Army chief General
-
Bangladesh Political Crisis: బంగ్లాలో నేడే తాత్కాలిక సర్కారు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో గురువారం తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ బుధవారం ఈ మేరకు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. యూనుస్ సర్కారుకు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న 84 ఏళ్ల యూనుస్ హుటాహుటిన స్వదేశం చేరుకోనున్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని బంగ్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇదో గొప్ప అవకాశం. మతిలేని హింసతో దాన్ని చేజార్చుకోవద్దు. హింసకు పూర్తిగా స్వస్తి చెబుదాం. పారీ్టలతో పాటు అందరికీ ఇది నా విజ్ఞప్తి’’ అన్నారు. సాహస విద్యార్థుల వల్లే దేశంలో ఇంతటి విప్లవం సాధ్యమైందని ప్రశంసించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనుస్ పేరును విద్యార్థి సంఘాల నేతలే ప్రతిపాదించడం తెలిసిందే. రెచి్చపోయిన మూకలు బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హింసాకాండ బుధవారం కూడా నిరి్నరోధంగా కొనసాగింది. హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఒక్క మంగళవారమే దేశవ్యాప్తంగా 29 మంది పార్టీ మద్దతుదారులను హతమార్చారు. దాంతో గత నెల రోజుల్లో దేశవ్యాప్త హింసకు బలైన వారి సంఖ్య 470 దాటింది. హిందువుల ఇళ్లు, వ్యాపార సముదాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకుంటూ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రఖ్యాత జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని లూటీ చేశారు. అనంతరం దాన్ని నేలమట్టం చేశారు. ఆయన ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించుకున్న 3,000 పై చిలుకు సంగీత పరికరాలలకు నిప్పు పెట్టారు. దాంతో కుటుంబంతో సహా రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పలుచోట్ల ముస్లిం యువకులు, మత పెద్దలు ఆలయాలకు, హిందువుల నివాసాలకు రక్షణ కల్పిస్తూ కన్పించారు. మరోవైపు పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. పరిస్థితి మరింత విషమిస్తుందన్న వదంతులకు జడిసి వారు మూకుమ్మడిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి తోడు పోలీస్స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! శాంతిభద్రతల పరిరక్షణకు విద్యార్థులు, యువకులే రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ను నియంత్రణ తదితర బాధ్యతలు నిర్వర్తిస్తూ కన్పించారు. శాంతిభద్రతలను కాపాడటం కేవలం సైన్యం వల్ల అయ్యే పని కాదని ఆర్మీ చీఫ్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నట్టు చెప్పుకొచ్చారు.ప్రొఫెసర్ నెత్తిన ముళ్ల కిరీటం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ‘పేదల బ్యాంకర్’గా, బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ పితామహునిగా పేరొందారు. 1940లో చిట్టగాంగ్‌లో జని్మంచిన ఆయన ఢాకా వర్సిటీలో చదువుకున్నారు. పీహెచ్డీ తర్వాత పలు విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా చేశారు. బంగ్లాకు తిరిగొచ్చి బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్‌ను స్థాపించారు. పేదలకు చిన్న రుణాలిచ్చే ఈ మైక్రోఫైనాన్స్ సంస్థ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో యూనుస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. షేక్ హసీనా 2008లో రెండోసారి అధికారంలోకి వచి్చనప్పటి నుంచీ ఆమెతో మనస్ఫర్ధలొచ్చాయి. అవినీతి సహా ఆయనపై పలు ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. కారి్మక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలి ఆర్నెల్ల జైలు శిక్ష పడటంతో యూనుస్ దేశం వీడారు. ఖలీదా ర్యాలీ విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బుధవారం ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించింది. గృహనిర్బంధం నుంచి విడుదలైన పార్టీ చీఫ్ బేగం ఖలీదా జియా (79) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు మూకుమ్మడిగా కదిలి షేక్ హసీనా సర్కారును సాగనంపడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. ‘‘ఇది హింసా ప్రతీకారాలకు సమయం కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రేమ, శాంతి, సామరస్యాలు. అవే దేశ పునరి్నర్మాణానికి చోదక శక్తులు కావాలి’’ అన్నారు. ‘‘యువతే మన భవిత. వారి కలలను సాకారం చేసేలా ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దుకుందాం. రక్తపాతం, విధ్వంసం, ఆగ్రహావేశాలు, ప్రతీకారాలకు తావియ్యొద్దు’’ అని పిలుపునిచ్చారు.400 మంది భారతీయులు వెనక్కు కల్లోలం నేపథ్యంలో అక్కడున్న భారతీయులు ముందుజాగ్రత్తగా వెనక్కు వస్తున్నారు. వారికోసం ఎయిరిండియా, ఇండిగో బుధవారం ఢాకా నుంచి ఢిల్లీ, కోల్‌కతాకు ప్రత్యేక విమానాలు నడిపాయి. వాటిలో 400 మందికి పైగా తిరిగొచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి అత్యవసరం కాని 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్టు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంత ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.కొంతకాలం భారత్‌లోనే హసీనా: వాజెద్ ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే గడుపుతారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బుధవారం వెల్లడించారు. పలు దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోసం హసీనా ప్రయతి్నస్తున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘మా అమ్మ ప్రస్తుతం ఢిల్లీలో నా సోదరితో పాటు ఉన్నారు. కొంతకాలం అక్కడే ఉంటారు’’ అని చెప్పారు. లండన్ వెళ్లాలని హసీనా భావించగా ఆశ్రయం కలి్పంచేందుకు బ్రిటన్ నిరాకరించడం తెలిసిందే. -
భారత్‌తో సైనిక సంబంధాలకు ఢోకా లేదు: కెనడా సైనికాధికారి
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొంత మేర దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న మాట వాస్తవమే కానీ రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలకు మాత్రం ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్. అది రాజకీయ సమస్య.. భారత్ వేదికగా జరుగుతున్న ఇండో పసిఫిక్ సైన్యాధ్యక్షుల సదస్సులో పాల్గొనేందుకు 30 దేశాల సైన్యానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కెనడా డిప్యూటీ ఆర్మీ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. పీటర్ స్కాట్ మాట్లాడుతూ.. భారత్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని.. కెనడా భారత్ మధ్య జరుగుతున్న వివాదానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నాకు తెలిసినంతవరకు ఆ సమస్య రాజకీయ స్థాయిలోనే పరిష్కారమవ్వాలని దానిలో మేము జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఇండో పసిఫిక్ దేశాల కోసం.. మా ప్రధాని ఆ విషయాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లోనే ప్రస్తావించారని దానిపై విచారణ కూడా కొనసాగుతోందని ఆయన కోరినట్లు భారత్ సహకరిస్తే విచారణ తొందరగా జరిగే అవకాశముంటుందన్నారు. ఇక ఆ సమస్య రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను ఏమాత్రం ప్రభావితం చేయదన్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో ముందురోజు మాట్లాడానని ఆ సమస్య రాజకీయ స్థాయిలోనే పరిష్కారం కావాలని దాని వలన సైనిక సంబంధాలకు ఎటువంటి భంగం కలగకూడదని ఇద్దరం తీర్మానించుకున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇండో-పసిఫిక్ దేశాలకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని. అన్ని వేళ్ళూ అటువైపే.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్‌పై ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఆయన చేసిన ఆరోపణలను ఖండించిన విషయం తెలిసిందే. అత్యధిక ప్రపంచ దేశాలు కూడా కెనడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి. ట్రూడో ఆరోపణలు నిరాధారమైనవని చెబుతూ ఉగ్రవాదానికి కెనడా కేంద్రంగా మారుతోందని అన్నారు. #WATCH | Delhi: Canada's Deputy Army Chief Major General Peter Scott says, "We're very grateful to be here as part of the Indo-Pacific Armies Chiefs Conference (IPAC), 2023. Canada continues to look for opportunities where we can participate in training or exercises with partners… pic.twitter.com/QCVwXEIMgB — ANI (@ANI) September 26, 2023 ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు అడ్డగా కెనడా: భారత్‌కు శ్రీలంక మద్దతు -
పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది
జైపూర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుంది.. కాకపోతే దాని కోసం కొంత కాలం వేచి ఉండాలన్నారు కేంద్ర మంత్రి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్. పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని షియా ముస్లింలు సరిహద్దు గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారని చూస్తూ ఉండండి ఎదో ఒక రోజు ఆ భూభగం దానంతటదే వచ్చి భారత్‌లో కలిసిపోతుందన్నారు. #WATCH | Dausa, Rajasthan | "PoK will merge with India on its own, wait for some time," says Union Minister Gen VK Singh (Retd.) when asked that people in PoK have demanded that they be merged with India. (11.09.2023) pic.twitter.com/xG2qy7hXEm — ANI (@ANI) September 12, 2023 ఈ సందర్బంగా జీ20 సమావేశాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రసశంసలు కురిపించిన ఆయన గతంలో ఇవే సమావేశాలు చాలా దేశాలు నిర్వహించినప్పటికీ భారత్ మరింత ఘనంగా నిర్వహించిందని ప్రపంచ వేదిక మీద భారత్ సత్తా ఏమిటో నిరూపించుకుందని అన్నారు. Every smallest move was so well planned in #G20BharatSummit How #Chinese Premier Li Qiang was greeted on his arrival? 1. Received by VK Singh, EX-ARMY General. 2. Considering #China 's LOVE for Northeast...Assamese song was played in background. Entire reception had NSA Ajit… pic.twitter.com/vCvE4RAse0 — BhikuMhatre (@MumbaichaDon) September 12, 2023 ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని అందుకే బీజేపీ ప్రతిష్టాత్మక పరివర్తన యాత్రను ప్రారంభించిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యాత్ర సమయంలో వారే స్వయంగా వచ్చి ఆ విషయాన్ని తెలిపారన్నారు. బీజేపీ ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని ప్రధాని ఛరిష్మాతోనే ఎన్నికలకు వెళ్తుందని అన్నారు. మంచితనంతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజలు కోరుకునే అభ్యర్థులకు పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. #WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp — ANI (@ANI) September 8, 2023 ఇది కూడా చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ -
బ్రెజిల్ ఆర్మీ చీఫ్‌పై వేటు
బ్రసిలియా: జనవరి 8వ తేదీన బ్రెజిల్ పార్లమెంట్, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో బ్రెజిల్ ఆర్మీ చీఫ్ జనరల్ జులియో సీజర్ డి అర్రుడాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఆగ్నేయ మిలటరీ కమాండ్ హెడ్ జనరల్ టామ్స్ మిగుయెల్ రిబిరో పయివా శనివారం నియమితులయ్యారు. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులుగా భావిస్తున్న వారు పాల్పడిన దాడికి సైనిక బలగాల్లో కొందరు అనుకూలంగా ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలే జనరల్ జులియో కొంపముంచాయని భావిస్తున్నారు. అధ్యక్షుడు లులా డిసిల్వా ఈ పరిణామంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. -
శతఘ్ని దళాల్లోకి మహిళా అధికారులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించింది. ముందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని భావిస్తున్నామన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే బోఫోర్స్ హౌవిట్జర్, కె–9 వజ్ర, ధనుష్ వంటి తుపాకులను ఇకపై మహిళలు కూడా ఉపయోగించగలుగుతారు. వీరు ఆర్టిలరీ పోరాట సహాయక విభాగంలో ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పదాతి దళం తర్వాత రెండో అతిపెద్ద రెజిమెంట్ శతఘ్ని దళమే. నిర్ణాయక విభాగంగా భావించే కీలకమైన ఈ దళంలో మిస్సైళ్లు, మోర్టార్లు, రాకెట్ లాంఛర్లు, డ్రోన్లు మొదలైనవి ఉంటాయి. పదాతి దళం, శతఘ్ని, మెకనైజ్డ్ శతఘ్ని రెజిమెంట్లలో ఇప్పటి వరకు మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్లు లేవు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్మీ మార్పులు తెచ్చింది. మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2022లో ఖడక్వాస్లాలోని డిఫెన్స్ అకాడమీలోకి 19 మంది మహిళా కేడెట్లతో మొదటి బ్యాచ్‌కు మూడేళ్ల శిక్షణ ప్రారంభించింది. అయితే, ఇన్ఫాంట్రీ, ఆర్మర్డ్ రెడ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీల్లోకి మహిళా అధికారులను చేర్చుకోవాలన్న ప్రణాళికలేవీ లేవని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. -
Agnipath Scheme: అగ్నిపథ్‌పై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు అగ్నిపథ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డీఎంఏ అడిషన్ సెక్రటరీ అనిల్‌పురి మాట్లాడుతూ.. ‘‘అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయం చేశాము. అగ్నిపథ్‌పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారు. 1989 నుంచి అగ్నిపథ్ పెండింగ్‌లో ఉంది. సగటు వయస్సును తగ్గించేందుకు సంస్కరణలు తీసుకువచ్చాము. సైన్యాన్ని యువకులతో నింపాలన్నదే లక్ష్యం. ఆర్మీలోకి వచ్చి వెళ్లేందుకు చాలా అవకాశాలు కల్పించాము. మా కంటే ఇప్పడున్న యువత చాలా శక్తివంతమైనది. సెల్ఫోన్లు, డ్రోన్లతో యువత అద్భుతాలు చేస్తున్నారు. రానున్న కాలంలో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర. నేటి యువతకు టెక్నాలజీపై మంచి పట్టుంది. ఈసారి ఎక్కువ మందిని నియమించాలని భావించాము. అగ్నివీర్లు సైన్యంలో కొనసాగే వీలుంది. 'అగ్నివీర్స్' దేశ సేవలో తన జీవితాన్ని త్యాగం చేస్తే కోటి రూపాయల పరిహారం అందుతుంది. ప్రస్తుతం 46వేల మంది అగ్నివీర్ల నియామకం చేపడుతున్నాము. వచ్చే నాలుగైదు ఏళ్లలో రిక్రూట్మెంట్ సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు ఉంటుంది. దీన్ని క్రమంగా 90 వేల నుంచి లక్ష వరకు పెంచుతాం. భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుంది. అగ్నివీర్లకు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాయి. ఆందోళనలకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ నెల ఎయిర్‌ఫోర్స్‌లో 24 నుంచి తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూలై 24 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఫేజ్-1 ఆన్లైన్ టెస్టు ఉంటుంది. డిసెంబర్ 30 నాటికి తొలిబ్యాచ్ ట్రైనింగ్‌కు వెళ్తారు. త్రివిధ దళాల్లో ఇకపై సాధారణ నియామకాలు ఉండవు. అగ్నిపథ్ ద్వారానే ఇకపై నియామకాలు జరుగుతాయి. సైన్యానికి క్రమశిక్షణ తప్పనసరి. విధ్వంసాలకు పాల్పడిన వారికి సైన్యంలో చోటులేదు. యువత ఆందోళనల్లో పాల్గొనవద్దు. కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారన్న వాదన సరికాదు. త్రివిధ దళాల నుంచి ఏటా సగటున 17,600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారు. వీరంతా రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ అడగడం లేదు ’’ అని వ్యాఖ్యానించారు. 'Agniveers' will get a compensation for Rs 1 crore if he sacrifices his life in service of the nation: Lt Gen Anil Puri https://t.co/p4navR0VRZ pic.twitter.com/Z9Pj58L9Ew — ANI (@ANI) June 19, 2022 -
ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే
న్యూఢిల్లీ: దేశ 29వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే శనివారం రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జనరల్ పాండే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పగ్గాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్మీ చీఫ్‌గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్ కమాండ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. దేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ థియేటర్ కమాండ్స్ బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం మరొకరిని నియమించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పాండే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌లో చేరారు. సుదీర్ఘ కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ కమాండ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు. -
భావి యుద్ధాలకు ట్రైలర్లు చూస్తున్నాం
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి రానుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్ వార్ఫేర్ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయన్నారు. అణుపాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్లు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అన్నారు. గురువారం ఇక్కడ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (సీఎల్‌ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేసిన సెమినార్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌లతో పాటు నరవణె పాల్గొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలి యుద్ధ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఎంతగానో పెరిగిందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే ప్రధాన పాత్ర కావడం, యూఏఈపై యెమన్ హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు, వాటిని అమెరికా సాంకేతిక సహకారంతో యూఏఈ అడ్డుకున్న తీరు ఇందుకు తాజా నిదర్శనాలన్నారు. పాక్, చైనా నుంచి జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను లోతుగా ఆయన విశ్లేషించారు. ‘‘విచ్ఛిన్న శక్తులు స్థానిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని తక్కువ ఖర్చుతో భారీ దాడులకు తెగబడతాయి. అధునాతన సామర్థ్యం అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో ప్రయోగించలేని పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. అఫ్గానిస్తాన్‌లో నిత్యం జరుగుతున్న మారణహోమమే నిదర్శనం’’ అన్నారు. పాక్‌ను నిర్దేశించగలుగుతున్నాం నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గడం, పాక్‌తో కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవుతుండటానికి ప్రధాన కారణం మన సైనిక పాటవమేనని జనరల్ నరవణె అన్నారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను కట్టిపెట్టేందుకు ఇరు సైన్యాల మధ్య గతంలో అంగీకారం కుదరడం తెలిసిందే. -
ఆర్మీ వైస్ చీఫ్‌గా మనోజ్ పాండే
న్యూఢిల్లీ: భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతీ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటివరకు మనోజ్ తూర్పు ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఈ పదవికి తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితాను నియమించారు. 1982లో పాండే ఆర్మీలో చేరారు. పలు కీలక పదవులు నిర్వహించడంతో పాటు అనేక కీలక యుద్ధాల్లో పాల్గొన్నారు. పరమ్ విశిష్ఠ సేవా మెడల్‌తో పాటు పలు అవార్డులు ఆయనకు దక్కాయి. ఏప్రిల్‌లో ఆర్మీ చీఫ్ నరవణె పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సీనియర్ అధికారి మనోజ్ పాండే ఏప్రిల్ అనంతరం ఈ పదవి చేపట్టే అవకాశాలున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరజవాన్లకు నివాళులు అర్పించారు. -
చైనాతో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయ్
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య ఒక ఒప్పందం కుదిరే వరకు సరహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా గతంలో మాదిరిగా బుద్ధి చెప్పడానికి మన సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. గురువారం పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సులో పాల్గొన్న నరవణె మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఏర్పడే ముప్పుపై దృష్టి సారించామని చెప్పారు. దానికనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలిపారు. -
ఆధునిక ఆలోచన వైపు మారాలి: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: డ్రోన్లు సులభంగా లభ్యమవుతుండడం తో భద్రతపరమైన సవాళ్లు మరింత పెరుగుతున్నాయని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె పేర్కొన్నారు. దాడులను డ్రోన్లు సులభతరం చేశాయన్నారు.ఆధునిక యుద్ధ రీతులను, డ్రోన్ దాడుల వంటి కొత్తరకం సవాళ్లను ఎదుర్కొనేందుకు కాలం చెల్లిన ఆలోచన విధానం సరికాదన్నారు. రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునే విషయంలో ఆర్మీ డిజిటల్ కాలానికి మారకపోవడం సమస్యగా మారిందన్నారు. మార్పుకు అనుగుణంగా ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యమన్నారు. జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై ఇటీవల డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే చేసి ఉంటారని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
మా ఓపికను పరీక్షించొద్దు!
