సాక్షి, హైదరాబాద్: ‘ఆమె’కోసం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి సైబర్ నేరంలో పట్టుబడిన పాకిస్తాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ కేసులో సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు పాక్ సమాధానం కోసం ఎదురు చూస్తు న్నారు. ఈ కేసులో కీలకఘట్టమైన ‘కాన్సులర్ యాక్సెస్’3 నెలల క్రితమే పూర్తయినా ఇప్పటి వరకు ఆ దేశం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇతడికి ఆ దేశం జారీ చేసిన పాస్‌పోర్ట్, దాని ఆధారంగా తీసుకున్న వీసాల పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆరునెలల క్రితమే లేఖ రాశారు. గతేడాది జూన్ ఆఖరివారంలో ఢిల్లీ వెళ్లిన బృందం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ద్వారా ఈ లేఖను పంపారు.
నమ్మించి వివాహం...
నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ పాకిస్తానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి అతడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు.
‘కూతురినే’ వేధించి కటకటాల్లోకి...
ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించింది. దీంతో అతడు కక్షకట్టి ఆమె కుమార్తె నగ్న చిత్రాలు తీసి కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. గత నెల్లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో అతడు అబ్బాస్ పేరుతో బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్ పోర్ట్ తీసుకున్నట్లు వెల్లడైంది.
నిర్ధారించాలంటే ‘ధ్రువీకరించాల్సిందే’..
మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్లు ఉన్న సర్టిఫికెట్ల తోపాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపుకార్డులతోపాటు పాక్ పాస్‌పోర్ట్‌కు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి వద్ద ఉన్న సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005– 08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇక్రమ్ 2009 వరకు పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. అతడు పాక్ జాతీయు డనే అంశంతోపాటు ఈ విషయాన్నీ పాక్ ధ్రువీకరిస్తేనే బోగస్‌వ్యవహారం నిర్ధారణ సాధ్యమవుతుంది.
తీహార్‌కు వచ్చిన కాన్సులేట్ అధికారులు...
గత ఏడాది నవంబర్‌లో సైబర్‌క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌ను కోర్టు అనుమతితో ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అక్కడి నుంచే పాకిస్తాన్ కాన్సులేట్ అధికారులకు సమా చారం ఇచ్చారు. అతడు పాక్ జాతీయుడని ధ్రువీకరిస్తే అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను జారీ చేయాలి. వీటి ఆధారంగానే ఈ కేసులో తదుపరి చర్యలు ఉండనున్నాయి
పాక్ జవాబు కోసం ఎదురుచూపు!
Published Fri, Jan 18 2019 12:34 AM | Last Updated on Fri, Jan 18 2019 12:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment