భూకంపంతో విలవిల్లాడిన నేపాల్ను ఆదుకోడానికి భారత్ పెద్దమనసుతో ముందుకొచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన సి-130 జె సూపర్ హెర్క్యులెస్ విమానం హిండ్సన్ ఎయిర్బేస్ నుంచి బయల్దేరి వెళ్లింది. అందులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సహాయ సామగ్రి ఉన్నాయి. మరో సి-17 గ్లోబ్మాస్టర్ విమానాన్ని కూడా సిద్ధం చేస్తున్నామని, ఇందులో 40 మంది సభ్యులు గల ర్యాపిడ్ రియాక్షన్ ఏరో మెడికల్ టీమ్, వైద్యులు, సహాయ సామగ్రి ఉంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి.
మరింతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఇంకో రవాణా విమానం కూడా వెళ్లనుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని దించిన తర్వాత సి-130జె విమానం ఏరియల్ రెక్కీ నిర్వహించి పొఖారా నుంచి రోడ్డు మార్గం ఎలా ఉందో పరిశీలిస్తుంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, సరిహద్దు రోడ్ల సంస్థ, వైమానిక దళాలకు చెందిన సిబ్బందిని రక్షణ మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉంచింది.
నేపాల్కు భారత్ ఆపన్న హస్తం
Published Sat, Apr 25 2015 4:59 PM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM
Advertisement