న్యూఢిల్లీ: భారత్ ఓపికను పరీక్షించే సాహసం చేయవద్దని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. ఉత్తర సరిహద్దులో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని వ్యాఖ్యానించారు. లద్దాఖ్ లో చైనాతో ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితుల్లో జనరల్ నరవణె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్లో శుక్రవారం జరిగిన ఆర్మీ డే పరేడ్ కార్యక్రమంలో జనరల్ నరవణె పాల్గొన్నారు. గత సంవత్సరం జూన్‌లో లద్దాఖ్‌లో ‘గల్వాన్ హీరోలు’ చేసిన ప్రాణత్యాగం వృధా పోదని, దేశ సమగ్రత, సార్వభౌమత్వం, రక్షణకు ప్రమాదం వాటిల్లనివ్వబోమని స్పష్టం చేశారు. ‘తీవ్రమైన చలి పరిస్థితుల్లోనూ తూర్పు లద్దాఖ్‌ల్లో విధుల్లో ఉన్న భారత సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతినలేదు. అక్కడి పర్వతాల కన్నా ఎత్తుగా వారి ధైర్య, సాహసాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘చర్చలు, రాజకీయ ప్రయత్నాల ద్వారా సమస్యలు పరిష్కారమవ్వాలనే మేం కోరుకుంటాం. అయితే, మా ఓపికను పరీక్షించే తప్పు ఎవరూ చేయవద్దు’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉందని పాకిస్తాన్‌పై ఆయన మండిపడ్డారు. -
ఆరోజు ఆర్మీ చీఫ్ కాళ్లు వణికాయి: పాక్ నేత
ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఇప్పటివరకు అన్నిరకాలుగా మద్దతుగా నిలిచాయని, అయితే ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్(పీఎంఎల్-ఎన్) నేత ఆయాజ్ సాదిక్ అన్నారు. భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ విడుదల విషయంలో ఇమ్రాన్ సర్కారు నిర్ణయంతో తాము ఏకీభవించినట్లు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో గత కొన్నిరోజులుగా పాకిస్తాన్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు కరోనా వ్యాప్తితో అతలాకుతలమవుతున్న వేళ, మరోవైపు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలు క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.(చదవండి: పాకిస్తాన్లో అంతర్యుద్ధం?) ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అయాజ్ సాదిఖ్ బుధవారం నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ. అభినందన్ వర్ధమాన్ విడుదల నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు ఇమ్రాన్‌ఖాన్ నిరాకరించారు. ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా గదిలోకి వచ్చారు. అప్పటికే ఆయన కాళ్లు వణుకుతున్నాయి. చెమటలు పట్టాయి. భారత వింగ్ కమాండర్‌ను విడుదల చేయనట్లయితే, రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌పై, ఇండియా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఖురేషి చెప్పారు. అభినందన్‌ను విడుదల చేయడం ఒక్కటే మార్గమని, పార్లమెంటరీ సమావేశానికి హాజరైన పీపీపీ, పీఎంఎల్-ఎన్ తదితర పార్టీలను అభ్యర్థించారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించాయి’’ అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనం ప్రచురించింది. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. వైమానిక దాడుల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన అభినందన్‌ను.. వీరచక్ర శౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే. -
‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!
న్యూఢిల్లీ: త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’ను ఏర్పాటు చేయడం సైనిక సంస్కరణల్లో తదుపరి కీలక నిర్ణయం అవుతుందని బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వెల్లడించారు. సైనిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. థియేటర్ కమాండ్స్ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఐక్యంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని ‘కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్’లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో సాయుధ దళాల విలీనం తప్పని సరిగా చోటు చేసుకునే విషయమని, త్రివిధ దళాల మధ్య సమన్వయానికి, వనరుల అత్యుత్తమ వినియోగానికి అది తప్పదని జనరల్ నరవణె వ్యాఖ్యానించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఒక కమాండర్ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా, ఐకమత్యంగా ఉమ్మడి మిలటరీ లక్ష్యం కోసం సమర్ధవంతంగా, సమన్వయంతో పనిచేసేందుకు ఏర్పాటు చేసేవే ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’. -
ఆపరేషన్ నమస్తే
న్యూఢిల్లీ/చండీగఢ్: కరోనా వైరస్ విస్తృతి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల కోసం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఆపరేషన్ నమస్తే అనే ఈ కార్యక్రమంలో కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయం అందించడంతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లోని 13 లక్షల మంది సైనికులు, వారి కుటుంబాలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోనున్నారు. సైనిక సిబ్బంది తమ క్లిష్టమైన విధుల దృష్ట్యా సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదని, అందుకే సాధ్యమైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘మీ కుటుంబాల సంక్షేమం గురించి మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సరిహద్దులోని జవాన్లకు హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మేం విజయం సాధిస్తాం’ అని తెలిపారు. ఆపరేషన్ నమస్తేలో భాగంగా ప్రత్యేకంగా కమాండ్ల వారీగా సాయం అందించేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు పలు సూచనలు జారీ చేసింది. అదేవిధంగా, కరోనా వైరస్ అనుమానిత కేసుల కోసం ఆర్మీ వెస్టర్న్ కమాండ్ పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా బారినపడిన సైనిక సిబ్బందికి, ప్రజలకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను 28 సైనికాస్పత్రుల్లో సిద్ధం చేసింది. కేంద్రానికి నోటీసులు... ఇరాన్‌కు తీర్థయాత్రకు వెళ్లిన 850 మందిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. కరోనా నేపథ్యంలో ఇరాన్‌లోని క్వోమ్ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించాలంటూ లదాఖ్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా, బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన 580 మంది కశ్మీర్ వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలను తెలపాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. -
రెడీ టూ యాక్షన్..!
-
పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం
న్యూఢిల్లీ: ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మొత్తం భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఎప్పుడో తీర్మానం చేసింది. ఒకవేళ ఆ భూభాగం మళ్లీ మన స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తే కచ్చితంగా ఆ విషయంపై చర్యలు చేపడతాం’ అని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే స్పష్టం చేశారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 13 లక్షల మంది ఉన్న ఆర్మీ.. రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. పీఠికలోని విషయాలకు లోబడి ఉంటుందన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గ్రేట్.. త్రివిధ దళాలన్నింటినీ సమన్వయ పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నరవాణే చెప్పారు. ఇది విజయవంతం అయ్యేందుకు ఆర్మీ తరఫున సహాయసహకారాలు అందిస్తామన్నారు. భారత సైన్యం పాక్‌లా దొంగ దెబ్బ తీయదని, నైపుణ్యంతోనే పని చేస్తుందని చెప్పారు. నైతిక విలువలకు సైన్యం కట్టుబడి ఉంటుందన్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేలను మూడింటినీ సమన్వయం చేస్తూ.. మిలటరీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఏకైక సలహాదారుగా సీడీఎస్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఓ కన్నేసి ఉంచాలి.. ఆర్మీకి సైనికులే బలమని నరవాణే చెప్పారు. ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, ఎలాంటి వారు ఉన్నారన్నదే తమ మంత్రమని చెప్పారు. ఇదే సైనిక ఆయుధాలకూ వర్తిస్తుందన్నారు. భారత బలగాలు సియాచిన్ ప్రాంతంలో ఓ కన్నేసి ఉంచాలని నరవాణే వ్యాఖ్యానించారు. పాక్, చైనాల మధ్య ఈ ప్రాంతం గురించి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఆర్మీ కొత్త చీఫ్‌గా మనోజ్
న్యూఢిల్లీ: దేశ 28వ సైనిక దళాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను కొత్తగా ఏర్పాటైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్)కు అధిపతిగా కేంద్రం నియమించడంతో.. ఆర్మీ వైస్‌చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్æ ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదం, సరిహద్దుల్లో పెరిగిన చైనా దూకుడు వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న నేపథ్యంలో 13 లక్షల సైన్యానికి అధిపతిగా మనోజ్ బాధ్యతలు చేపట్టారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను పట్టాలకెక్కించే బాధ్యత ఆయనపైనే పడింది. కాగా, సీడీఎస్ ఆధ్వర్యంలో నడిచే సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ)ను ఏర్పాటు చేస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన మనోజ్(59)నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీల్లో శిక్షణ పొందారు. 1980లో సిఖ్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్‌లో చేరారు. 37 ఏళ్ల సర్వీసులో చైనాతో 4వేల కిలోమీటర్ల మేర సరిహద్దు ఉన్న ఈస్టర్న్ కమాండ్తోపాటు పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లలో ఉగ్రవ్యతిరేక చర్యల్లో పాల్గొన్నారు. కశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. శ్రీలంక వెళ్లిన శాంతి పరిరక్షణ దళంలోనూ, మయన్మార్‌లోను మూడేళ్లపాటు పనిచేశారు. సేనా పతకం, విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను ఈయన అందుకున్నారు. ఉగ్రమూలాలపై దాడి చేసే హక్కుంది పొరుగుదేశం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం మానని పక్షంలో ఆ దేశంలోని ఉగ్రమూలాలను దెబ్బతీసే హక్కు భారత్‌కు ఉందని కొత్త ఆర్మీ చీఫ్ ఎం.ఎం. మనోజ్ స్పష్టం చేశారు. పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన పలు విషయాలపై ముచ్చటించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవడంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఉగ్ర మూకల ఏరివేత, వారి నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంతో పాక్ ఆర్మీ పరోక్ష యుద్ధ వ్యూహం బెడిసికొట్టింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి’ అని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చైనా సరిహద్దులో పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో దృష్టంతా ఇప్పుడు పశ్చిమ సరిహద్దుల నుంచి ఉత్తర సరిహద్దుకు మారింది. ఉత్తర సరిహద్దుల్లో సన్నద్ధతను, సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నాం’అని తెలిపారు. ఎప్పుడైనా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేలా సైన్యాన్ని సన్నద్ధం చేయడంపైనే తన దృష్టంతా ఉందని జనరల్ మనోజ్ అన్నారు. కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం రక్షణ శాఖలో కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొట్టమొదటి సీడీఎస్‌గా నియమితులైన జనరల్ బిపిన్ రావత్ దీనికి నేతృత్వం వహించనున్నారని ప్రభుత్వం మంగళవారం తెలిపింది. త్రివిధ దళాలకు మాత్రమే సంబంధించిన కొనుగోళ్లను, మిలటరీ కమాండ్ల పునర్వ్యవస్థీకరణ, అన్ని కమాండ్లను సమన్వయ పరుస్తూ వనరులను గరిష్టంగా వినియోగపడేలా చూడటం డీఎంఏ బాధ్యతని పేర్కొంది. త్రివిధ దళాల అవసరాలకు తగ్గట్లుగా కొనుగోళ్లు, శిక్షణ, సిబ్బంది నిర్వహణ చేపట్టడం తోపాటు దేశీయ తయారీ ఆయుధాల వినియోగాన్ని పెంచడం దీని లక్ష్యమని తెలిపింది. ఇందుకు సంబంధించి 1961 నాటి భారత ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు చేపట్టేందుకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేశారని పేర్కొంది. కాగా, సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని, దేశం తిరోగమనంలో పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం: జనరల్ రావత్ పాక్, చైనాల నుంచి సరిహద్దుల్లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సైన్యం పునర్వ్యవస్థీకరణ, ఆధునీకరణ పదవీ కాలంలో తాను సాధించిన అతిపెద్ద విజయాలని పేర్కొన్నారు. సీడీఎస్‌గా ప్రభుత్వం నియమించడంతో ఆయన మంగళవారం ఆర్మీ చీఫ్‌గా బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సైనిక వందనం స్వీకరించారు. అనంతరం జనరల్ రావత్ మాట్లాడుతూ.. మూడేళ్ల పదవీ కాలంలో తనకు సహకరించిన సైనిక శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త చీఫ్ నేతృత్వంలో సైన్యం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీడీఎస్ హోదాకు సంబంధించిన షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జీ, కారుజెండా, టోపీ, యూనిఫాం గుండీలు, బెల్ట్ -
ఆర్మీ చీఫ్ పదవీ విరమణ
-
భారత్ బలగాలు పీవోకేలోకి వెళ్లేందుకు సిద్ధం..
శ్రీనగర్ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం స్పష్టం చేశారు. పీవోకేను తిరిగి భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనిక చర్యకు తాము సిద్ధమని పేర్కొన్నారు. పాకిస్తాన్ చేతుల నుంచి పీవోకేను తిరిగి సాధించడమే భారత తదుపరి అజెండా అని బిపిన్ రావత్ తేల్చిచెప్పారు. ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పీఓకే స్వాధీనం దిశగా కేంద్రం అనుమతి కోసం వేచిచూస్తున్నామని, ఆదేశాలు రాగానే వెంటనే ఆపరేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా దేశంలోని వ్యవస్థలు పనిచేస్తాయని, ఇందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాగా పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడమే తదుపరి భారత్ అజెండా అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 1994లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన తీర్మానంలోనూ ఈ విషయం పొందుపరిచారని ఆయన ప్రస్తావించారు. -
ఏరో ఇండియా - 2019 ప్రదర్శనలో తేజోస్
-
‘ఆ ఆయుధాలతోనే పోరాడతాం’
సాక్షి, న్యూఢిల్లీ : అందుబాటులో ఉన్న ఆయుధాలతో పోరాడేందుకు సేనలు సిద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఆయుధ సామ్రాగి సమకరణ కొనసాగుతోందని చెప్పారు.సైన్యం నిధుల కొరతతో సేనల ఆధునీకరణ, నూతన ఆయుధాల కొనుగోళ్లు మందగించాయని పార్లమెంటరీ కమిటీ నివేదిక నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నిధుల కొరతతో దళాల ప్రతిఘటన సామర్ధ్యం మెరుగుదల సమస్యలు ఎదుర్కొంటోందని రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లదించింది. కొన్ని ఆయుధాలకు కాలగ్రహణం పట్టిందన్న వాదనపై ఆర్మీ చీఫ్ స్పందిస్తూ గతంలోనూ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు . ఏ ఆయుధాలు అందుబాటులో ఉన్నా వాటితో పోరాడేందుకు ఆర్మీ జవాన్లు సిద్ధంగా ఉన్నారని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సైన్యానికి వెచ్చిస్తున్న ఖర్చులన్నీ నిర్వహణకే సరిపోతున్నాయన్న ప్రచారం అవాస్తవమని ఇటీవల ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.రక్షణ రంగ బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో దాదాపు 35 శాతం జాతి నిర్మాణానికే వెచ్చిస్తారని, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతల మెరుగుదలకు వెచ్చిస్తామమని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు విరమించుకోకుంటే తదుపరి చర్యలపై ముందడుగు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
సైన్యం అన్ని మతాలను స్వాగతిస్తుంది
-
మానవాళికి అది పెనుముప్పే: ఆర్మీ చీఫ్ రావత్
సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండటం మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అవకాశముందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకుంటూ అంతర్జాతీయ సరిహద్దులను అధిగమించి చొచ్చుకువస్తున్నారని అన్నారు. ఉగ్రవాదులనే కాదు.. వారిని ప్రోత్సాహిస్తూ స్పాన్సర్లుగా ఉన్న వారిని సైతం చెదరగొట్టాల్సిన అవసరముందని, ఉగ్రవాదులకు స్పాన్సర్లుగా ఉన్న దేశాలను గుర్తించాలని సూచించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ‘రైజినా2018’ సదస్సులో ఆర్మీ చీఫ్ రావత్ మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు, మిలిటెంట్లకు ఉన్న లింకులను తొలగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు తరచూ ఉపయోగించే ఇంటర్నెట్, సోషల్ మీడియాపై కొంతమేరకు ఆంక్షలు విధించాల్సిన అవసరముందని, ప్రజాస్వామిక దేశాల ప్రజలు దీనిని అంగీకరించకపోయినా.. భద్రమైన వాతావరణం కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంటుందని రావత్ అన్నారు. -
సామాన్య భక్తులతో కలసి దర్శనం
సుపథం మార్గంలో శ్రీవారిని దర్శించుకున్న ఆర్మీ చీఫ్ తిరుపతి(అలిపిరి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం నిరాడంబరంగా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా సామాన్య భక్తులతో కలసి సుపథం మార్గంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకున్నారు. రావత్ కుటుంబం, జవాన్లు ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందారు. సామాన్య భక్తులతో పాటుగా ముందుకు కదిలిన రావత్ ఆలయంలోని శ్రీవారి సేవకులను పలకరించారు. తిరుమల జేఈవో శ్రీనివాస రాజు, అదనపు సీవీఅండ్ఎస్వో శివకుమార్‌రెడ్డిలు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రావత్ దంపతులకు రంగనాయకుల మండపంలో అర్చకుల ఆశీర్వచనాల నడుమ శ్రీవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలను అందజేశారు.