సాక్షి, న్యూఢిల్లీ : అందుబాటులో ఉన్న ఆయుధాలతో పోరాడేందుకు సేనలు సిద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఆయుధ సామ్రాగి సమకరణ కొనసాగుతోందని చెప్పారు.సైన్యం నిధుల కొరతతో సేనల ఆధునీకరణ, నూతన ఆయుధాల కొనుగోళ్లు మందగించాయని పార్లమెంటరీ కమిటీ నివేదిక నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నిధుల కొరతతో దళాల ప్రతిఘటన సామర్ధ్యం మెరుగుదల సమస్యలు ఎదుర్కొంటోందని రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లదించింది. కొన్ని ఆయుధాలకు కాలగ్రహణం పట్టిందన్న వాదనపై ఆర్మీ చీఫ్ స్పందిస్తూ గతంలోనూ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు
. ఏ ఆయుధాలు అందుబాటులో ఉన్నా వాటితో పోరాడేందుకు ఆర్మీ జవాన్లు సిద్ధంగా ఉన్నారని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సైన్యానికి వెచ్చిస్తున్న ఖర్చులన్నీ నిర్వహణకే సరిపోతున్నాయన్న ప్రచారం అవాస్తవమని ఇటీవల ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.రక్షణ రంగ బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో దాదాపు 35 శాతం జాతి నిర్మాణానికే వెచ్చిస్తారని, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతల మెరుగుదలకు వెచ్చిస్తామమని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు విరమించుకోకుంటే తదుపరి చర్యలపై ముందడుగు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment