Yunus
-
Muhammad Yunus: అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. -
Bangladesh Political Crisis: బంగ్లా సారథిగా యూనుస్
ఢాకా: నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్(84)ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారు. ఈ హోదా ప్రధానమంత్రితో సమానమైనది. గురువారం అధ్యక్ష భవనం ‘బంగభవన్’లో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. యూనుస్‌కు 16 మందితో కూడిన సలహాదారుల మండలి పాలనలో సహకరించనుంది. ఈ మండలికి ఎంపికైన వారిలో రిజర్వేషన్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్తోపాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అఖ్తర్ తదితరులున్నారు. వీరితో కూడా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. పౌరులకు భద్రత కలి్పంచడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు తనకు సాయపడాలని యూనుస్ ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరారు. -
Bangladesh Political Crisis: బంగ్లాలో నేడే తాత్కాలిక సర్కారు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో గురువారం తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ బుధవారం ఈ మేరకు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. యూనుస్ సర్కారుకు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న 84 ఏళ్ల యూనుస్ హుటాహుటిన స్వదేశం చేరుకోనున్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని బంగ్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇదో గొప్ప అవకాశం. మతిలేని హింసతో దాన్ని చేజార్చుకోవద్దు. హింసకు పూర్తిగా స్వస్తి చెబుదాం. పారీ్టలతో పాటు అందరికీ ఇది నా విజ్ఞప్తి’’ అన్నారు. సాహస విద్యార్థుల వల్లే దేశంలో ఇంతటి విప్లవం సాధ్యమైందని ప్రశంసించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనుస్ పేరును విద్యార్థి సంఘాల నేతలే ప్రతిపాదించడం తెలిసిందే. రెచి్చపోయిన మూకలు బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హింసాకాండ బుధవారం కూడా నిరి్నరోధంగా కొనసాగింది. హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఒక్క మంగళవారమే దేశవ్యాప్తంగా 29 మంది పార్టీ మద్దతుదారులను హతమార్చారు. దాంతో గత నెల రోజుల్లో దేశవ్యాప్త హింసకు బలైన వారి సంఖ్య 470 దాటింది. హిందువుల ఇళ్లు, వ్యాపార సముదాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకుంటూ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రఖ్యాత జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని లూటీ చేశారు. అనంతరం దాన్ని నేలమట్టం చేశారు. ఆయన ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించుకున్న 3,000 పై చిలుకు సంగీత పరికరాలలకు నిప్పు పెట్టారు. దాంతో కుటుంబంతో సహా రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పలుచోట్ల ముస్లిం యువకులు, మత పెద్దలు ఆలయాలకు, హిందువుల నివాసాలకు రక్షణ కల్పిస్తూ కన్పించారు. మరోవైపు పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. పరిస్థితి మరింత విషమిస్తుందన్న వదంతులకు జడిసి వారు మూకుమ్మడిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి తోడు పోలీస్స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! శాంతిభద్రతల పరిరక్షణకు విద్యార్థులు, యువకులే రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ను నియంత్రణ తదితర బాధ్యతలు నిర్వర్తిస్తూ కన్పించారు. శాంతిభద్రతలను కాపాడటం కేవలం సైన్యం వల్ల అయ్యే పని కాదని ఆర్మీ చీఫ్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నట్టు చెప్పుకొచ్చారు.ప్రొఫెసర్ నెత్తిన ముళ్ల కిరీటం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ‘పేదల బ్యాంకర్’గా, బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ పితామహునిగా పేరొందారు. 1940లో చిట్టగాంగ్‌లో జని్మంచిన ఆయన ఢాకా వర్సిటీలో చదువుకున్నారు. పీహెచ్డీ తర్వాత పలు విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా చేశారు. బంగ్లాకు తిరిగొచ్చి బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్‌ను స్థాపించారు. పేదలకు చిన్న రుణాలిచ్చే ఈ మైక్రోఫైనాన్స్ సంస్థ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో యూనుస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. షేక్ హసీనా 2008లో రెండోసారి అధికారంలోకి వచి్చనప్పటి నుంచీ ఆమెతో మనస్ఫర్ధలొచ్చాయి. అవినీతి సహా ఆయనపై పలు ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. కారి్మక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలి ఆర్నెల్ల జైలు శిక్ష పడటంతో యూనుస్ దేశం వీడారు. ఖలీదా ర్యాలీ విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బుధవారం ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించింది. గృహనిర్బంధం నుంచి విడుదలైన పార్టీ చీఫ్ బేగం ఖలీదా జియా (79) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు మూకుమ్మడిగా కదిలి షేక్ హసీనా సర్కారును సాగనంపడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. ‘‘ఇది హింసా ప్రతీకారాలకు సమయం కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రేమ, శాంతి, సామరస్యాలు. అవే దేశ పునరి్నర్మాణానికి చోదక శక్తులు కావాలి’’ అన్నారు. ‘‘యువతే మన భవిత. వారి కలలను సాకారం చేసేలా ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దుకుందాం. రక్తపాతం, విధ్వంసం, ఆగ్రహావేశాలు, ప్రతీకారాలకు తావియ్యొద్దు’’ అని పిలుపునిచ్చారు.400 మంది భారతీయులు వెనక్కు కల్లోలం నేపథ్యంలో అక్కడున్న భారతీయులు ముందుజాగ్రత్తగా వెనక్కు వస్తున్నారు. వారికోసం ఎయిరిండియా, ఇండిగో బుధవారం ఢాకా నుంచి ఢిల్లీ, కోల్‌కతాకు ప్రత్యేక విమానాలు నడిపాయి. వాటిలో 400 మందికి పైగా తిరిగొచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి అత్యవసరం కాని 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్టు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంత ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.కొంతకాలం భారత్‌లోనే హసీనా: వాజెద్ ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే గడుపుతారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బుధవారం వెల్లడించారు. పలు దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోసం హసీనా ప్రయతి్నస్తున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘మా అమ్మ ప్రస్తుతం ఢిల్లీలో నా సోదరితో పాటు ఉన్నారు. కొంతకాలం అక్కడే ఉంటారు’’ అని చెప్పారు. లండన్ వెళ్లాలని హసీనా భావించగా ఆశ్రయం కలి్పంచేందుకు బ్రిటన్ నిరాకరించడం తెలిసిందే. -
కీపిటప్..మహమ్మద్ యూనస్!
ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తుంటే కనిపించింది.ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఒకరు ఆత్మహత్య అని..అలా మరో పేజీ తిప్పానో లేదో సివిల్స్‌లో ఫెయిలయ్యానని బలవన్మరణం అంటూ మరోవార్త ఇదేమిటి చిన్నచిన్న కారణాలతో ఇలా చనిపోవడాలు అనిపించింది.అప్పుడే నిన్న కలిసిన మహమ్మద్ యూనస్ గుర్తొచ్చాడు.. బతుకంతా కష్టాలు ఎదుర్కొన్నా అతడి మొహంలో చెదిరిపోని ఆ చిరునవ్వు గుర్తొచ్చింది.అంగవైకల్యం వెనక్కులాగుతున్నా..ముందుకు దూసుకెళ్లాలన్న అతడిగుండెధైర్యం ఈ ఆత్మహత్యల వార్తల సమయంలో మరీ గుర్తొచ్చింది. ఆ మహమ్మద్ యూనస్ ఎవరో తెలుసుకుందాం. ఓ సాక్షి పాఠకుడి మాటల్లో అతడి కథను విందాం ఓ ఆయుర్వేద మందుల దుకాణంనుంచి మెడిసిన్స్ తెప్పించాలి. దాంతో ఒక బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్‌లో రైడర్‌ను బుక్ చేసుకుని మందులు ఇంటికి తెప్పించుకు న్నాను. కిందకు వెళ్లి అడిగాను.. డెలివరీ బాయ్ వచ్చాడా అని.. అప్పుడు నేనేనండి అంటూ నవ్వుతూ వచ్చాడు మహమ్మద్ యూనస్.. చూడగానే ఆశ్చర్యం కలిగింది.. ఎందుకంటే.. తను దివ్యాంగుడు.. ఎప్పుడూ ఈ పనిలో దివ్యాంగులను చూడని నేను ఆసక్తి తో అతడి వివరాలు అడిగాను.. అప్పుడు చెప్పాడు.. 36 ఏళ్ల యూనస్ తన కథ.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ చెందిన యూనస్‌ది పేద కుటుంబం. చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. శరీరం సహకరించక పోయినా ఇంటర్ పూర్తి చేశాడు. ఒక మీడియా సర్వీసెస్ సంస్థలో పదేళ్లు పనిచేశాడు. అది మూతపడ్డాక ఒక మొబైల్ షాపులో చేరాడు. పైగా తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత ఇతడి మీదే పడింది. లాక్‌డౌన్‌తో ఆ మొబైల్ షాపు కాస్తా మూతపడటంతో బతుకు రోడ్డున పడింది. ఇదే సమయంలో అనారోగ్యంతో తన 6 నెలల బిడ్డనూ పోగొట్టుకున్నాడు. కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. కానీ గుండె ధైర్యం మాత్రం సడలలేదు. లాక్డౌన్ సడలించాక ఒక బైక్ ట్యాక్సీ యాప్ వేదికగా రైడర్‌గా మారాడు. ‘ఈ నా బండిని చూసి రోజూ ఒకరిద్దరు రైడ్ క్యాన్సిల్ చేసుకునేవారు. కన్నీళ్లు వచ్చేవి. నా వైకల్యాన్ని చూసి రైడ్ క్యాన్సిల్ చేసుకున్నారని చాలా బాధపడ్డాను. అయితే.. బతకాలంటే పని చేయాలి. అందుకే పరుగు ఆపకూడదని నిర్ణయించుకున్నాను. రైడ్ లేకపోతే సరుకు డెలివరీ అయినా ఉంటుంది. రోజూ ఖర్చులుపోను ఇంటికి రూ.300 దాకా తీసుకువెళతాను. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా రైడ్ ఆగదు.. సార్’ అంటూ చిరునవ్వుతో సెలవు తీసుకున్నాడు యూనస్. ‘ప్రభుత్వం నుంచి రుణం అందితే ఇంటి దగ్గర మీ సేవ లేదా మొబైల్/కిరాణా దుకాణం పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది.. సార్’ అని తన మనసులోని మాట చెప్పాడు. ఈ ఆత్మహత్యల వార్తలు చదివాక.. యూనస్‌ను చూశాక అనిపించింది. మనం చూడాల్సింది నిరాశ అనే నిశీధిని కాదు.. దాన్ని తరిమేసే ఆ చిరుదివ్వెను.... కష్టాల చీకట్లో మగ్గుతున్న ఎంతోమందికి ఈ యూనస్ కథ ఒక చిరుదివ్వెనే... కీపిటప్.. మహమ్మద్ యూనస్.. -
సర్వే కోసం శిథిల గృహంలో..
పరిగి: సమగ్ర కుటుంబ సర్వే అనగానే ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు చేరుకున్నారు. స్వగ్రామంలో సొంత ఇల్లున్నా ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని వెళ్లినవారు కొందరైతే.. ఉన్న ఇళ్లు శిథిలమై తిరిగి కట్టుకోలేని దీన స్థితిలో పట్టణాలకు వలస వెళ్లినవారు మరికొందరు ఉన్నారు. సర్వే పుణ్యమా అని ఊరికి వచ్చిన ఓ కుటుంబం శిథిలమైన ఇళ్లలోనే కూర్చుండి కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం మాదారానికి చెందిన ఎం.డి.యూసుఫ్, యూనూస్, ఖాసీం సోదరులు. వీరంతా ఉమ్మడి కుటుంబంగా కలిసుండేవారు. ఏళ్ల క్రి తం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. దీంతో అన్నదమ్ములంతా ఎవరికి వారు వేరే గ్రామాలకు వెళ్లిపోయారు. మంగళవారం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కూలిపోయి మిగిలిన నాలుగు గోడల మధ్యే సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వంఇల్లు మంజూరు చేయాలని కోరారు.