఉంటాయి. సెంటిమెంట్స్‌ను కలబోసి జనరంజక చిత్రాలను తెరకెక్కించే ఈ దర్శకుడు తొలిసారిగా తమిళంలో దర్శకత్వం వహిస్తున్న చిత్రం బియాండ్ ది క్లౌడ్స్. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. నూతన నటుడు ఇషాన్ కట్టర్ హీరోగానూ మలయాళ నటి మాళవిక మోహన్ హీరోయిన్‌గానూ నటించిన ఈ చిత్రం భాష, సంస్కృతిలకతీతంగా సగటు మనిషిని ఎలా ప్రేమించాలన్న టచ్చింగ్ సన్నివేశాలను కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుందంటున్నారు చిత్ర నిర్మాతలు. జీవితాన్ని చిన్న చిన్న అందమైన విషయాలను, మధురమైన స్మృతులను మాట్లాడే చిత్రంగా బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఉంటుందని తెలిపారు.ఈ చిత్రం ఆడియో ఇటీవల నిడారంబరంగా విడుదలై మంచి ఆదరణను పొందుతోందని వారు తెలిపారు. దీని గురించి నిర్మాతలలో ఒకరైన జి.స్టూడియోస్ అధినేత సుజాయ్ తెలుపుతూ ఈ చిత్రం విడుదలనంతరం ఇండియాలో దర్శకుడు మజిద్ అభిమానుల సంఖ్య మరింత పెరుగుతుందనే భావాన్ని వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రాన్ని అన్ని దేశాల్లోనూ ఒకే రోజున విడుదల చేయనున్నామని తెలిపారు. పెద్ద పెద్ద కలలతో తిరిగే 22 ఏళ్ల అమీర్ అనే యువకుడు తప్పు దారి పడితే అతన్ని కాపాడడానికి తన సహోదరి, వారి కోసం పోలీసుల చేతుల్లో అరెస్ట్ అయిన కథానాయకి అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం ఇదని చెప్పారు. మరో నిర్మాత షరీన్ మందిరి కేడియా మాట్లాడుతూ మజీద్ చిత్రాన్ని ఏక కాలంలో ప్రపంచ దేశాల్లో విడుదల చేయ డం ఆయన అభిమానులకే కాకుండా తమకు చాలా ఉత్సాహంగా ఉందన్నారు. మజిద్ కల్పన కథ భాషలకు అతీతంగా భావోద్రేకాలతో కూడి ప్రపంచ దేశాల్లోని ఆయన అభిమానులందరికి మంచి విందు అవుతుందన్నారు. నామా పిక్చర్స్ అధినేత కిషోర్ మాట్లాడుతూ బియాండ్ ది క్లౌడ్స్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. -
‘మా అన్న నాకు టీచర్ లెక్క.. పోటీ కానేకాదు’
సాక్షి, న్యూఢిల్లీ : తన సోదరుడు తనకు ఉపాధ్యాయుడులాంటివాడని ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ అన్నాడు. తానెప్పుడు తన సోదరుడికి పోటీ కానేకాదని, అలా ఎప్పటికీ తాను అనుకోనని చెప్పాడు. మాజిద్ మాజిది దర్శకత్వంలో ఇండో-ఇరానియన్ చిత్రం బియాండ్ ది క్లౌడ్ ద్వారా ఇషాన్ బాలీవుడ్ చిత్రరంగంలోని ఆరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల కార్యక్రమంలో ఇషాన్ మాట్లాడాడు. తన సోదరుడు షాహిద్‌కు గట్టి పోటీ ఇస్తారని భావిస్తురా అని మీడియి ప్రతినిధులు ప్రశ్నించగా ‘కాదు.. అలా ఎప్పటికీ జరగదు. ఆయనకు నాకు ఉపాధ్యాయుడులాంటి వారు. అంతేకాదు తండ్రితో సమానమైనవాడు. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ఆయనకు పోటీ అని ఎప్పటికీ అనుకోను.. దానికి బదులు మేమంతా ఒకటే అని చెబుతాను’ అని అన్నాడు. బియాండ్ దిక్లౌడ్ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.