తొలి చిత్రంతోనే బాలీవుడ్‌కు.. | Beyond The Clouds promises Majid Majidis magic | Sakshi
Sakshi News home page

తొలి చిత్రంతోనే బాలీవుడ్‌కు..

Published Fri, Apr 13 2018 8:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Beyond The Clouds promises Majid Majidis magic - Sakshi

బియాండ్స్‌ ద క్లౌడ్స్‌ చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: లక్కు అంటే అలా ఉండాలి అనేంతగా వర్ధమాన నటుడు ఇషాన్‌ కట్టర్‌ అవకాశాన్ని దక్కించుకుంటున్నాడు. బియాండ్స్‌ ద క్లౌడ్స్‌ అనే బహుభాషా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు మజిద్‌ మజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తొలిసారి పలు భాషల్లో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని చాలా ఖుషీ అయిపోతున్నాడు ఇషాన్‌ కట్టర్‌. అంతే కాదు ఇది ముంబైలోని ధారవి ప్రాంతానికి చెందిన అమీర్‌ అనే పనిపాటలేని కుర్రాడిగా నటించనున్నాడట. అందుకోసం ఆ ప్రాంత కుర్రాడిగా మారడానికి రెడీ అయ్యి ధారవి ప్రాంతంలో తిరుగుతూ అక్కడి యువకులతో పరిచయం చేసుకుని వారితో గడుపుతూ వారి యాస,భాసల గురించి తెలుసుకున్నాడు. ధారవి కుర్రాడిగా ఇషాన్‌ కట్టర్‌ చాలా నేచురల్‌గా నటిస్తున్నాడని చిత్ర వర్గాలు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నాయి.

చిత్రంలోని ప్రతి సన్నివేశం గురించి దర్శకుడు మజీద్‌ మజీద్‌ను అడిగి తెలుసుకుని పాత్రలో లీనం అయ్యి నటిస్తున్నాడని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫైట్స్‌ సన్నివేశాల్లో ధారవి ప్రాంత యువకులు ఎలా ప్రవర్తిస్తారన్నది గ్రహించి అలానే నటించాడట. దర్శకుడు మజీద్‌ మజీద్‌ ఈ చిత్రంలో ఇషాన్‌ కట్టర్‌కు స్నేహితుడిగా ఆ పాత్రానికి చెందిన ఆకాశ్‌ అనే యువకుడిని ఎంపిక చేశారు. అంతే కాదు ఆ ప్రాంతానికి చెందిన చాలా మందిని ఈ చిత్రంలో నటింపజేస్తున్నారట. ఇందులో కథానాయకి పాత్రకు మాళవిక మీనన్‌ అనే నవ నటిని పరిచయం చేస్తున్నారు. చిత్ర ప్రారంభానికి ముందు షూటింగ్‌ సమయంలోనూ ఇషాన్‌ కట్టర్, ఆకాశ్‌ల మధ్య స్నేహం చిత్రానికి బాగా ప్లస్‌ అయ్యిందట. ఆకాశ్‌ స్వతహానే మంచి రాపర్‌ కావడంతో ర్యాప్‌ సంగీతంలో ప్రావీణ్యం కలిగిన ఆకాశ్‌ నుంచి సంగీతం గురించి తెలుసుకునే అవకాశం లభించిందని ఇషార్‌ కట్టర్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. జీ.స్టూడియో, నామా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బియాండ్‌ ద క్లౌడ్స్‌  ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 20న విడుదలకు ముస్తాబవుతోందని చిత్ర వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement