Indian airforce
-
మానవ తప్పిదమే.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణం
ఢిల్లీ : మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 8, 2021న ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ మంగళవారం లోక్‌సభ ముందుంచింది. 2017 - 2022 వరకు 'పదమూడవ డిఫెన్స్ పీరియడ్ ప్లాన్' పేరిట రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2017-2022 వరకు మొత్తం భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది.The Indian Air Force has officially attributed the tragic crash of the Mi-17 V5 helicopter, which resulted in the untimely demise of CDS General Bipin Rawat and other esteemed personnel, to human error by the flying crew. This conclusion raises critical questions about the… pic.twitter.com/lFNZs29uls— Aviator Amarnath Kumar (@aviatoramarnath) December 19, 2024 వాటిల్లో అప్పటి సీడీఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం కూడా ఉందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సందర్భంగా బిపిన్ రావత్ ప్రమాదానికి కారణం మానవ తప్పిదేమేనని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులోని సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఆ రోజు ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు.అయితే మార్గం మధ్యలో హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్ హెలికాప్టర్‌ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చాము’ అని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్‌లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
భర్త పాయిజన్ తీసుకుని చనిపోవడంతో భార్య..
భార్యభర్తలిద్దరు ఒకరు తరువాత ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. భర్త చనిపోయిన కొద్ది క్షణాల్లోనే ఆయన లేని జీవితం తనకూ వద్దంటూ మృతుడి భార్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అజయ్ పాల్(37), మౌనిక (32) ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. బుధవారం మౌనిక పాల్ భర్త నోటి నుంచి నురగతో స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో మౌనిక భర్తను హుటాహుటినీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె భర్త చనిపోయినట్లు ధృవీకరించారు. దీన్ని జీర్ణించుకోలేని మౌనిక వెంటనే ఇంటికి వచ్చి పాయిజన్ తీసుకుని అదే రోజు మధ్యాహ్నాం చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలుగొట్టి చూడగా.. మౌనిక విగతజీవిగా పడి ఉంది. దీంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో ఆమె భర్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని, ఇటీవలే అతను ఎయిర్ ఫోర్స్ జాబ్ నుంచి వైదొలగినట్లు వెల్లడించారు పోలీసులు. పైగా ఆ జంటకు రెండేళ్ల క్రితమే వివాహం అయ్యిందని తెలపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన బలమైన కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: మాఫియాపై ఉక్కుపాదం..ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల నివాసాలు బుల్డోజర్లతో కూల్చివేత) -
Prachand: రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
జైపూర్: భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్ ఇన్ ఇండియా ఘనత వచ్చి చేరింది. తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్(LCH) ‘ప్రచండ్’ను ఇవాళ(సోమవారం) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ను జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వ్ ధరమ్ ప్రార్థన సైతం నిర్వహించారు. Made-in-India light combat helicopters 'Prachand' inducted into IAF Read @ANI Story | https://t.co/S6zR9sWphB#LCH #Prakhand #RajnathSingh #IAF pic.twitter.com/nh36KANOdz — ANI Digital (@ani_digital) October 3, 2022 చాలా కాలంగా.. దాడుల కోసం తేలికపాటి హెలికాప్టర్ల అవసరం ఉంది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆ అవసరాన్ని తీవ్రంగా భావించింది మన సైన్యం. LCH అనేది రెండు దశాబ్దాల పరిశోధన-అభివృద్ధి ఫలితం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రచండ్ ప్రవేశం రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయి. ప్రచండ్ సమర్థవంతంగా శత్రు నిఘా నుంచి తప్పించుకోగలదు. వివిధ రకాల మందుగుండు సామగ్రిని మోసుకెళ్ళగలదు. దానిని త్వరగా యుద్ధ ప్రాంతాలకు అందించగలదు. ఇది వివిధ భూభాగాలలో మన సాయుధ దళాల అవసరాలను సంపూర్ణంగా తీరుస్తుంది. ఇది మన సైన్యం, వైమానిక దళం రెండింటికీ ఆదర్శవంతమైన వేదిక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి రాజ్‌నాథ్ సింగ్. For a long time, there was a need for attack helicopters & during the 1999 Kargil war, its need was felt seriously. The LCH is a result of research & development for two decades. And its induction into IAF is an important milestone in defence production: Defence Minister R Singh pic.twitter.com/zU5KrCUjwk — ANI (@ANI) October 3, 2022 ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించింది. 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తులో గణనీయంగా ఆయుధాలు, ఇంధనంతో.. భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రచండ్ ల్యాండ్-టేకాఫ్ చేసుకోగలదు. ప్రపంచంలోనే ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం. There is no need to define ‘Prachand’, the LCH itself is capable of sending out a message to the enemy: Defence Minister Rajnath Singh after his LCH sortie at Jodhpur IAF airbase pic.twitter.com/KQoRtRjvfH — ANI (@ANI) October 3, 2022 అవసరమైన చురుకుదనం, యుక్తి, విస్తరించిన శ్రేణి, అధిక ఎత్తులో పనితీరు, అన్ని వేళలా.. వాతావరణం ఎలాంటిదైనా సరే పోరాట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రచండ్. భారత సైన్యం.. ప్రత్యేకించి వైమానిక దళం కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ప్రచండ్ ఒక శక్తివంతమైన వేదిక అవుతుందని అధికారులు చెప్తున్నారు. మార్చిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) రూ. 3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 పరిమిత శ్రేణి ఉత్పత్తి (LSP) తేలికపాటి యుద్ధ విమానాల సేకరణకు ఆమోదం తెలిపింది. IAF కోసం పది హెలికాప్టర్లు, భారత సైన్యం కోసం ఐదు హెలికాప్టర్లు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: 8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు -
బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటన.. ప్రమాదమే!
సాక్షి, న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. డిసెంబర్ 8న తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణించిన భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 14మంది దుర్మరణం పాలయ్యారు. ‘కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్కు బయల్దేరిన MI-17V5 హెలికాప్టర్ కనూర్ సమీపంలో దట్టమైన మేఘాలల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా దారి స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ ఇబ్బందులు పడ్డాడు. మేఘాల్లో చిక్కుకోవడంతో ముందున్న దృశ్యాలు అస్పష్టంగా కనిపించాయి. దారి కోసం రైల్వే లైన్‌ను హెలికాప్టర్ పైలట్ అనుసరించాడు. ఎత్తయిన శిఖరం అంచును హెలికాప్టర్ అనూహ్యంగా ఢీకొట్టింది. అదేవేగంతో హెలికాప్టర్ కిందికి పడిపోయింది’ అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నివేదికలో వెల్లడించింది. -
రాగరంజితమైన గోల్కొండ కోట
-
Purvanchal Expressway: విమానాలకు రన్‌వేగా..
లక్నో: దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని భారత ప్రధాని నరేంద్రమోది నవంబర్ 16న ప్రారంభించనున్నారు. పైగా లక్నోలోని చాంద్ సరాయ్లో మొదలుకొని ఈ ఎక్స్‌ప్రెస్‌వే 340 కిలోమీటర్ల పొడవుతో ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది. అంతేకాదు ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితరప్రాంతాలను కలుపుతూ వెళుతుంది. (చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే భారత వైమానిక దళానికి చెందిన విమానాలకు అత్యవసర రన్‌వేగా కూడా ఉపయోగించటమే కాక అత్యవసర పరిస్థితుల్లో ఐఏఎఫ్‌కి చెందిన ఫైటర్ జెట్లకు కూడా ఎయిర్‌స్ట్రిప్( అత్యవసర ల్యాండింగ్ కోసం తాత్కాలిక స్టేషన్)గా కూడా ఉపయోగడనుంది. (చదవండి: కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు) -
అంబాల : ఎయిర్‌ఫోర్స్‌లోకి రఫెల్ యుద్ధ విమానాలు
-
ఎయిర్‌ఫోర్స్‌లోకి 5 రఫెల్ యుద్ధ విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంబుల పొదిలోకి మరికొన్ని యుద్ధ విమానాలు చేరనున్నాయి. వాయుసేనకు సేవలందించేందుకు కొత్తగా మరో ఐదు రఫెల్ యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయి. ఈ గురువారం అంబాల ఎయిర్వేస్లో రఫెల్ యుద్ధ విమానాలు అధికారికంగా చేరనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫోరెన్స్ పార్లీతో పాటు పలువురు ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ ‘ సర్వ ధర్మ పూజ’ నిర్వహించనున్నారు. భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ( దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు ) తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. ఆ రఫెల్ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫెల్ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం బలోపేతమైంది. కాగా, తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి చైనా ఇప్పటికే సుమారు 150 యుద్ధ విమానాలను, ఇతర సహాయక హెలికాప్టర్లను తరలించింది. పాంగాంగ్ సరస్సుకు దక్షిణ తీరంలో భారత సైనికులను ఎంగేజ్ చేస్తూ.. ఉత్తర తీరంలో నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వ్యూహాన్ని చైనా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
22 నుంచి వైమానిక ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్–చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు వైమానిక దళం ఉన్నతాధికారులు ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, ఏడుగురు కమాండర్ ఇన్ చీఫ్‌లు పాల్గొంటారని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్–2000, సుఖోయ్–30, మిగ్–29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్ ఫైటర్లు జెట్లు ఈ మాసాంతంలోనే ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ ఫైటర్ జెట్లను లద్ధాఖ్ సెక్టార్లో మోహరించాలని యోచిస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. -
వాయుసేన చేతికి కొత్త అస్త్రం
న్యూఢిల్లీ: భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్‌ను భారత వాయుసేన (ఐఏఎఫ్)కు అప్పగించింది. 2015 సెప్టెంబర్‌లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే మొదటి హెలికాప్టర్‌ను అరిజోనాలోని మెసాలో భారతవాయుసేనకి అమెరికా అప్పగించిందని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ తెలిపారు. జూలైలో మొదటి హెలికాప్టర్ ఇండియాకు రానుంది. 2017లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్ సంస్థతో రూ.4,168 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అపాచీ హెలికాప్టర్ రాకతో భారత వాయుసేన ఆధునీకరణ వైపు మరో ముందడుగు పడిందన్నారు. ఐఏఎఫ్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ హెలికాప్టర్ తయారైందని, పర్వత ప్రాంతాల్లో దీని సామర్థ్యం గణనీయమైన స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. శత్రువులపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉందని, భూమిపై, గగనతలంలో కూడా దాడులు చేయగలదని భారత వాయుసేన అధికారి ఒకరు తెలిపారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టం సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి. -
‘జైషే’ భరతం పట్టిన సైనికులకు హారతిపట్టిన భారతం..!!
-
‘రక్షణ’లో రాజీనా?
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా కాగ్ నివేదిక ఉన్నప్పటికీ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు భారత రక్షణ ఒప్పందాల్లో అనుసరించిన విధానాలను మాత్రం ఘాటుగానే విమర్శించింది. అధికారంలో ఎవరున్నా.. రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడం వల్ల నాణ్యత లేని ఆయుధాలు భారత్‌కు వస్తున్నాయా? అన్న అనుమానం ప్రజల్లో ఎదురవుతోందని కాగ్ పేర్కొంది. సర్వసాధారణంగా రక్షణ ఒప్పందాల్లో నెలకొంటున్న లొసుగులను కాగ్ నివేదిక వివరించింది. వాయుసేన విధానాల్లో లోపాలు విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలంటే భారత వాయుసేన తమ నిబంధనలు, వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి ఆయుధాలు ఉండాలో, ఎంత ధర ఉండాలో.. ఎంతమేరకు సైనిక అవసరాలున్నాయో ముందే స్పష్టంగా చెప్పాలి. కానీ వాయుసేనకి ఈ అంశాలపై స్పష్టత కొరవడింది. ఎయిర్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ (ఏఎస్‌క్యూఆర్) సూత్రీకరణ విధానాలను మెరుగుపరచుకోకపోవడం వల్ల భారత్ పలు ఆయుధాల ఒప్పందాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అపాచి అటాక్ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి 2015లో మోదీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వాటికి బదులుగా రష్యాకు చెందిన మిల్ ఎంఐ–26 హెలికాప్టర్లను కొనుగోలు చేసి ఉంటే భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదనే చర్చ జరుగుతోంది. యుద్ధ ప్రాంతాలకు సైనికుల్ని, ఆయుధాల్ని చేరవేయడంలో చినూక్ కంటే మిల్ ఎంఐ–26కున్న సామర్థ్యం రెట్టింపని కొందరి వాదన. వాయుసేన తన అవసరాలను తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం బోయింగ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది. ప్రామాణిక ధరల్లో మార్పు ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో సర్వసాధారణంగా ప్రభు త్వం ఒక ప్రామాణిక ధరను నిర్ణయించాలి. దానికి అనుగుణంగా వచ్చిన టెండర్లనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేందుకు టెండర్లని విప్పిచూసిన తర్వాత కూడా ఆ ధరల్ని మార్చేస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. డాప్లర్ వెదర్ రాడార్స్, అపాచి అటాక్ హెలికాఫ్టర్ల కొనుగోలులో అత్యంత కీలకమైన వాయుసేన ప్రమాణాలను (ఏఎస్‌క్యూఆర్) అమ్మకందారులు పాటించకపోయినప్పటికీ కాంట్రాక్టుల్ని అప్పగించారనే విమర్శలున్నాయి. బిడ్లు మార్చుకునే అవకాశం ఆయుధాల కొనుగోలుకు టెండర్లను పిలిచాక విక్రేతలు బిడ్ వేస్తే దాన్ని మార్చే చాన్స్ ఇవ్వకూడదు. కానీ యూపీఏ ప్రభుత్వం యథేచ్ఛగా ఈ నిబంధనను తుంగలో తొక్కిందనే విమర్శలున్నాయి. 2012లో యూపీఏ హయాంలో స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ కంపెనీకి బిడ్ మార్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని విపక్షాలు ఆరోపించాయి. అప్పుడప్పుడే విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టిన అతి చిన్న కంపెనీకి అలాంటి అవకాశం ఇవ్వడం వల్ల భారత్‌కు నాసిరకమైన విమానాలే వచ్చాయి. నిర్వహణ వ్యయంపై అవగాహన లేదు గతంలో.. ఆయుధాలైనా, యుద్ధ విమానాలైనా తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని సంస్థ స్థాయిని చూడకుండా కొనుగోలు జరిగింది. వాటి నిర్వహణ వ్యయంపై ప్రభుత్వాలకు కనీస అంచనాలు ఉండకపోవడంతో భారీగా నష్టాలొచ్చాయి. స్విస్ పిలాటస్ విమానాల నిర్వహణ భారాన్ని మోయలేక.. వాటి వాడకాన్ని 2017లో మోదీ సర్కార్ నిలిపివేసింది. అదే ఆ విమానాల కొనుగోలుకు ముందే ఆలోచించి ఉంటే ఆర్థికంగా చాలా మేలు జరిగేది. ఒప్పందాల్లో జాప్యాలు.. రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాలు కూడా మరో ప్రతికూల అంశమే. నాలుగు ఒప్పందాలకు మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడితే, ఏడు ఒప్పందాలు కుదరడానికి అయిదేళ్ల కంటే ఎక్కువ పట్టింది. వివిధ స్థాయిల్లో అనుమతులు కావాల్సి ఉండడం, అధికారుల్లో నెలకొన్న అలసత్వం వల్లే ఈ జాప్యాలు జరుగుతున్నాయని కాగ్ నివేదిక విమర్శించింది. జాప్యాలతో ధరల భారం.. ఇలా సంవత్సరాల తరబడి జాప్యం జరగడం వల్ల ఆయుధాల ధరలు పెరిగిపోవడంతో.. దేశ ఖజానాపై అదనపు భారం పడుతోంది. రష్యా లేదా కామన్వెల్త్ దేశాల నుంచి ఆయుధాల కొనుగోలులో ప్రతీ ఏడాది జాప్యానికి 5% ధర పెంచడానికి మన ప్రభుత్వం గతంలోనే అనుమతినిచ్చింది. అదే యూరోపియన్ దేశాలకు 3.5% పెంచుకునేలా నిర్ణయించింది. కానీ మార్కెట్ ధరల్ని పరిశీలించి చూస్తే మన దేశం అనుమతించిన దానికి సగానికి సగం తక్కువగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ భారత్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పంటపొలాల్లో ల్యాండైన హెలికాప్టర్
శ్రీకాకుళం: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ గురువారం అత్యవసరంగా శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ అయింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. కాగా హెలికాప్టర్ ఒడిశాలోని గోపాల్పూర్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మాయి వలలో పడి కీలక సమాచారం లీక్
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ఫోర్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కీలక రహస్య సమాచారాన్ని తనతో సన్నిహితంగా ఉండే అమ్మాయితో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారని ఆయనను అరెస్టు చేశారు. సమాచారాన్ని పొందిన ఆ మహిళ ఓ గుఢాచారి అని, సదరు అధికారిని ట్రాప్‌లోకి దింపి మంచితనంగా వ్యవహరించి వలపన్ని ఈ పనిచేసినట్లు తెలిపారు. ఆ అధికారి ఢిల్లీ ఉన్నత కార్యాలయాల్లో ర్యాంక్ స్థాయి అధికారి అని సమాచారం. ఓ క్లాసిఫైడ్ సమాచారాన్ని అతడు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఆ మహిళకు పంపించినట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ సెక్యూరిటీ దర్యాప్తు బృందం ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సాయుధ బలగాల్లో సోషల్ మీడియాను ఉపయోగించే విషయంలో తాము కఠిన నిబంధనలు పాటిస్తామని, అధికారులు తమ ర్యాంకులను, హోదాలను కూడా వాటి ద్వారా పంచుకునేందుకు వీలుండదని సమాచారం. వారు ధరించిన దుస్తులతో ఫొటోలు దిగి కూడా ఆ అధికారులు సోషల్ మీడియా ద్వారా పంచుకోకూడదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. -
ఎయిర్ఫోర్సును ట్రిబ్యునల్‌కు లాగిన పూజా ఠాకూర్
గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశం వచ్చినప్పుడు ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించే కార్యక్రమానికి ఓ మహిళా వింగ్ కమాండర్ నేతృత్వం వహించారు. ఆమె ఎవరా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఆమే వింగ్ కమాండర్ పూజా ఠాకూర్. అలాంటి పూజ.. ఇప్పుడు తనకు భారత వైమానిక దళం శాశ్వత కమిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సైనిక దళాల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. తనకు శాశ్వత కమిషన్ ఇవ్వకపోవడం వివక్షాపూరితమని ఆమె మండిపడింది. ట్రిబ్యునల్ ఈ కేసును విచారణకు స్వీకరించిందని ఠాకూర్ తరఫు న్యాయవాది సుధాంశు పాండే చెప్పారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్ నుంచి మహిళా అధికారులకు కూడా మార్చింగ్ కంటింజెంట్లకు నేతృత్వం వహించే అవకాశం ఇచ్చారు. 2000 సంవత్సరంలో భారత వైమానిక దళంలో చేరిన పూజా ఠాకూర్.. అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచికి చెందిన అధికారిణి. ఆమె ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో ప్రచార విభాగం ‘దిశ’లో పనిచేస్తున్నారు. -
చండీగఢ్‌లో విశాఖ జిల్లా వాసి మృతి
చోడవరం : విశాఖ జిల్లా చోడవరం మండలం పీఎస్ పేట గ్రామానికి చెందిన యువకుడు చండీగఢ్ రాష్ట్రంలోని ఓ జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. పీఎస్ పేట గ్రామానికి చెందిన కూనిశెట్టి కుమార్(21) చండీగఢ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఓ జలపాతం చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని వాయుసేన విభాగం అధికారులు ఆదివారం రాత్రి కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించనున్నట్టు సమాచారం. -
నేపాల్‌కు భారత్ ఆపన్న హస్తం
భూకంపంతో విలవిల్లాడిన నేపాల్‌ను ఆదుకోడానికి భారత్ పెద్దమనసుతో ముందుకొచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన సి-130 జె సూపర్ హెర్క్యులెస్ విమానం హిండ్సన్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరి వెళ్లింది. అందులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సహాయ సామగ్రి ఉన్నాయి. మరో సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానాన్ని కూడా సిద్ధం చేస్తున్నామని, ఇందులో 40 మంది సభ్యులు గల ర్యాపిడ్ రియాక్షన్ ఏరో మెడికల్ టీమ్, వైద్యులు, సహాయ సామగ్రి ఉంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. మరింతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఇంకో రవాణా విమానం కూడా వెళ్లనుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని దించిన తర్వాత సి-130జె విమానం ఏరియల్ రెక్కీ నిర్వహించి పొఖారా నుంచి రోడ్డు మార్గం ఎలా ఉందో పరిశీలిస్తుంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, సరిహద్దు రోడ్ల సంస్థ, వైమానిక దళాలకు చెందిన సిబ్బందిని రక్షణ మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉంచింది. -
విమానం ఆచూకీ కోసం రంగంలోకి దిగిన భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్
న్యూఢిల్లీ: ఈ నెల 8వ తేదీ శనివారం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఆచూకీ కోసం ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. ఈ విమానం కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 12 దేశాలు ఈ గాలింపు చర్యల్లో ఉన్నాయి. 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో కౌలాలంపూర్ నుంచి శుక్రవారం అర్థరాత్రి ఈ విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. మార్గ మధ్యంలో శనివారం ఈ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆ రోజు నుంచి చైనా, మలేషియాతోపాటు పలు దేశాల విమానాలు, ఓడలు రంగంలోకి దిగి ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా ఆ విమానానికి సంబంధించిన కనీస సమాచారం లభ్యం కాలేదు. కాలాలంపూర్, బీజింగ్ మార్గంలో శాటిలైట్ ద్వారా చిత్రాలను తీయాలని ఆయా దేశాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ శాటిలైట్ చిత్రాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెడతున్నారు. సముద్రంలో ఎక్కడైనా విమానశకలాలు, ప్రయాణికుల వస్తువులు, సముద్రంపై నూనె తెట్టు లాంటి పదార్థాలు గుర్తించాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తు ఆ చిత్రాలను http://www.tomnod.com వెబ్సైట్లో ఉంచారు. ఈ శాటిలైన్ చిత్రాలను నిన్న ఒక్క రోజునే దాదాపు 6 లక్షల మంది స్కాన్ చేసినట్లు కోలరాడో చెందిన డిజిటల్గ్లోబల్ కంపెనీ సీనియర్ డైరక్టర్ షెహర్ నాయ్ తెలిపారు. అయినా ఏమాత్రం ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితులలో విమానం ఆచూకీ తెలుసుకునేందుకు మలేషియా ప్రభుత్వం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది. వారికి సహాయపడేందుకు భారత ప్రభుత్వం కొంతమందిని నియమించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ విమానం ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయిదు రోజులుగా విమానం జాడ తెలియకపోవడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత్ నేవీ అండమాన్ సముద్రంలో గాలింపు చర్యలు ప్రారంభించింది.