చోడవరం : విశాఖ జిల్లా చోడవరం మండలం పీఎస్ పేట గ్రామానికి చెందిన యువకుడు చండీగఢ్ రాష్ట్రంలోని ఓ జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. పీఎస్ పేట గ్రామానికి చెందిన కూనిశెట్టి కుమార్(21) చండీగఢ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు.
కాగా ఆదివారం ఓ జలపాతం చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని వాయుసేన విభాగం అధికారులు ఆదివారం రాత్రి కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించనున్నట్టు సమాచారం.
చండీగఢ్‌లో విశాఖ జిల్లా వాసి మృతి
Published Mon, Jul 20 2015 3:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM
Advertisement
Advertisement