boarder security forces
-
బంగ్లా పౌరులకు బీఎస్ఎఫ్ జవాన్ భావోద్వేగపు విజ్ఞప్తి!
ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రజలు భారత్‌లోకి ప్రవేశించడానికి సరిహద్దుల వద్దకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ప్రవేశించాలని ప్రయత్నించగా.. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. దయ చేసి నా మాట వినండి.. మీరు గట్టిగా అరిస్తే ఏమి రాదు’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లోని సరిహద్దు వెంబడి తమకు భారత్‌లోకి ప్రవేశం కోసం బంగ్లా పౌరులు వేడుకున్నారు. ఈ కమ్రంలో బీఎస్ఎఫ్ జవాన్ మాట్లాడుతూ.. ‘‘మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మా అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ ఈ విషయంపై చర్చ అవసరం. మేము ఇలాంటి సమస్యలను పరిష్కరించలేము. మిమ్మల్ని ఇలా సరిహద్దు దాటనివ్వలేము. ఇలాంటి సమయంలో నా మాట మీరు వినండి. అంతే కానీ మీరు గట్టిగా అరిచినా ఉపయోగం లేదు’’ అని ఒకింత భావోద్వేగంతో అన్నారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు జాతీయమీడియా పేర్కొంటోంది. అయితే ఆ జవాన్ వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు. బంగ్లాదేశ్‌లో రాజకీయం సంక్షోభ నెలకొన్న ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించి.. అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పెంచింది. మరోవైపు.. ఆదివారం పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ సరిహద్దుల గుండా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులను భద్రతా బలగాలు పట్టుకున్నారు.ఇదిలా ఉండగా.. రిజర్వేషన్ కోటా అంశంలో అల్లర్లు హింసాత్మకంగా మారటంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. బంగ్లా వందలి భారత్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె దేశం విడిచినప్పటి నుంచి కూడా అల్లర్లు తగ్గటం లేదు. ఆమెకు అనుకూలంగా వ్యవహిరించిన వారు రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఉన్న మైనార్టీలు, హిందువులపై దాడులు జరుగుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడిస్తోంది. -
Texas: తీవ్రమవుతున్న సరిహద్దు భద్రత వివాదం
టెక్సాస్: సరిహద్దు భద్రతపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య వివాదం తీవ్రమవుతోంది. అక్రమ వలసలకు మూలంగా మారిన షెల్బీ పార్కులోకి ఎవరినీ అనుమతించేది లేదని టెక్సాస్ ప్రభుత్వం తేల్చి చెబుతుంటే సరిహద్దు ఏజెంట్లను అనుమతించాల్సిందేనని ఫెడరల్ ప్రభుత్వం పట్టుబడుతోంది. జో బైడెన్ ప్రభుత్వం సరిహద్దు భద్రతలో వైఫల్యం చెందిందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఆరోపించారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు టెక్సాస్ స్టేట్ నేషనల్ గార్డ్, ఇతర బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. షెల్బీ పార్కును టెక్సాస్ ప్రభుత్వం ఇటీవలే తమ ఆధీనంలోకి తీసుకుంది. రియో గ్రాండేలో ఉన్న ఈ పార్కులోకి ఎవరినీ అనుమతించేంది లేదంటూ ఫెడరల్ ప్రభుత్వ ఆదేశాలను కూడా టెక్సాస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వివాదం కారణంగా స్టాండ్ విత్ టెక్సాస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇదీచదవండి.. అమెరికాలో నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష -
‘ఆ ఆయుధాలతోనే పోరాడతాం’
సాక్షి, న్యూఢిల్లీ : అందుబాటులో ఉన్న ఆయుధాలతో పోరాడేందుకు సేనలు సిద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఆయుధ సామ్రాగి సమకరణ కొనసాగుతోందని చెప్పారు.సైన్యం నిధుల కొరతతో సేనల ఆధునీకరణ, నూతన ఆయుధాల కొనుగోళ్లు మందగించాయని పార్లమెంటరీ కమిటీ నివేదిక నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నిధుల కొరతతో దళాల ప్రతిఘటన సామర్ధ్యం మెరుగుదల సమస్యలు ఎదుర్కొంటోందని రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లదించింది. కొన్ని ఆయుధాలకు కాలగ్రహణం పట్టిందన్న వాదనపై ఆర్మీ చీఫ్ స్పందిస్తూ గతంలోనూ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు . ఏ ఆయుధాలు అందుబాటులో ఉన్నా వాటితో పోరాడేందుకు ఆర్మీ జవాన్లు సిద్ధంగా ఉన్నారని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సైన్యానికి వెచ్చిస్తున్న ఖర్చులన్నీ నిర్వహణకే సరిపోతున్నాయన్న ప్రచారం అవాస్తవమని ఇటీవల ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.రక్షణ రంగ బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో దాదాపు 35 శాతం జాతి నిర్మాణానికే వెచ్చిస్తారని, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతల మెరుగుదలకు వెచ్చిస్తామమని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు విరమించుకోకుంటే తదుపరి చర్యలపై ముందడుగు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
మంత్రుల ఇళ్ల వద్ద సరిహద్దు సిత్రం!
రోడ్లకు అడ్డంగా ఐరన్ బ్యారికేడ్లు.. తుపాకులతో పహరాకాస్తున్న సరిహద్దు భద్రతాదళాలు.. అటువైపు ఎవరైనా వెళ్లాలన్నా భయపడే పరిస్థితి.. సహజంగా దేశ సరిహద్దుల్లో కనిపించే ఈ దృశ్యాలు గుంటూరు జిల్లాలో ముగ్గురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ ఇళ్ల వద్ద కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనను అడ్డుకోలేని సీమాంధ్ర ప్రాంత మంత్రుల ఇళ్లపై సమైక్యవాదులు దాడి చేస్తారేమోననే అనుమానంతో పోలీసు అధికారులు మం త్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దు భద్రతా దళాలను నియమించారు. ఆయా ఇళ్ల నుంచి వెళ్లే అన్ని రహదారులను బ్యారికేడ్లతో మూసేశారు. దీంతో ఆ సమీపంలోని ప్రజలు తమ ఇళ్లకు వెళ్లాలంటే రెండు, మూడు కిలోమీటర్ల దూరం చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. గుంటూరులో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాదరావు ఇళ్ల వద్ద, నరసరావుపేటలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఇంటివద్ద, తెనాలిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటి వద్ద ఈ బలగాలున్నాయి. నరసరావుపేటలో 120 రోజులుగా సుమారు 70మంది బీఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. - సాక్షి, నరసరావుపేట