relief material
-
బాహుబలిలా మూటలు మోసిన మంత్రి
తిరువనంతపురం: ప్రకృతి సృష్టించిన విలయం నుంచి కేరళ ప్రజలను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి కేంద్రబలగాలతో పాటు, ఉన్నతాధికారులు కూడా శ్రమించారు. మత్య్సకారులైతే స్వచ్ఛందగా తమ సేవలందించారు. ఇలా ప్రతి ఒక్కరు ఏదోరకంగా తమకు తోచిన సహాయం చేశారు. కేరళ వరద బాధితులకు సహాయక సామాగ్రిని అందజేయడానికి ఐఏఎస్ అధికారులు సైతం మూటలు మోసిన సంగతి విదితమే. సహాయక చర్యల్లో కేరళ మంత్రి రవీంద్రనాథ్ వ్యవహరించిన తీరు పలువురికి ఆదర్శంగా నిలిచింది. కేవలం సహాయక చర్యలను పర్యవేక్షించడమే కాకుండా.. బాధితులకు కావాల్సిన సామాగ్రిని ఆయన తన భుజంపై మోసారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే.. ఆయన బాహుబలిలా కష్టపడ్డారని అభినందిస్తున్నారు. కాగా కేరళలో సంభవించిన వరదల్లో చిక్కుకుని 400 మందికి పైగా మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి. ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని అంచనా వేస్తున్నారు. -
కేరళ వరదలు: మూటలు మోసిన మంత్రి
-
రిలీఫ్ మెటీరియల్‌కి స్థలం లేదు: డబ్బులు ప్లీజ్
సాక్షి, బెంగళూరు: భారీ వర్షాలతో భీతిల్లిన కర్నాటక వాసులను ఆదుకునేందుకు భారీ స్పందన లభిస్తోంది. కర్నాటక ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో కొడగు జిల్లాకు నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థలు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తమ వద్ద ఉన్న ఆహార పదార్థాల నిల్వలు చాలని, ఇక పంపవద్దని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే తగినంత ఆహార, వస్తు సామగ్రి ఉన్నందువల్ల రిలీఫ్ ఫుడ్ మెటీరియల్ పంపించడాన్ని నిలిపివేయాలని కొడగు జిల్లా ఇన్ చార్జి మంత్రి ఎస్ఆర్ మహేష్ ప్రజలకు, దాతలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకుమించి సేకరించినా నిల్వ చేయడానికి స్థలం లేదని ఆయన చెప్పారు. దీనికి బదులుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బును బదిలీ చేయాలని కోరారు. కాగా ఒకపక్క భారీ వర్షాలు, వరదలు కేరళను వణికించగా, మరోవైపు పొరుగు రాష్ట్రం కర్నాటకను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కొడగు జిల్లా భారీగా ప్రభావితమైంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 8మంది మరణించగా, 4వేలమందికి పైగా నిర్వాసితులయ్యారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ ప్రాంతాల్లో వందలాదిమంది చిక్కుండిపోయారు. వర్షాల కారణంగా 123 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 800కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి బాధిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయ పునరావాస శిబిరాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించి సంగతి తెలిసిందే. -
నేపాల్‌కు భారత్ ఆపన్న హస్తం
భూకంపంతో విలవిల్లాడిన నేపాల్‌ను ఆదుకోడానికి భారత్ పెద్దమనసుతో ముందుకొచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన సి-130 జె సూపర్ హెర్క్యులెస్ విమానం హిండ్సన్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరి వెళ్లింది. అందులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సహాయ సామగ్రి ఉన్నాయి. మరో సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానాన్ని కూడా సిద్ధం చేస్తున్నామని, ఇందులో 40 మంది సభ్యులు గల ర్యాపిడ్ రియాక్షన్ ఏరో మెడికల్ టీమ్, వైద్యులు, సహాయ సామగ్రి ఉంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. మరింతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఇంకో రవాణా విమానం కూడా వెళ్లనుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని దించిన తర్వాత సి-130జె విమానం ఏరియల్ రెక్కీ నిర్వహించి పొఖారా నుంచి రోడ్డు మార్గం ఎలా ఉందో పరిశీలిస్తుంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, సరిహద్దు రోడ్ల సంస్థ, వైమానిక దళాలకు చెందిన సిబ్బందిని రక్షణ మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉంచింది. -
వరద బాధితులకు వైఎస్ జగన్ సాయం పంపిణీ
-
వరద బాధితులకు వైఎస్ జగన్ సాయం పంపిణీ
హుదూద్ తుఫానుకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలోని ధర్మానగర్ ప్రాంతంలో తుఫాను బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సహాయ సామగ్రి విశాఖపట్నానికి చేరుకుంది. ఆ సామగ్రిని బాధితులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గత రెండు రోజులుగా విశాఖలోనే ఉండి, తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న వైఎస్ జగన్, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏవేం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ మేరకు వారందరికీ సహాయం అందేలా ఇటు పార్టీ వర్గాలతోను, అటు స్వచ్ఛంద సంస్థలతోను సమన్వయం చేస్తున్నారు. -
తుఫాను సాయాన్ని నిరాకరించిన ఎయిర్‌పోర్టు
హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోడానికి దాతలు చేసిన సహాయాన్ని గన్నవరం విమానాశ్రయం అధికారులు తిరస్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతానికి చెందినవాళ్లు దాదాపు 25 వేల పులిహోర ప్యాకెట్లు, 25 వేల వాటర్ ప్యాకెట్లు, 2వేల దుప్పట్లు, 2వేల టవల్స్ మొత్తం సిద్ధం చేసి, వాటిని విశాఖపట్నం తరలించేందుకు గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అయితే, వాటిని విశాఖపట్న పంపడానికి కుదరదంటూ అధికారులు ఆ సరుకులను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దాంతో అధికారుల తీరును నిరసిస్తూ విమానాశ్రయం వద్ద తాడేపల్లి వాసులు ఆందోళన చేశారు.