CDs
-
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారత ఆర్మీకి కొత్త చీఫ్ ఖరారు
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ఎంఎం నవరణె స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టన్నన్నారు. బిపిన్ రావత్ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నవరణె ఏప్రిల్ చివరినాటికి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్ పాండే నియామకం ఖరారు అయ్యింది. విశేషం ఏంటంటే.. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్ మనోజ్ పాండేనే కావడం. అంతకు ముందు మనోజ్ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్ సెక్షన్లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్ పాండే.. ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. -
రైతు విజయం.. కరోనా కల్లోలం!
కాల గతిలో మరో ఏడాది గడిచిపోతోంది. మరో రెండ్రోజుల్లో నూతన సంవత్సరం కాలుమోపుతోంది. గతేడాది ఆరంభమైన కరోనా సంక్షోభం ఇంకా మానవాళిని వీడలేదు. ఈ ఏడాది చివరకు కొత్త వేరియంట్ కలకలం ఆరంభమైంది. 2021లో దేశీయ యవనికపై పలు ఘటనలు జరిగాయి. స్థూలంగా చెప్పుకుంటే 2021 రైతు ఆందోళనతో మొదలై సాగు చట్టాల ఉపసంహరణతో ముగిసిందనుకోవచ్చు. కరోనా, రైతు సంఘటనలతో పాటు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు, పెగసస్ కలవరం, డ్రగ్స్ కేసు, సరిహద్దుల్లో కదలికలు, సీడీఎస్ మృతి వంటి పలు ఇతర ఘటనలు దేశంలో సంచలనానికి కారణమయ్యాయి. కోవిడ్ విధ్వంసం జనవరిలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి భారత్ అనుమతించింది. అదేనెల దేశీయంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చిలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఆరంభమైంది. ఏప్రిల్‌లో దేశీయంగా కరోనా మరణాలు 2లక్షలు దాటాయి. దేశంలో ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత ఆందోళనకరస్థాయికి చేరాయి. ఈనెల్లో సుమారు 69 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మేలో సెకండ్ వేవ్ తారస్థాయికి చేరింది. కొత్త కేసులు 90 లక్షలు దాటగా, 1.2 లక్షల మరణాలు నమోదయ్యాయి. కోర్టులు కల్పించుకొనే స్థాయికి ఆక్సిజన్ కొరత చేరింది. అక్టోబర్‌లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల రికార్డును భారత్ సాధించింది. డిసెంబర్ 29నాటికి దేశీయంగా 143.75 కోట్ల టీకా డోసులు ప్రజలకు అందించారు. డిసెంబర్లో భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆరంభమైంది. మమత హ్యాట్రిక్ మే నెల్లో దేశంలో ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంచలన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఎంసీకి 213 సీట్లు, బీజేపీకి 77 సీట్లు దక్కగా వామపక్షాలు, కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా రాలేదు. టీఎంసీ అధినేత మమత నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోవడం సంచలనం సృష్టించింది. అనంతరం ఆమె భవానీ పూర్ నుంచి పోటీ చేసి ఎంఎల్ఏగా గెలుపొందారు. అస్సాంలో రెండోమారు ఎన్డీఏ కూటమి 75 సీట్లతో అధికారంలోకి రాగా, బీజేపీకి చెందిన హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. కేరళలో పాలకపక్షం వరుసగా రెండోమారు విజయం సాధించదన్న ఆనవాయితీని లెఫ్ట్ కూటమి తిరగరాసింది. 99 సీట్లతో లెఫ్ట్ కూటమి వరుసగా రెండోమారు విజయం సాధించగా, సీపీఎంకు చెందిన పినరయ్ విజయన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. తమిళనాడులో డీఎంకేను 159 సీట్లతో విజయం వైపు నడిపిన సారధి స్టాలిన్, 68 సంవత్సరాల వయసులో తొలిసారి సీఎంగా పదవీ స్వీకారం చేశారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 19 సీట్లను గెలిచి రంగస్వామి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రుల మార్పులు జూలైలో ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు. కర్ణాటకలో బీజేపీ యడియూరప్పను మార్చి బసవరాజ బొమ్మైని సీఎం చేసింది. సెప్టెంబర్‌లో గుజరాత్ సీఎం పదవి నుంచి విజయ్ రూపానీ, పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్‌సింగ్ వైదొలిగారు. పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు. మిస్ యూనివర్స్ డిసెంబర్లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్‌గా ఎన్నికైంది. 1994(సుస్మితా సేన్), 2000(లారా దత్తా) తర్వాత విశ్వ సుందరిగా ఎంపికైన మూడో భారతీయ యువతి సంధు. వ్యవసాయదారుల విజయం గతేడాది ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ దినోత్సవాన రైతుల సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ ముట్టడించారు. జనవరి 12న రైతు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీటిపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. నవంబర్ 19న రైతు చట్టాలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించారు. అదే నెల 29న సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ఉపసంహరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. దీంతో ఏడాదికి పైగా సాగిన ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేసి స్వస్థలాలకు వెళ్తున్నామని రైతులు ప్రకటించారు. లఖింపూర్ ఖేరీ ప్రకంపనలు అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతుల ర్యాలీపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనం నడపడంతో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన దేశంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆర్యన్ అరెస్టు అక్టోబర్‌లో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ సహా 8 మందిని నార్కొటిక్స్ బ్యూరో డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. 22 రోజుల కస్టడీ అనంతరం ఆర్యన్‌కు బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. బిపిన్ మృతి డిసెంబర్లో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్‌రావత్, ఆయన భార్య మధులిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రమాదంలో బతికి బయటపడ్డ వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. -
కొత్త సీడీఎస్ ‘ఎంపిక’ షురూ
న్యూఢిల్లీ: దివంగత జనరల్ బిపిన్ రావత్ స్థానంలో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) నియామక ప్రక్రియ మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన జనరల్ బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సీనియర్ కమాండర్లతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్యానెల్ ప్రతిపాదించిన పేర్లతో కూడిన జాబితా త్వరలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తదుపరి ఈ జాబితా కేబినెట్ నియామకాల కమిటీకి పరిశీలనకు అందుతుంది. ఆ కమిటీ అంతిమంగా సీడీఎస్ పేరును ఖరారు చేస్తుంది. అత్యున్నత స్థాయి ఈ పోస్టుకు అత్యంత సీనియర్ అయిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జనరల్ నరవణె వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇద్దరూ కూడా ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఒక వేళ సీడీఎస్‌గా జనరల్ నరవణెను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే, తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాల్సింది కూడా ఇప్పుడే నిర్ణయించాల్సి ఉంటుంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతి, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన సీనియర్ మోస్ట్ కమాండర్లు. ఇద్దరూ కూడా జనవరి 31వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది. దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా గత ఏడాది జనవరి ఒకటో తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!
న్యూఢిల్లీ: త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’ను ఏర్పాటు చేయడం సైనిక సంస్కరణల్లో తదుపరి కీలక నిర్ణయం అవుతుందని బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వెల్లడించారు. సైనిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. థియేటర్ కమాండ్స్ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఐక్యంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని ‘కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్’లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో సాయుధ దళాల విలీనం తప్పని సరిగా చోటు చేసుకునే విషయమని, త్రివిధ దళాల మధ్య సమన్వయానికి, వనరుల అత్యుత్తమ వినియోగానికి అది తప్పదని జనరల్ నరవణె వ్యాఖ్యానించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఒక కమాండర్ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా, ఐకమత్యంగా ఉమ్మడి మిలటరీ లక్ష్యం కోసం సమర్ధవంతంగా, సమన్వయంతో పనిచేసేందుకు ఏర్పాటు చేసేవే ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’. -
పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం
న్యూఢిల్లీ: ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మొత్తం భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఎప్పుడో తీర్మానం చేసింది. ఒకవేళ ఆ భూభాగం మళ్లీ మన స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తే కచ్చితంగా ఆ విషయంపై చర్యలు చేపడతాం’ అని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే స్పష్టం చేశారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 13 లక్షల మంది ఉన్న ఆర్మీ.. రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. పీఠికలోని విషయాలకు లోబడి ఉంటుందన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గ్రేట్.. త్రివిధ దళాలన్నింటినీ సమన్వయ పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నరవాణే చెప్పారు. ఇది విజయవంతం అయ్యేందుకు ఆర్మీ తరఫున సహాయసహకారాలు అందిస్తామన్నారు. భారత సైన్యం పాక్‌లా దొంగ దెబ్బ తీయదని, నైపుణ్యంతోనే పని చేస్తుందని చెప్పారు. నైతిక విలువలకు సైన్యం కట్టుబడి ఉంటుందన్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేలను మూడింటినీ సమన్వయం చేస్తూ.. మిలటరీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఏకైక సలహాదారుగా సీడీఎస్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఓ కన్నేసి ఉంచాలి.. ఆర్మీకి సైనికులే బలమని నరవాణే చెప్పారు. ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, ఎలాంటి వారు ఉన్నారన్నదే తమ మంత్రమని చెప్పారు. ఇదే సైనిక ఆయుధాలకూ వర్తిస్తుందన్నారు. భారత బలగాలు సియాచిన్ ప్రాంతంలో ఓ కన్నేసి ఉంచాలని నరవాణే వ్యాఖ్యానించారు. పాక్, చైనాల మధ్య ఈ ప్రాంతం గురించి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
సీడీఎస్‌కు ప్రధాని మోదీ అభినందనలు
-
త్రివిద దళాలు రాజకీయాలకు దూరం
-
సీడీఎస్‌గా బిపిన్ రావత్
న్యూఢిల్లీ: దేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ఈ నియామకం డిసెంబర్ 31(నేటి)నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ సీడీఎస్‌గా రావత్ నియామకానికి సోమవారం ఆమోదం తెలిపిందని ఓ అధికారి చెప్పారు. కార్గిల్ యుద్ధం సమయంలో త్రివిధ దళాల్లో కనిపించిన సమన్వయలోపం నేపథ్యంలో సీడీఎస్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పటినుంచి దాదాపు 20 ఏళ్లుగా ఫైళ్లలోనే మగ్గుతున్న సీడీఎస్‌ను ఇటీవల కేంద్రం కార్యరూపంలోకి తెచ్చింది. సైన్యం, నావికా, వైమానిక దళాలను సమన్వయపరుస్తూ సైనిక సంబంధిత విషయాల్లో రక్షణమంత్రికి సలహాదారుగా వ్యవహరించడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. దళాధిపతితో సమాన హోదా, వేతనం, ఇతర సౌకర్యాలు సీడీఎస్‌కు ఉంటాయి. రక్షణ శాఖలో కొత్తగా ఏర్పాటయ్యే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్(డీఎంఏ) కార్యదర్శిగా సీడీఎస్ వ్యవహరిస్తారు. ఆర్మీ, నేవల్, ఎయిర్, డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయాలు డీఎంఏలోనే ఉంటాయి. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి సీడీఎస్ శాశ్వత చైర్మన్‌గా ఉంటారు. త్రివిధ దళాలకు చెందిన వివిధ విభాగాల పరిపాలన బాధ్యతలు చూస్తుంటారు. రక్షణ మంత్రి నేతృత్వంలోని రక్షణ శాఖ కొనుగోళ్ల మండలిలో, ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో నడిచే డిఫెన్స్ ప్లానింగ్ కమిటీలో సీడీఎస్ సభ్యునిగా ఉంటారు. అణు కమాండింగ్ అథారిటీకి మిలటరీ అడ్వైజర్‌గా ఉంటారు. అయితే, బలగాలకు ఆదేశాలిచ్చే అధికారం సీడీఎస్‌కు ఉండదు. 1978లో గూర్ఖా రైఫిల్స్‌లో చేరిన రావత్ 2016 డిసెంబర్ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి, మూడేళ్ల పూర్తి కాలం కొనసాగారు. జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్‌గా మంగళవారం రిటైర్ కావాల్సి ఉంది. ఆర్మీ చీఫ్ కాకమునుపు జనరల్ రావత్ ఈశాన్య రాష్ట్రాలతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. -
సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్‌గా చేపట్టే వ్యక్తే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్ పర్సన్‌గానూ కొనసాగుతారు. -
‘పరిమితం’.. దేశహితం
ఎర్రకోటలో ఆరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం జనాభా పెరిగితే రాబోయే తరాలకు లెక్కలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలూ చర్యలు చేపట్టాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. ఇప్పటికే దేశంలో కొంత భాగం ప్రజలు చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. దీన్ని అనేక మంది వ్యతిరేకించినా.. దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు. కశ్మీరీల కలలకు రెక్కలు జమ్మూకశ్మీర్ అంశంలో కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయించదు. ‘సీడీఎస్’ రూపకల్పన.. త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి సైనిక, వాయుసేన, నౌకాదళానికి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది. దేశంలోనే విహారం ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవం వచ్చే నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీంతో దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం అభివృద్ధి చెందుతుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ఒక దేశం, ఒక ఎన్నిక అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి. న్యూఢిల్లీ దేశం ఎదుర్కొంటున్న వేలాది సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడు భారత్‌కు ఎంతో బలమైన ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి వరుసగా ఆరోసారి, 73వ స్వాతంత్య్ర దినోత్సవాన ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. రంగురంగుల తలపాగాతో గురువారం వేదిక మీదకు వచ్చిన మోదీ.. త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఆ మూడింటికీ కలిపి కొత్తగా ఒక అధిపతిని (చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్ – సీడీఎస్) నియమించడం, దేశంలో జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడం, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం తదితర అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం రాబోయే కొన్నేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లను ఖర్చు చేయనుందని మోదీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న నేపథ్యంలో, రాబోయే ఐదేళ్లలో ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల రంగంలో పెట్టి, ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ వెల్లడించారు. ఒక దేశం, ఒకే కార్డు వ్యవస్థతో ఒకే కార్డుతో దేశంలో ఎక్కడైనా ప్రయాణాలకు చెల్లింపులు చేసే వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దాదాపు 95 నిమిషాల పాటు, సుదీర్ఘంగా సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... జనాభాను నియంత్రించాల్సిందే.. ‘జనాభా పెరిగితే రాబోయే తరాల వారికి లెక్కపెట్టలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశం నేరుగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటైన జనాభా విస్ఫోటన సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన సమయం వచ్చింది. కుటుంబాలు చిన్నగా ఉండాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. వారి ఇళ్లతోపాటు మొత్తంగా దేశం కూడా సంతోషంగా ఉండదు. ఇప్పటికే దేశంలో కొంత భాగం మంది ప్రజలు జనాభాను తగ్గించుకుని, చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. ఈ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించినా సరే, దేశ, ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు’. ‘సీడీఎస్’విధివిధానాలను రూపొందిస్తున్నాం ‘త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి ఆర్మీ, వాయుసేన, నౌకాదళం.. మూడింటికి కలిపి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది’అని మోదీ చెప్పారు. ప్రస్తుత విధానంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం మూడు సేనల చీఫ్‌ల కమిటీ (చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ–సీవోఎస్సీ) ఉంది. ఆ ముగ్గురు అధిపతుల్లో ఎవరు అత్యంత సీనియర్ అయితే వారు సీవోఎస్సీ చైర్మన్‌గా ఉంటారు. కొత్తగా నియమితులయ్యే సీడీఎస్ త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం కృషి చేయడంతోపాటు ప్రధాని, రక్షణ మంత్రులకు సైనిక సలహాదారుగానూ ఉంటారు. కశ్మీరీల కలలకు కొత్త రెక్కలు ఇవ్వాలి ‘జమ్మూ కశ్మీర్ అంశంలో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం, భావం లేదు. కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయిం చదు. ఆర్టికల్ 370పై గత 70 ఏళ్లలో చేయలేని దానిని మేము ఇప్పుడు చేసి చూపించాం’ దేశంలోనే విహారయాత్రలకు వెళ్లండి.. ‘ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 2022 నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీనివల్ల దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం విదేశాల్లో మాదిరిగా దేశంలోని పర్యాటక కేంద్రాల్లో చాలా మంచి హోటళ్లు ఉండకపోవచ్చు. కానీ, ప్రజలు వెళ్లడం మొదలుపెడితే వాటంతట అవే వస్తాయి. దేశం గొప్పగా మారాలంటే తప్పదు.. ‘దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి’అని మోదీ అన్నారు. అయితే రాజ్యాంగం మార్చకుండానే జమిలి ఎన్నికలు అసాధ్యమని న్యాయ కమిషన్ గతేడాది ఆగస్టులోనే తేల్చి చెప్పడం తెలిసిందే. ఆరేళ్లు.. ఆరు తలపాగాలు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలప్పుడు ప్రసంగం చేసే సమయంలో వైవిధ్యమైన తలపాగాలు ధరించడం మోదీ ప్రత్యేకత. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రసంగం చేసే సమయంలోనూ మోదీ ఆ ప్రత్యేకతను చాటుకున్నారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, సగం వరకే చేతులున్న తెల్ల కుర్తా, పైజామా, కాషాయ రంగు అంచులున్న కండువాను ధరించి మోదీ వేదికపైకి వచ్చారు. 2014లో తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రసంగించినప్పుడు మోదీ తల భాగం ఎర్రగా, తోక భాగం ఆకుపచ్చ జోధ్‌పురీ తలపాగా పెట్టుకున్నారు. 2015లో పసుపు రంగు వస్త్రంపై ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగు గీతలున్న తలపాగాను, 2016లో పసుపు, గులాబీ రంగు తలపాగాను మోదీ ధరించారు. 2017లో దట్టమైన ఎరుపు, పసుపు రంగులపై బంగారు వర్ణం గీతలున్న తలపాగాను, 2018లో కాషాయ తలపాగాతో మోదీ ఎర్రకోటపైకి వచ్చారు. ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ఎర్రకోటలో ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. మోదీ ఎర్రకోటకు చేరుకుని తిరిగి వెళ్లే వరకూ కార్యక్రమం జరిగిన తీరు ఇలా... ► చారిత్రక కోట వద్దకు ప్రధాని చేరుకోగానే సందర్శకులంతా లేచి నిలబడ్డారు. ► కార్యక్రమానికి నరేంద్ర మోదీ తెల్లని పైజామా–కుర్తా, రాజస్తానీ తరహా రంగురంగుల తలపాగా ధరించి వచ్చారు. ► రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మోదీకి స్వాగతం పలికారు. ► తర్వాత మోదీ ఇంటర్ సర్వీసెస్, పోలీస్గార్డ్ల వందనం స్వీకరించారు ► అనంతరం ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ► తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి 95 నిమిషాల పాటు ప్రసంగించారు. వరుసగా ఆరోసారి బుల్లెట్ ప్రూఫ్ పోడియం రక్షణ లేకుండా ప్రసంగించారు. ► ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, రమేశ్ పోఖ్రియాల్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, బి.ఎస్. ధనోవా, కర్మబీర్ సింగ్ హాజరయ్యారు. ► ఎర్రకోట ముందు వేలాది మంది పాఠశాల పిల్లలు ’నయా భారత్’ అనే హిందీ అక్షరాల ఆకారంలో నిలబడ్డారు. ► తెల్లవారుజామున కురిసిన వర్షం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. అమరవీరులకు సలాం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమర్‌జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్ వందనం ఆసేతు హిమాచలం జమ్మూలో జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అలరించిన పాఠశాల విద్యార్థుల ప్రదర్శన భారీ త్రివర్ణం ముంబైలోని హిరానందాని గార్డెన్స్‌లో భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న ప్రజలు తల్లీ భారతి వందనం మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జెండా వందనం చేస్తున్న నటి ఊర్మిళ మతోండ్కర్ -
సీడీలకు బడ్జెట్ లేదట!
సాక్షి,సిటీబ్యూరో : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో కొత్త సంస్కరణలు ఆచరణలో కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏటా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంటున్నా వినియోగదారులకు మాత్రం మెరుగైన సేవలు అందించడంలో కక్కుర్తిగా వ్యవహరిస్తోంది. అక్రమ దస్తావేజుల నమోదు, అడ్డదారులు, అక్రమ వసూళ్లు, రికార్డుల ట్యాంపరింగ్, తప్పుడు దస్తావేజులు నమోదు వంటి అభియోగాలను మూట కట్టుకున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పుడు సరికొత్త విధానాలకు తూట్లు పొడుస్తోంది. తాజాగా స్థిరాస్తి లావాదేవిల్లో పారదర్శకత కోసం అమల్లోకి తెచ్చిన ‘రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్‘కు సీడీల కొరత ఏర్పడింది. సీడీల కోసం ప్రత్యేక బడ్జెట్ లేదంటూ సీసీ కెమెరాల ద్వారా స్థిరాస్తి నమోదు ప్రక్రియను రికార్డు చేసి చేతులు దులుపుకుంటోంది. ఏడాది కాలంగా చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘వీడియో రికార్డింగ్’ విధానం విజయవంతం కావడంతో ఇటీవల అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు విస్తరించారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డింగ్.. పకడ్డందీగా చేయాల్సిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సీసీ కెమెరా ద్వారా రికార్డింగ్ చేస్తున్నారు. కానీ రికార్డింగ్‌ను సీడీలకు మాత్రం క్యాప్చర్ చేయడం లేదు. ప్రతి సబ్ రిజిస్టార్ ఆఫీస్‌కు రెండేసి చొప్పున సీసీ కెమెరాలు సరఫరా జరిగాయి. అందులో ఒకటి కార్యాలయంలోను, మరొకటి స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వినియోగించాలి. చిక్కడపల్లి ఎస్ఆర్వోలో విజయవంతంగా అమలవుతున్న మాదిరిగా సీసీ కెమెరాల ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రికార్డింగ్ చేసి, కొనుగోలుదారుడికి రికార్డింగ్ సీసీ కాపీని అందజేయాలని ఇటీవల సాక్షాత్తు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఐజీ, కమిషనర్ వాకటి కరుణ ఆజ్ఞలు జారీ చేశారు. సీసీ రికార్డింగ్ అమలుపై నివేదిక సమర్పించాలని జిల్లా రిజిస్ట్రార్లకు సూచించారు. కానీ సీడీ జారీ మాత్రం అమలు కావడం లేదు. ప్రతి రిజిస్ట్రేషన్ రికార్డింగ్ ఇలా రికార్డింగ్ విధానంలో ‘అమ్మకం దారులు ఫలానా భూమిని ఇష్టపూర్వకంగా అమ్ముతున్నానని, నగదు కూడా తీసుకున్నట్లు’ చెప్పాలి. ఈ విషయాన్ని సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. కొనుగోలు దారులు, సాక్షులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయినా తర్వాత రికార్డింగ్‌ను సీడీలోకి మార్చి కొనుగోలుదారుడికి అందజేయాలి. అమ్మకందారుడు కూడా సీడీని తీసుకోవచ్చు. కానీ సీడీలకు బడ్జెట్ లేదంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా సీడీల జారీకి కక్కుర్తిగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. -
అమ్మ ప్రసంగంతో చెక్
♦ శశికళ కుటుంబీకులపై జయలలిత చేసిన విమర్శల సీడీలు విడుదల ♦ దినకరన్ ఆగడాలకు మంత్రి ఉదయకుమార్ అడ్డుకట్ట ♦ పుదుచ్చేరి క్యాంపు నుంచి జారుకున్న ఎమ్మెల్యేలు ♦ ఆరు జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం ఎడపాడి మంతనాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలోకి పార్టీ అధినేత్రి దివంగత జయలలితను కూడా దించారు. శశికళ కుటుంబం గురించి జయలలిత చేసిన విమర్శల సీడీలను మంత్రి ఉదయకుమార్ గురువారం విడుదల చేశారు. శశికళ, దినకరన్ జయలలిత చేత తిరస్కరింపబడిన వ్యక్తులుగా ప్రజల్లో ప్రచారం చేసేందుకు జయ మాట్లాడిన సీడీలను ప్రయోగించారు. జయ మరణంతో ప్రత్యక్షంగా పార్టీ, పరోక్షంగా ప్రభుత్వం చిన్నమ్మ చేతుల్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే అనతికాలంలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు శశికళ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేశాయి. తద్వారా పార్టీ బహిష్కరణకు దారితీశాయి. అయితే తమ చేతుల్లోని అన్నాడీఎంకేను సీఎం ఎడపాడి హైజాక్ చేశారని ఆగ్రహంతో ఉన్న దినకరన్ ప్రభుత్వాన్ని కూల్చేపనిలో నిమగ్నమయ్యారు. తమకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదన్న భావనతో ప్రతిపక్షాలతో టీటీవీ తెరవెనుక సంబం ధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో శశికళ కుటుంబాన్ని తామే కాదు, గతంలో జయలలిత కూడా దూరం పెట్టారనే విషయాలను ప్రజలకు గుర్తు చేయాలని ఎడపాడి తలంచారు. ఈ మాటలను జయ నోటి వెంట వస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందనే నిర్ణయంతో శశికళ కుటుంబం గురించి జయలలిత చేసిన విమర్శలతో కూడిన రెండు సీడీలను మంత్రి ఉదయకుమార్ గురువారం విడుదల చేశారు. 2011 డిసెంబర్ 30వ తేదీన పార్టీ సమావేశంలో జయలలిత చేసిన వ్యాఖ్యలు ఈ సీడీల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. 2013 నవంబర్ 10 వ తేదీన ఎడపాడి పళనిస్వామి ఇంటి వివాహ వేడుకల్లో జయ చేసిన ప్రసంగం ఉన్నట్లు చెప్పారు. జయలలిత హయాంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారంతా నేడు పార్టీలోకి ప్రవేశించి తగవులకు పాల్పడుతూ, పదవుల కోసం పాకులాడుతున్నారని ఈ సందర్భంగా మంత్రి ఉదయకుమార్ విమర్శించారు. ఎమ్మెల్యేలతో సీఎం మంతనాలు: ఇదిలా ఉండగా, మైనార్టీ సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు సీఎం ఎడపాడి నేరుగా రంగంలోకి దిగారు. తనకు మద్దతుగా నిలిచి ఉన్న ఆరు జిల్లాల ఎమ్మెల్యేలను గురువారం అత్యవసరంగా చెన్నైకి పిలిపించుకుని వేర్వేరుగా చర్చలు జరిపారు. ఎమ్మెల్యేలను సచివాలయంలో కలుసుకోవాలని సీఎం తొలుత భావించారు. అయితే ఆ తరువాత చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని తన ఇంట్లో కలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి విడతల వారీగా చర్చలు జరిపారు. విల్లుపురం జిల్లా ఎమ్మెల్యేలతో చర్చలు ప్రారంభించి వరుసగా కృష్ణగిరి, మదురై, తిరునెల్వేలి, తిరుచ్చిరాపల్లి, తిరువణ్ణామలై జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గురువారం ఎమ్మెల్యేలతో శుక్రవారం మాట్లాడనున్నారు. సీఎం ఎడపాడితో జరిగిన చర్చల్లో ఎమ్మెల్యేలు పలుకోర్కెలను ఆయన ముందుం చినట్లు తెలుస్తోంది. ఎడపాడి బలపరీక్షకు ముందు కూవత్తూరు రిసార్టులో ఉన్నçప్పుడు ఇచ్చిన అనేక హామీలు నేటికీ నెరవేరలేదని వారు పట్టుబట్టినట్లు సమాచారం. అలాగే జూన్‌లో ఎమ్మెల్యేలు కలుసుకున్నపుడు చేసిన వాగ్దానాలు బుట్టదాఖలు చేశారని వారు వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని ఆడించడం, కూల్చడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదని సీఎం ఎడపాడి సవాల్ విసిరారు. మమ్మల్ని నమ్మిన వారు నష్టపోరని డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు. దినకరన్‌కు షాక్ పుదుచ్చేరీ రిసార్టులో ఉన్న సుందరరాజ్, పార్థిబన్ అనే ఎమ్మెల్యేలు క్యాంపు నుంచి తప్పుకోవడం ద్వారా దినకరన్‌కు షాకిచ్చారు. ఎడపాడి ప్రభుత్వానికి 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరింపజేసిన దినకరన్ వారందరూ జారిపోకుండా జాగ్రత్తపడ్డారు. ఈ నెల 22 వ తేదీ నుంచి పుదుచ్చేరీలోని లగ్జరీ రిసార్టులో పోలీసు బందోబస్తు మధ్య బస ఏర్పాటు చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరికతో దినకరన్ బలం 21కి పెరిగింది. ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని విపక్షాల కోర్కెను గవర్నర్ తిరస్కరించడంతో దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు నిరాశకు లోనయ్యారు. రిసార్టులో ఉండి ప్రయోజనం ఏమిటనే అభిప్రాయానికి కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు. వీరిలో కొందరు ఇళ్లకు వెళ్లిపోవాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ వార్తలకు ఊతం ఇస్తూ ఎమ్మెల్యేలు సుందరరాజ్, పార్థిబన్ వేర్వేరుగా కార్లలో చెన్నైకి చేరుకున్నారు. దినకరన్, స్పీకర్లను కలుసుకునేందుకు వచ్చినట్లు సుందరాజ్ మీడియాకు తెలిపారు. రాజకీయ కల్లోలానికి రాష్ట్ర గవర్నరే కారణమని మాజీ స్పీకర్ సేడపట్టి ముత్తయ్య వ్యాఖ్యానించారు. బీజేపీ కనుసన్నుల్లో నడుచుకుంటూ వారి ఆదేశాలను పాటిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్లీపర్‌సెల్ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే సీఎం ఎడపాడి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగ తమిళ్‌సెల్వన్ వ్యాఖ్యానించారు. కొంగుమండలానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలుకుతున్నారని దివాకరన్ చెప్పారు. తూత్తుకూడి జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి మంత్రి కడంబూరు రాజాను తొలగిస్తూ టీటీవీ దినకరన్ గురువారం ఆదేశాలు చేశారు. -
భారీగా పైరసీ సీడీల పట్టివేత
గుంటూరు (పట్నంబజారు) : నిబంధనలకు విరుద్ధంగా నూతన , నీలిచిత్రాలు విక్రయిస్తున్న సీడీ షాపులపై ఏక కాలంలో దాడులు చేసి గుంటూరు అర్బన్ పోలీసులు భారీగా సీడీలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6 టీంలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి పర్యవేక్షణలో సోమవారం రాత్రి దాడులు చేశారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. వివరాలను ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి మీడియాకు వెల్లడించారు. పాతగుంటూరు, పట్టాభిపురం, అరండల్‌పేట, కొత్తపేట పోలీసుస్టేషన్ల పరిధిలో క్విక్ రియాక్షన్ టీంతో కలిసి దాడులు చేసినట్లు తెలిపారు. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలోని నెహ్రునగర్‌లో సీడీల తయారీ కేంద్రాన్ని గుర్తించటం జరిగిందన్నారు. వాటిలో 8 క్యాబినెట్లు ఒక్కొక క్యాబినెట్ 10 డీవీడీ ట్రేలను కలిగి ఉన్నాయని, 2000 సీడీ కవర్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరండల్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని డాల్ఫిన్ మ్యూజికల్ షాపులో 600 సినిమాలు కలిగి ఉన్న హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో 400 కొత్త చిత్రాల సీడీలు, 3 కంప్యూటర్లు, పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలో సీతానగర్‌లో 1వలైనులో ఉన్న బాబు వీడియో షాపు నందు ములుపూరి మోహన్‌బాబు అనే నిర్వాహకుడి నుంచి 123 అశ్లీల, 76 కొత్త చిత్రాల సీడీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని తుళ్లూరి శ్రీధర్ నుంచి 33 కొత్త సినిమాలు, 82 అశ్లీల చిత్రాల సీడీలను పట్టుకున్నారు. పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలో కూడా 76 నూతన, 123 అశ్లీల చిత్రాలను స్వాధీనం చే సుకున్నట్లు వివరించారు. వీరిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వీరికి మాస్టర్ కాపీ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు సాయం అందిస్తున్నారనే కోణాల్లో విచారిస్తున్నామన్నారు. ధృవ, మన్నెంపులితో అనేక కొత్త సినిమాల సీడీలను 524, అశ్లీల చిత్రాల సీడీలను 254 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. -
నాలెడ్జ్ సెంటర్‌గా సీడీఎస్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆ సంస్థ వ్యవస్థాపకులు మల్లేపల్లి లక్ష్మయ్య సాక్షి, హైదరాబాద్: దళిత వర్గాలకు అన్నిరకాలుగా చేదోడువాదోడుగా నిలిచి, అవసరమైన సమాచారాన్ని అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు భాగ్యరెడ్డి వర్మ స్మారక భవన్ (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్)ను నాలెడ్జ్ సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. అంబేడ్కర్ రచనలు, దళిత సాహిత్యం, సామాజికాంశాలు, ఇతరత్రా పుస్తకాలతో పూర్తిస్థాయిలో గ్రంథాలయం, ఆడిటోరి యం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా బోరబండలో సీడీఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో.. సీడీఎస్ లక్ష్యాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై లక్ష్మయ్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ముఖ్యాం శాలు ఆయన మాటల్లోనే... సమాజంలో అణగారిన వర్గాలకు వివిధ రూపాల్లో సహాయ పడేందుకు కార్యక్రమాలను చేపడతాం. ఇప్పటికే సీడీఎస్ ద్వారా వివిధ కార్యక్రమాలను పరిమితంగానే చేపడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న చేయూతతో దానిని పూర్తిస్థాయిలో విస్తరించి, అధికశాతం దళితులకు ప్రయోజనం కలిగించాలన్నదే మా లక్ష్యం. దళితులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఒక రీసెర్చ్, రిసోర్స్, ట్రైనింగ్సెంటర్గా సీడీఎస్‌ను నిలుపుతాం. ఈ కేంద్రానికి వస్తే తమ సమస్యలు, సందేహాలు తీరి, ఏదో ఒక మార్గాంతరం లభిస్తుందనే నమ్మకం కలిగేలా తీర్చిదిద్దాలనేది ధ్యేయం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా యూపీఎస్సీ ద్వారా అందుబాటులో ఉన్న ఎన్నోరకాల ఉద్యోగాలు, అవకాశాలపై అవగాహన కల్పిస్తాం. నిరుద్యోగులు, నిరక్షరాస్యులకు అవసరమైన శిక్షణ ఇస్తాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి న్యాయ, వైద్య, ఆరోగ్యపరమైన సలహాలతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తాం. యువతకు నైపుణ్యాల మెరుగుదల.. శిక్షణకు వచ్చే వారికి రెసిడెన్షియల్ పద్ధతిలో సౌకర్యాలు కల్పన.. అంబేడ్కర్ జీవి తం, సాహిత్యం పై తరగతులు, ముఖ్యమైన అం శాలపై పుస్తకాల ముద్రణ, పత్రికలు తీసుకొస్తాం. పథకాలపై అవగాహన... దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు తెలిపి, వాటి అమల్లో విధానపరమైన లోపాలు, లోటుపాట్లపై అధ్యయనం జరుపుతాం. వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతాం. దళితులకు 3ఎకరాల పంపి ణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాల వల్ల కలిగే ప్రయోజనం, వాటి అమల్లోని లోపాలపై పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం. దళితుల జీవితాల్లోని అన్ని పార్శ్వాలను తడిమి, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు మా వంతు కృషి చేస్తాం. -
‘సర్దార్ గబ్బర్ సింగ్’ లీకైంది..!
♦ పొద్దుటూరులో సీడీ షాపులపై పోలీసుల దాడులు ♦ పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు ప్రొద్దుటూరు క్రైం: విడుదల కంటే ముందే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం లీకైందంటూ పుకార్లు వినిపించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం ఉదయం నుంచి దాడులు చేశారు. పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్‌గబ్బర్‌సింగ్ ఈనెల 8న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీడీలు మార్కెట్లోకి విడుదలయ్యాయనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సీడీ షాపులు, తయారీ దారులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ చిత్రానికి పని చేసిన కొందరు టెక్నీషియన్ లు రెండు రోజుల క్రితం ల్యాబ్ నుంచి కాపీ చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి. ప్రొద్దుటూరులోని పలు సీడీ షాపులలో పోలీసులు సోదాలు చేశారు. సీడీలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న దుకాణాలపై కూడా దాడి చేసి హార్డ్ డిస్క్‌లు, సీడీ రైటర్లను పరిశీలించారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని, త్రీ టౌన్ పరిధిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు వారిని బైండోవర్ చేసి తహ సీల్దార్ వద్ద హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులను చిత్రం విడుదల అయ్యే వరకూ ప్రతి రోజూ స్టేషన్లో హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అయితే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన సీడీలు ఎవరి వద్ద దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు థియేటర్ యజమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.