
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడిగా మహ్మద్ ముస్తాక్ అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సోమవారం జరిగిన హెచ్‌ఐ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్రొ నింగోమ్బం, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆసిమా అలీ, భోలనాథ్ సింగ్ (జార్ఖండ్) ఉపాధ్యక్షులుగా, రాజీందర్ సింగ్ (జమ్మూ కశ్మీర్) కార్యదర్శిగా ఎన్నికవగా, కోశాధికారిగా తపన్ కుమార్ దాస్ (అస్సాం) కొనసాగనున్నారు. మహిళల హాకీ మాజీ కెప్టెన్ అసుంత లక్రా, ఫిరోజ్ అన్సారి (చత్తీస్‌గఢ్)లు సంయుక్త కార్యదర్శులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment