సారథిగా యూనుస్ ప్రమాణం
సలహాదారులుగా 15 మంది
దేశాన్ని పునరి్నర్మించుకుందాం
హింసను ఆపండి: యూనుస్
కొనసాగుతున్న దమనకాండ
హిందువులపై మరిన్ని దాడులు
చేతులెత్తేసిన పోలీసు వ్యవస్థ
రంగంలోకి యువకులు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో గురువారం తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ బుధవారం ఈ మేరకు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. యూనుస్ సర్కారుకు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటవుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం పారిస్‌లో ఉన్న 84 ఏళ్ల యూనుస్ హుటాహుటిన స్వదేశం చేరుకోనున్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని బంగ్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇదో గొప్ప అవకాశం. మతిలేని హింసతో దాన్ని చేజార్చుకోవద్దు. హింసకు పూర్తిగా స్వస్తి చెబుదాం. పారీ్టలతో పాటు అందరికీ ఇది నా విజ్ఞప్తి’’ అన్నారు. సాహస విద్యార్థుల వల్లే దేశంలో ఇంతటి విప్లవం సాధ్యమైందని ప్రశంసించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనుస్ పేరును విద్యార్థి సంఘాల నేతలే ప్రతిపాదించడం తెలిసిందే.
రెచి్చపోయిన మూకలు
బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హింసాకాండ బుధవారం కూడా నిరి్నరోధంగా కొనసాగింది. హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఒక్క మంగళవారమే దేశవ్యాప్తంగా 29 మంది పార్టీ మద్దతుదారులను హతమార్చారు. దాంతో గత నెల రోజుల్లో దేశవ్యాప్త హింసకు బలైన వారి సంఖ్య 470 దాటింది. హిందువుల ఇళ్లు, వ్యాపార సముదాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకుంటూ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రఖ్యాత జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని లూటీ చేశారు.
అనంతరం దాన్ని నేలమట్టం చేశారు. ఆయన ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించుకున్న 3,000 పై చిలుకు సంగీత పరికరాలలకు నిప్పు పెట్టారు. దాంతో కుటుంబంతో సహా రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పలుచోట్ల ముస్లిం యువకులు, మత పెద్దలు ఆలయాలకు, హిందువుల నివాసాలకు రక్షణ కల్పిస్తూ కన్పించారు. మరోవైపు పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. పరిస్థితి మరింత విషమిస్తుందన్న వదంతులకు జడిసి వారు మూకుమ్మడిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి.
దీనికి తోడు పోలీస్‌స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! శాంతిభద్రతల పరిరక్షణకు విద్యార్థులు, యువకులే రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ను నియంత్రణ తదితర బాధ్యతలు నిర్వర్తిస్తూ కన్పించారు. శాంతిభద్రతలను కాపాడటం కేవలం సైన్యం వల్ల అయ్యే పని కాదని ఆర్మీ చీఫ్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ప్రొఫెసర్ నెత్తిన ముళ్ల కిరీటం
నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ‘పేదల బ్యాంకర్’గా, బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ పితామహునిగా పేరొందారు. 1940లో చిట్టగాంగ్‌లో జని్మంచిన ఆయన ఢాకా వర్సిటీలో చదువుకున్నారు. పీహెచ్‌డీ తర్వాత పలు విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా చేశారు. బంగ్లాకు తిరిగొచ్చి బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్‌ను స్థాపించారు. పేదలకు చిన్న రుణాలిచ్చే ఈ మైక్రోఫైనాన్స్ సంస్థ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడింది.
లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో యూనుస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. షేక్ హసీనా 2008లో రెండోసారి అధికారంలోకి వచి్చనప్పటి నుంచీ ఆమెతో మనస్ఫర్ధలొచ్చాయి. అవినీతి సహా ఆయనపై పలు ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. కారి్మక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలి ఆర్నెల్ల జైలు శిక్ష పడటంతో యూనుస్ దేశం వీడారు.
ఖలీదా ర్యాలీ
విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బుధవారం ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించింది. గృహనిర్బంధం నుంచి విడుదలైన పార్టీ చీఫ్ బేగం ఖలీదా జియా (79) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు మూకుమ్మడిగా కదిలి షేక్ హసీనా సర్కారును సాగనంపడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. ‘‘ఇది హింసా ప్రతీకారాలకు సమయం కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రేమ, శాంతి, సామరస్యాలు. అవే దేశ పునరి్నర్మాణానికి చోదక శక్తులు కావాలి’’ అన్నారు. ‘‘యువతే మన భవిత. వారి కలలను సాకారం చేసేలా ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దుకుందాం. రక్తపాతం, విధ్వంసం, ఆగ్రహావేశాలు, ప్రతీకారాలకు తావియ్యొద్దు’’ అని పిలుపునిచ్చారు.
400 మంది భారతీయులు వెనక్కు
కల్లోలం నేపథ్యంలో అక్కడున్న భారతీయులు ముందుజాగ్రత్తగా వెనక్కు వస్తున్నారు. వారికోసం ఎయిరిండియా, ఇండిగో బుధవారం ఢాకా నుంచి ఢిల్లీ, కోల్‌కతాకు ప్రత్యేక విమానాలు నడిపాయి. వాటిలో 400 మందికి పైగా తిరిగొచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి అత్యవసరం కాని 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్టు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంత ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.
కొంతకాలం భారత్‌లోనే హసీనా: వాజెద్
ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే గడుపుతారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బుధవారం వెల్లడించారు. పలు దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోసం హసీనా ప్రయతి్నస్తున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘మా అమ్మ ప్రస్తుతం ఢిల్లీలో నా సోదరితో పాటు ఉన్నారు. కొంతకాలం అక్కడే ఉంటారు’’ అని చెప్పారు. లండన్ వెళ్లాలని హసీనా భావించగా ఆశ్రయం కలి్పంచేందుకు బ్రిటన్ నిరాకరించడం
తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment