Ishaan Khatter
-
అమ్మ అడుగుజాడల్లో...
‘అచ్చంగా అమ్మలానే’... జాన్వీ కపూర్ గురించి ‘ధడక్’ టీమ్ అంటున్న మాటలివి. చూడ్డానికి తల్లి శ్రీదేవిలానే జాన్వీ ఉంటుంది కాబట్టి అలా అన్నారా? అంటే.. ఊహూ. ఇది ‘క్రమశిక్షణ’ గురించి. తల్లి మరణించి పట్టుమని పదిరోజులు కూడా గడవకముందే ‘ధడక్’ లొకేషన్లో కాలుపెట్టారు జాన్వీ కపూర్. యాక్చువల్లీ జాన్వీ లాంగ్ బ్రేక్ తీసుకుంటుందని, సినిమా వాయిదా తప్పదని కొందరు భావించారు. అయితే తండ్రి బోనీకపూర్ నిర్మాత, తల్లి శ్రీదేవి ఆర్టిస్ట్ కాబట్టి జాన్వీకి సినిమా కష్టాలు తెలుసు. అందుకే షూటింగ్లో పాల్గొనాలని ఫిక్సయ్యారు. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ కేతన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధడక్’ మరాఠీ సినిమా ‘సైరట్’కు రీమేక్. గురువారం ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టారై్టంది. రెండు రోజుల పాటు ఇషాన్, జాన్వీలపై రొమాంటిక్ సీన్స్ తీసి, ఆ తర్వాత కోల్‌కత్తాలో నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ‘‘మా షూటింగ్‌కు బ్రేక్ పడుతుందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. కోల్‌కతా షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు శశాంక్ కేతన్. శ్రీదేవి ఆరోగ్యంగా లేకున్నా తన వల్ల మూవీ యూనిట్‌కు ఇబ్బంది కలగకూడదు అనుకునేవారు. జాన్వీ కూడా అంతే. అచ్చు అమ్మ అడుగుజాడల్లోనే ముందుకెళ్తుంది అని అనుకుంటున్నారు బాలీవుడ్ సినీవాసులు. ఈ సంగతి ఇలా ఉంచితే.. శ్రీదేవి గురించి బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ ఓ ఇన్సిడెంట్ను గుర్తు చేసుకున్నారు. ‘‘గుమ్రా’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ క్యాన్సిల్ చేద్దామని చెప్పా. ‘లేదు. లేదు..నా వల్ల షూటింగ్ అగిపోకూడదు’ అని శ్రీదేవి చెప్పారు. అంతేకాదు అంత జ్వరంలోనూ వాటర్ సీన్స్‌లో అద్భుతంగా నటించారామె. ఆమె అంకితభావం సూపర్’’ అని పేర్కొన్నారు మహేశ్ భట్. సో.. జాన్వీ కూడా అచ్చంగా అమ్మలానే. తన మానసిక స్థితి ఎలా ఉన్నా సినిమాపై ఆ ప్రభావం పడకూడదనుకుంది. ‘ధడక్’ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
వెండితెరపై కూతురిని చూడకుండానే..
న్యూఢిల్లీ : బాలీవుడ్ తొలి మహిళా సూపర్‌స్టార్‌గా పేరొందిన శ్రీదేవి తన కూతుళ్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. కూతుళ్లు ఝాన్వీ, ఖుషీ పట్ల ఒక తల్లిగా ఎంతో కేర్ తీసుకున్న శ్రీదేవి.. తన పెద్ద కూతురు సినీ రంగ ప్రవేశం గురించి కూడా ఎంతో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. ఒక నటిగా, హీరోయిన్గా ఎన్నో దశాబ్దాలు సినీ పరిశ్రమలో కొనసాగిన ఆమె.. తన కూతురి ఆరంగేట్రం విషయంలో ఒకవైపు ఎక్సైట్ అవుతూనే.. మరోవైపు ఒక తల్లిగా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తన కూతురు కెరీర్ గురించి కొంత మథనపడ్డారు. కూతురి బాలీవుడ్ ఆరంగేట్రం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘తను (ఝాన్వీ) సినీ రంగాన్ని ఈ వృత్తిగా ఎంచుకుంది. నేను ఎంతోకాలంగా ఈ పరిశ్రమలో ఉన్నాను. తన కన్నా ఎక్కువగా నేనే సంసిద్ధమై ఉన్నాను. తను నన్ను చూస్తూ పెరిగింది. సినీ రంగంలోకి రావడమంటే ఏమిటో తనకు తెలుసు. ఏ వృత్తిలోనైనా ఏది అనుకున్నంత సులువు కాదు. తను చాలా కష్టపడాల్సి ఉంటుంది. తనకు సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి తను సంసిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను’ అని శ్రీదేవి తెలిపింది. విషాదమేమిటంటే.. ఝాన్వీ బాలీవుడ్ ఆరంగేట్రం గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్న శ్రీదేవి.. మరికొద్ది నెలల్లో కూతురు వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతుండగా చూసేందుకు తను లేదు. ఇషాన్ కట్టర్ సరసన ‘ధడక్’ సినిమాతో ఝాన్వీ బాలీవుడ్లో ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కానుంది. కానీ, తన బాటలో సాగుతూ సిని పరిశ్రమలో అడుగుపెట్టిన ఝాన్వీ తొలి సినిమాలో ఎలా నటించిందీ చూడటానికి, ఒక తల్లిగా గర్వపడటానికి శ్రీదేవి ఇప్పుడు మనమధ్య లేకపోవడం.. ఆమె కుటుంబానికి, అభిమానులకు తీరని విషాదమే. -
ఏప్రిల్ 20న తెరపైకి బియాండ్ ది క్లౌడ్స్
తమిళసినిమా: బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఏప్రిల్ 20వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రముఖ ఇరానీ దర్శకుడు మజీద్ మజీదీ చిత్రాలు భాషలకతీతంగా ఉంటాయి. సెంటిమెంట్స్‌ను కలబోసి జనరంజక చిత్రాలను తెరకెక్కించే ఈ దర్శకుడు తొలిసారిగా తమిళంలో దర్శకత్వం వహిస్తున్న చిత్రం బియాండ్ ది క్లౌడ్స్. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. నూతన నటుడు ఇషాన్ కట్టర్ హీరోగానూ మలయాళ నటి మాళవిక మోహన్ హీరోయిన్‌గానూ నటించిన ఈ చిత్రం భాష, సంస్కృతిలకతీతంగా సగటు మనిషిని ఎలా ప్రేమించాలన్న టచ్చింగ్ సన్నివేశాలను కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుందంటున్నారు చిత్ర నిర్మాతలు. జీవితాన్ని చిన్న చిన్న అందమైన విషయాలను, మధురమైన స్మృతులను మాట్లాడే చిత్రంగా బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఉంటుందని తెలిపారు.ఈ చిత్రం ఆడియో ఇటీవల నిడారంబరంగా విడుదలై మంచి ఆదరణను పొందుతోందని వారు తెలిపారు. దీని గురించి నిర్మాతలలో ఒకరైన జి.స్టూడియోస్ అధినేత సుజాయ్ తెలుపుతూ ఈ చిత్రం విడుదలనంతరం ఇండియాలో దర్శకుడు మజిద్ అభిమానుల సంఖ్య మరింత పెరుగుతుందనే భావాన్ని వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రాన్ని అన్ని దేశాల్లోనూ ఒకే రోజున విడుదల చేయనున్నామని తెలిపారు. పెద్ద పెద్ద కలలతో తిరిగే 22 ఏళ్ల అమీర్ అనే యువకుడు తప్పు దారి పడితే అతన్ని కాపాడడానికి తన సహోదరి, వారి కోసం పోలీసుల చేతుల్లో అరెస్ట్ అయిన కథానాయకి అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం ఇదని చెప్పారు. మరో నిర్మాత షరీన్ మందిరి కేడియా మాట్లాడుతూ మజీద్ చిత్రాన్ని ఏక కాలంలో ప్రపంచ దేశాల్లో విడుదల చేయ డం ఆయన అభిమానులకే కాకుండా తమకు చాలా ఉత్సాహంగా ఉందన్నారు. మజిద్ కల్పన కథ భాషలకు అతీతంగా భావోద్రేకాలతో కూడి ప్రపంచ దేశాల్లోని ఆయన అభిమానులందరికి మంచి విందు అవుతుందన్నారు. నామా పిక్చర్స్ అధినేత కిషోర్ మాట్లాడుతూ బియాండ్ ది క్లౌడ్స్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. -
ఇరగదీసింది!
అవును..డ్యాన్స్‌ను ఇరగదీసింది శ్రీదేవి తనయ జాన్వీ. మరాఠీ సూపర్ హిట్ ‘సైరట్’ చిత్రం హిందీలో ‘థడక్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. శశాంక్ కేతన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రీసెంట్గా ఓ సోలో సాంగ్‌ను ముంబైలో జాన్వీ కపూర్‌పై చిత్రీకరించారు. కొరియోగ్రాఫర్ తుషార్ కలియా డిజైన్ చేసిన ఈ రేసీ సాంగ్‌లో డ్యాన్స్ కుమ్మేసిందట జాన్వీ. ఈ సాంగ్ షూట్‌కు రెండు రోజుల ముందు నుంచే ఫుల్‌గా ప్రాక్టీస్ చేసి లొకేషన్లోకి వచ్చిందట జాన్వీ. ‘‘చాలా కాన్ఫిడెంట్‌గా డ్యాన్స్ చేసింది జాన్వీ. ఏ డ్యాన్స్ మూమెంట్లో చేంజ్ అడగలేదు. సాంగ్ బ్రేక్ టైమ్‌లోనూ నెక్ట్స్ స్టెప్ కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉంది’’ అని జాన్వీని పొగిడేశారు తుషార్. ఈ సినిమాను జూలై 20న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. హీరోయిన్గా నటిస్తున్న తొలి సినిమాలోనే కొరియోగ్రాఫర్‌ను మెప్పించే రేంజ్లో జాన్వీ డ్యాన్స్ చేయడం విశేషమే. -
‘మా అన్న నాకు టీచర్ లెక్క.. పోటీ కానేకాదు’
సాక్షి, న్యూఢిల్లీ : తన సోదరుడు తనకు ఉపాధ్యాయుడులాంటివాడని ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ అన్నాడు. తానెప్పుడు తన సోదరుడికి పోటీ కానేకాదని, అలా ఎప్పటికీ తాను అనుకోనని చెప్పాడు. మాజిద్ మాజిది దర్శకత్వంలో ఇండో-ఇరానియన్ చిత్రం బియాండ్ ది క్లౌడ్ ద్వారా ఇషాన్ బాలీవుడ్ చిత్రరంగంలోని ఆరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల కార్యక్రమంలో ఇషాన్ మాట్లాడాడు. తన సోదరుడు షాహిద్‌కు గట్టి పోటీ ఇస్తారని భావిస్తురా అని మీడియి ప్రతినిధులు ప్రశ్నించగా ‘కాదు.. అలా ఎప్పటికీ జరగదు. ఆయనకు నాకు ఉపాధ్యాయుడులాంటి వారు. అంతేకాదు తండ్రితో సమానమైనవాడు. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ఆయనకు పోటీ అని ఎప్పటికీ అనుకోను.. దానికి బదులు మేమంతా ఒకటే అని చెబుతాను’ అని అన్నాడు. బియాండ్ దిక్లౌడ్ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.