ఢిల్లీ : మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 8, 2021న ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ మంగళవారం లోక్‌సభ ముందుంచింది.
2017 - 2022 వరకు 'పదమూడవ డిఫెన్స్ పీరియడ్ ప్లాన్' పేరిట రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2017-2022 వరకు మొత్తం భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది.
The Indian Air Force has officially attributed the tragic crash of the Mi-17 V5 helicopter, which resulted in the untimely demise of CDS General Bipin Rawat and other esteemed personnel, to human error by the flying crew. This conclusion raises critical questions about the… pic.twitter.com/lFNZs29uls
— Aviator Amarnath Kumar (@aviatoramarnath) December 19, 2024
వాటిల్లో అప్పటి సీడీఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం కూడా ఉందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సందర్భంగా బిపిన్ రావత్ ప్రమాదానికి కారణం మానవ తప్పిదేమేనని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులోని సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఆ రోజు ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు.
అయితే మార్గం మధ్యలో హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్ హెలికాప్టర్‌ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చాము’ అని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment