
బ్రసిలియా: జనవరి 8వ తేదీన బ్రెజిల్ పార్లమెంట్, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో బ్రెజిల్ ఆర్మీ చీఫ్ జనరల్ జులియో సీజర్ డి అర్రుడాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఆగ్నేయ మిలటరీ కమాండ్ హెడ్ జనరల్ టామ్స్ మిగుయెల్ రిబిరో పయివా శనివారం నియమితులయ్యారు. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులుగా భావిస్తున్న వారు పాల్పడిన దాడికి సైనిక బలగాల్లో కొందరు అనుకూలంగా ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలే జనరల్ జులియో కొంపముంచాయని భావిస్తున్నారు. అధ్యక్షుడు లులా డిసిల్వా ఈ పరిణామంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment