nobel laureate
-
నర్గీస్‌ను చంపేందుకు కుట్ర
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మొహమ్మదీని చంపేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె కుటుంబం ఆరోపించింది. కేన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలకమైన శస్త్రచికిత్సను నిరాకరించి, నెమ్మదిగా ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందని తెలిపింది. ఆమె కుడి కాలు ఎముక గాయా న్ని వైద్యులు ఇటీవల గుర్తించారని, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన బయాప్సీకోసం శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వకుండా ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కుటుంబం వెల్లడించింది. చికిత్సలో మరింత జాప్యం జరిగితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి జైలు జీవితం, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, కేవలం ఆస్పత్రి సందర్శనలతో చేసే చిన్న చికిత్స ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయలేదని వారు తెలిపారు. కాగా, ఇటీవల ఎంఆర్ఐలో ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి ఉన్నట్లు బయటపడిందని, 2021లో గుండెపోటుకు గురైన తర్వాత ఆమె గుండె ధమనుల్లో ఒకదానికి యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు సూచించారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు సైతం మొహమ్మదీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నిర్బంధంలో ఉన్న మొహమ్మదీకి అవసరమైన వైద్య సంరక్షణను నిలిపివేస్తూ ఇరాన్ అధికారులు ఆమెను నెమ్మదిగా చంపుతున్నారు’అని హిల్లరీ క్లింటన్ గత శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొహమ్మదీ రెండు దశాబ్దాలుగా టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఇరాన్లో మానవ హక్కులకోసం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్ 2011లో తొలిసారి అరెస్టయ్యారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన ఆమె.. 2015లో మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులోనూ ఆమె పోరాటాన్ని ఆపలేదు. మహిళల హక్కులతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. జైలులో ఉన్నప్పటికీ మొహమ్మదీ మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇందుకుగాను 2023 సంవత్సరంలో మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. -
Bangladesh Political Crisis: బంగ్లాలో నేడే తాత్కాలిక సర్కారు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో గురువారం తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ బుధవారం ఈ మేరకు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. యూనుస్ సర్కారుకు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న 84 ఏళ్ల యూనుస్ హుటాహుటిన స్వదేశం చేరుకోనున్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని బంగ్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇదో గొప్ప అవకాశం. మతిలేని హింసతో దాన్ని చేజార్చుకోవద్దు. హింసకు పూర్తిగా స్వస్తి చెబుదాం. పారీ్టలతో పాటు అందరికీ ఇది నా విజ్ఞప్తి’’ అన్నారు. సాహస విద్యార్థుల వల్లే దేశంలో ఇంతటి విప్లవం సాధ్యమైందని ప్రశంసించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనుస్ పేరును విద్యార్థి సంఘాల నేతలే ప్రతిపాదించడం తెలిసిందే. రెచి్చపోయిన మూకలు బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హింసాకాండ బుధవారం కూడా నిరి్నరోధంగా కొనసాగింది. హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఒక్క మంగళవారమే దేశవ్యాప్తంగా 29 మంది పార్టీ మద్దతుదారులను హతమార్చారు. దాంతో గత నెల రోజుల్లో దేశవ్యాప్త హింసకు బలైన వారి సంఖ్య 470 దాటింది. హిందువుల ఇళ్లు, వ్యాపార సముదాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకుంటూ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రఖ్యాత జానపద కళాకారుడు రాహుల్ ఆనంద ఇంటిని లూటీ చేశారు. అనంతరం దాన్ని నేలమట్టం చేశారు. ఆయన ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించుకున్న 3,000 పై చిలుకు సంగీత పరికరాలలకు నిప్పు పెట్టారు. దాంతో కుటుంబంతో సహా రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పలుచోట్ల ముస్లిం యువకులు, మత పెద్దలు ఆలయాలకు, హిందువుల నివాసాలకు రక్షణ కల్పిస్తూ కన్పించారు. మరోవైపు పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. పరిస్థితి మరింత విషమిస్తుందన్న వదంతులకు జడిసి వారు మూకుమ్మడిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి తోడు పోలీస్స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! శాంతిభద్రతల పరిరక్షణకు విద్యార్థులు, యువకులే రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ను నియంత్రణ తదితర బాధ్యతలు నిర్వర్తిస్తూ కన్పించారు. శాంతిభద్రతలను కాపాడటం కేవలం సైన్యం వల్ల అయ్యే పని కాదని ఆర్మీ చీఫ్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నట్టు చెప్పుకొచ్చారు.ప్రొఫెసర్ నెత్తిన ముళ్ల కిరీటం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ‘పేదల బ్యాంకర్’గా, బంగ్లాదేశ్‌లో మైక్రోఫైనాన్స్ పితామహునిగా పేరొందారు. 1940లో చిట్టగాంగ్‌లో జని్మంచిన ఆయన ఢాకా వర్సిటీలో చదువుకున్నారు. పీహెచ్డీ తర్వాత పలు విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా చేశారు. బంగ్లాకు తిరిగొచ్చి బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్‌ను స్థాపించారు. పేదలకు చిన్న రుణాలిచ్చే ఈ మైక్రోఫైనాన్స్ సంస్థ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో యూనుస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. షేక్ హసీనా 2008లో రెండోసారి అధికారంలోకి వచి్చనప్పటి నుంచీ ఆమెతో మనస్ఫర్ధలొచ్చాయి. అవినీతి సహా ఆయనపై పలు ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. కారి్మక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలి ఆర్నెల్ల జైలు శిక్ష పడటంతో యూనుస్ దేశం వీడారు. ఖలీదా ర్యాలీ విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బుధవారం ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించింది. గృహనిర్బంధం నుంచి విడుదలైన పార్టీ చీఫ్ బేగం ఖలీదా జియా (79) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు మూకుమ్మడిగా కదిలి షేక్ హసీనా సర్కారును సాగనంపడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. ‘‘ఇది హింసా ప్రతీకారాలకు సమయం కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రేమ, శాంతి, సామరస్యాలు. అవే దేశ పునరి్నర్మాణానికి చోదక శక్తులు కావాలి’’ అన్నారు. ‘‘యువతే మన భవిత. వారి కలలను సాకారం చేసేలా ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దుకుందాం. రక్తపాతం, విధ్వంసం, ఆగ్రహావేశాలు, ప్రతీకారాలకు తావియ్యొద్దు’’ అని పిలుపునిచ్చారు.400 మంది భారతీయులు వెనక్కు కల్లోలం నేపథ్యంలో అక్కడున్న భారతీయులు ముందుజాగ్రత్తగా వెనక్కు వస్తున్నారు. వారికోసం ఎయిరిండియా, ఇండిగో బుధవారం ఢాకా నుంచి ఢిల్లీ, కోల్‌కతాకు ప్రత్యేక విమానాలు నడిపాయి. వాటిలో 400 మందికి పైగా తిరిగొచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి అత్యవసరం కాని 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్టు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంత ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.కొంతకాలం భారత్‌లోనే హసీనా: వాజెద్ ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే గడుపుతారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బుధవారం వెల్లడించారు. పలు దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోసం హసీనా ప్రయతి్నస్తున్నారన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘మా అమ్మ ప్రస్తుతం ఢిల్లీలో నా సోదరితో పాటు ఉన్నారు. కొంతకాలం అక్కడే ఉంటారు’’ అని చెప్పారు. లండన్ వెళ్లాలని హసీనా భావించగా ఆశ్రయం కలి్పంచేందుకు బ్రిటన్ నిరాకరించడం తెలిసిందే. -
Aung San Suu Kyi: మయన్మార్‌లో సంచలనం.. సూకీకి జైలు శిక్ష
Aung San Suu Kyi: భారత్ పొరుగు దేశం మయన్మార్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, సైనిక ప్రభుత్వం.. సూకిపై 11 అవినీతి కేసులను మోపింది. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం.. జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్లను నగదు, 11.4 కిలోల బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు కావడం విశేషం. మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే.. ఆమె మరింత శిక్షపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర్సన్‌గా ఉన్న ప్రజానేత ఆంగ్ సాన్ సూకీ.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేసింది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. A court in military-ruled #Myanmar sentenced deposed leader Aung San Suu Kyi to five years in jail after finding her guilty in the first of 11 corruption cases against her, according to a source with knowledge of proceedings. pic.twitter.com/IhkfM6Jmrt — Alpha7News (@Alpha7News) April 27, 2022 ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌కు చైనా గట్టి వార్నింగ్ -
ఏపీ పథకాలు బాగున్నాయ్..
సాక్షి, అమరావతి: సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని నోబెల్ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్తర్ డుఫ్లో అభినందించారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. వివిధ అంశాలపై సీఎంజగన్ దార్శనికత, పరిజ్ఞానం, అంకితభావం తమను ఆకట్టుకున్నట్లు చెప్పారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ప్రొఫెసర్ ఎస్తర్ డుఫ్లో బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారిత తదితర అంశాల్లో ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించారు. గదిలో కాదు.. జనం మధ్యలో తిరిగి సీఎం జగన్ సుదీర్ఘ పాదయాత్రతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని అర్థం చేసుకుని పథకాలను రూపొందించారని ఎస్తర్ డుఫ్లో పేర్కొన్నారు. ఒక గదిలో కూర్చుని సీఎం ఈ పథకాలకు రూపకల్పన చేయలేదని, అలా చేస్తే అవి కేవలం థియరిటికల్‌గా ఉంటాయని వ్యాఖ్యానించారు. సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తూ అర్హులు ఎవరూ మిగిలిపోకూడదంటూ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చొరవ ఆయన గొప్ప ఆలోచనా థృక్పథాన్ని వెల్లడిస్తోందని చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ఆయన అంకితభావాన్ని వెల్లడిస్తోందన్నారు. నగదు బదిలీ పథకాల్లో భాగంగా నేరుగా మహిళల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేయడం, గృహ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అన్ని రకాలుగా కుటుంబం సుస్థిరమవుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు.. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరు, దాని ప్రభావంపై అధ్యయనం నిర్వహించి సలహాలను కోరడం సీఎం దార్శనికతకు నిదర్శనమని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి సీఎం జగన్ పథకాలను ప్రవేశపెట్టినందున ఏం చేయాలన్న దానిపై తాము పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి బలోపేతం కోసం సూచనలు చేస్తామని చెప్పారు. గత 15 ఏళ్లుగా ‘జె–పాల్’ 20 రాష్ట్రాల్లో పని చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే కొన్ని అంశాల్లో పని చేస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ను కలసిన బృందం ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ఎస్తర్ డుఫ్లో బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులను కలుసుకుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ వివరించారు. జె–పాల్ (ది అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్)కు ఎస్తర్ డుఫ్లో డైరెక్టర్‌గా, సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాసియాకు సంబంధించి జె–పాల్ తరఫున సైంటిఫిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో ఎస్తర్ డుఫ్లోతో పాటు బృందం సభ్యులు శోభిని ముఖర్జీ, కపిల్ విశ్వనాథన్, అపర్ణ కృష్ణన్, కునాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్‌లోనూ ఏపీ తరహా పథకం.. -
దేశ ఆర్థిక వ్యవస్థపై నోబెల్ బహుమతి గ్రహీత కీలక వ్యాఖ్యలు
నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్లో జరిగిన అహ్మదాబాద్ యూనివర్సిటీ 11వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆర్థికవేత్త ఇటీవల తన పశ్చిమ బెంగాల్ పర్యటన గురుంచి కొన్ని ఆసక్తికర విషయాల పంచుకున్నారు. భారతదేశంలోని ప్రజలు ఇంకా తీవ్రంగా బాధపడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 2019 స్థాయి కంటే తక్కువగా ఉందని అన్నారు. ప్రజల చిన్న కోరికలు కూడా తీర్చుకోలేక పోతున్నారని అన్నారు. మీ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి గాని, కుటుంబం లేదా సమాజం ఒత్తిడికి గురికాకుండా ఉండాలని అన్నారు. మీ జీవితంలో నిజంగా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ధైర్యం కలిగి ఉండాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మన భారతదేశంలోని ప్రజలు ఇంకా తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన అన్నారు. "నేను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో కొంత సమయం గడిపాను. వారు చెప్పిన మాటలు వీని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. గ్రామీణ ప్రజలు చిన్న, చిన్న కోరికలు కూడా నెరవేర్చుకోలేకపోతున్నారు" అని బెనర్జీ అన్నారు. "మనం చాలా బాధ అనుభవిస్తున్నాము నేను అనుకుంటున్నాను. ప్రస్తుత దేశం ఆర్థిక వ్యవస్థ 2019లో ఉన్న దానికంటే చాలా దిగువన ఉంది. ఎంత దిగువన ఉందో మాకు తెలియదు, కానీ ఇది చాలా తక్కువగా ఉంది అని నేను చెప్పగలను. ఈ విషయంలో నేను ఎవరినీ నిందించడం లేదు" అని ఆర్థికవేత్త చెప్పారు, 2019లో ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమర్లతో పాటు అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో తను చదువుకుంటున్నప్పుడు తీహార్ జైలులో 10 రోజులు గడిపానని బెనర్జీ ప్రేక్షకులకు తెలియజేశారు. స్నాతకోత్సవం సందర్భంగా ప్రైవేట్ వర్సిటీకి చెందిన నలుగురు డాక్టరల్ విద్యార్థులతో సహా 833 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. (చదవండి: మదుపరుల ఇంట కనకవర్షం కురిపిస్తున్న ఈ కంపెనీ స్టాక్స్!) -
త్వరలో మహమ్మారి తగ్గుముఖం
న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని 2013లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు. చైనాలో ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తగ్గిన తరహాలోనే ప్రపంచ దేశాల్లోనూ కరోనా విస్తృతి మందగిస్తుందని ఆయన పేర్కొన్నారు. చైనా తరహాలోనే అమెరికా సైతం త్వరలోనే కరోనా వ్యాప్తి నుంచి విముక్తి పొందుతుందని, ఇది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయం కంటే ముందే జరుగుతుందని లెవిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే ఆయన ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను నిశితంగా అథ్యయనం చేస్తున్నారు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు భయాందోళనలను అధిగమించాలని, సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. వాస్తవానికి దగ్గరగా లెవిట్ అంచనాలు కరోనా వైరస్‌తో చైనాలో దాదాపు 80,000 కేసులు నమోదవుతాయని, 3,250 మరణాలు సంభవిస్తాయని లెవిట్ ఫిబ్రవరిలోనే అంచనా వేయగా, సరిగ్గా చైనాలో అదే సంఖ్యలో 80,298 కేసులు, 3245 మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ముమ్మరంగా సాగినా మార్చి 16 నుంచి నూతన రోగుల సంఖ్య స్వల్పంగా ఉందని గుర్తుచేశారు. ఈ మహమ్మారిని రూపుమాపే దిశగా మనం సరైన దిశలోనే సాగుతున్నామని లాస్ఏంజెల్స్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు. 78 దేశాల నుంచి ప్రతిరోజూ కొత్తగా నమోదయ్యే 50కి పైగా కేసులను ఆయన విశ్లేషిస్తూ వైరస్ వ్యాప్తిలో కొంత రికవరీ కనిపిస్తోందని అంచనా వేశారు. మొత్తం కేసుల సంఖ్యను ఆయన పరిగణనలోకి తీసుకోకుండా రోజూ కొత్తగా నమోదయ్యే కేసుల్లో తగ్గుదలను ఆయన ప్రధానంగా పరిశీలిస్తున్నారు. కేసుల సంఖ్య ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నా ఈ వైరస్ వ్యాప్తి బలహీనపడుతున్నదనేందుకు స్పష్టమైన సంకేతాలు ఉఆన్నయని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాజిక దూరం పాటించడం, వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడం రెండూ కీలకమని అన్నారు. మొత్తం కరోనా కేసుల సంఖ్యను, కరోనా పాజిటివ్‌గా తేలిన సెలబ్రిటీలను ఫోకస్ చేస్తూ మీడియా ప్రజలను అనవసరంగా భయాలకు లోనుచేస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ బాధితులతో ఆస్పత్రులు నిండిపోవడంతో సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ను అడ్డుకోవడం మంచిదని సూచించారు. చదవండి : ‘ఫిబ్రవరి నెలాఖరు నుంచే ముందు జాగ్రత్త చర్యలు’ అతిగా స్పందిస్తే అనర్ధం కరోనా వైరస్ వ్యాప్తిపై అతిగా స్పందించడం మరో సంక్షోభానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనవసర భయాందోళనలతో నిరుద్యోగానికి దారితీయడం, ఆత్మహత్యలు పెరగడం వంటి విపరీత ధోరణులు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి ప్రతికూల ప్రభావాలనూ తోసిపుచ్చలేమన్నారు. ఫ్లూ కంటే ఈ వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉన్నా ఇది ప్రపంచ అంతానికి దారితీయదని, వాస్తవ పరిస్థితి చెబుతున్నంత భయానకంగా లేదని లెవిట్ స్పష్టం చేశారు. -
అభిజిత్ ‘నోబెల్’ వెలుగు నీడలు
‘‘దేశాల అభివృద్ధికి దోహదం చేయగల ప్రయోగాల ద్వారా ఆర్థిక శాస్త్రంలో నూతన ఆవిష్కరణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా దారిద్య్ర బాధల్లో ఉన్న ప్రజా బాహుళ్యానికి విముక్తి కలిగించే ప్రయోగాలు చేసినందుకు ఆర్థికవేత్తలు అభిజిత్ బెనర్జీ, ఆయన సతీమణి ఈస్తర్ డఫ్లో, మైఖేల్ క్రీమర్లు నోబెల్ బహుమతికి సంయుక్తంగా అర్హులయ్యారు’’ – నోబెల్ కమిటీ ప్రకటన (14–10–2019) అయితే ‘‘దారిద్య్ర కారణాలను సునిశితమైన దృష్టికోణం నుంచి అందుకు దారితీసిన లేదా కారకులైన శక్తులు లేదా పాలకులు అనుస రించిన మార్గాలను మరింత నిశితంగా విమర్శనాత్మకంగా పరిశీలిం చాలి. ప్రజల ఆర్థిక స్థితిగతుల పరిశీలనలో మచ్చుకు జరిపే కొన్ని నియంత్రిత ప్రయోగాలను కూడా ఈ శక్తులు బరితెగించి ఉల్లంఘి స్తాయి.’’ – ప్రసిద్ధ ఆర్థిక వేత్తలు ఫర్వాసియాల్, కరొలినా ఆల్వెస్ అధికారం లేని ప్రజ్ఞ ఓంకారం లేని మంత్రం లాంటిదన్నది ఓ సామెత. ప్రజల దారిద్య్ర నిర్మూలనకు సామాజిక రాజకీయ పాలనా వ్యవస్థ మూలాల్లోకి వెళ్లి తరచి చూడకుండా పరిష్కారం కోసం మార్గాన్వేషణ చేయడం అర్ధసత్యంగానే మిగిలిపోతుంది. అభిజిత్ బెనర్జీ త్రయానికి, నోబెల్ కమిటీ అత్యున్నత పురస్కారం ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకుని మరొక ప్రసిద్ధుడు రోహన్ వెంకట్రావు కృష్ణన్ ఒక సహేతుకమైన ప్రశ్న వేశారు– దేశాభివృద్ధికి సంబంధించిన విధానా లను, మానవ నైజాన్నీ, రోగికి వాడే మందుల మంచి చెడులను పరీక్షించి నిగ్గు తేల్చినట్లుగా కొలవగలమా అని? ఇందుకు సమా ధానమా అన్నట్లు నోబెల్ కమిటీ ‘‘ప్రపంచ వ్యాపిత దారిద్య్ర నిర్మూలనకు జరిగే పోరాటంలో మన శక్తియుక్తులను పెంచడానికి ఈ ఏడాది బహుమాన గ్రహీతలు ఆర్థిక శాస్త్రంలో జరిపిన పరిశోధనలు తోడ్పడతాయి. ఆర్థికాభివృద్ధి పరివర్తన వైపుగా ఆర్థికవ్యవస్థల్ని మల్చ డానికి కేవలం గత రెండు దశాబ్దాల్లోనే అభిజిత్ ప్రభృతుల నూతన ప్రయోగాలు తోడ్పడ్డాయి. ఇకనుంచి ఈ ప్రయోగ పరిశోధనా పద్ధ తులు అభివృద్ధికి దోహదకారి కాగల అర్థశాస్త్రాన్ని శాసించను న్నాయి’’ అని జోస్యం చెబుతోంది. ఆశాభావం మంచిదే కానీ, ప్రస్తు తమున్న సామాజిక దోపిడీ వ్యవస్థా చట్రాన్ని, అందుకు పనిగట్టు కుని చేదోడువాదోడుగా ఉంటున్న రాజకీయ, ఆర్థిక పాలనా వ్యవ స్థను, పద్ధతుల్ని సమూలంగా మార్చకుండా ఆర్థిక స్థితిగతుల మంచి చెడుల గురించి మచ్చుకు (రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్) జరిపే తాత్కాలిక ప్రయోగాల వల్ల అంతగా ప్రయోజనం లేకపోవచ్చు. బహుశా నోబెల్ పురస్కారం అందుకోకముందు, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పాలకుల ఆధ్వర్యంలో గాడితప్పి పోతోందని అభిజిత్ భావించినట్లు కనపించినా అందుకు గల పెట్టుబడి వ్యవస్థాగత మూలాల గురించి ఎక్కడా ప్రస్తావించినట్టు కన్పించదు. తాత్కాలిక ‘లేపనాలు’ పరిష్కారం కావు అసలు ప్రస్తుతం దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ చట్రంలో బందీగా ఉన్న వాస్తవాన్ని గుర్తించి, దాన్ని బహిర్గతం చేయకుండా ప్రస్తుత పాలక వర్గం కార్పొరేట్ మోతుబరులపై తగ్గించిన పన్నుల మొత్తాల్ని గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి, ప్రధానమంత్రి కిసాన్ పథకానికి మళ్లించాలని అభిజిత్ ప్రభృతులు (2.10.2019) సూచిం చడం మెచ్చుకోదగిన ప్రతిపాదన. అయితే అంతమాత్రాన పెట్టుబడి దారీ వ్యవస్థ మూలాల్లో పేరుకున్న దోపిడీ లక్షణమనే ‘పుండు’ తొలగిపోదని గ్రహించాలి. ఎప్పటికప్పుడు పాలకులు గడిచిన ఐదేళ్లలో స్వయంకృత ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయ టపడవేయడంలో ఘోరంగా విఫలమై, రానున్న ఐదేళ్లలో దేశంలో రూ. 375 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని ‘ఉత్తరకుమార ప్రజ్ఞలు’ పలుకుతూ... ఉన్న ఉద్యోగాలకు ఎసరుపెడుతూ, గ్రామీణ, మధ్యతరగతి, పారిశ్రామిక, వ్యావసాయక రంగాలలో సర్వవ్యాపిత సంక్షోభాన్ని ఆవిష్కరించి కూర్చున్నారు. బహుశా అందుకే అభిజిత్ ప్రభృతులు మూలాలకు వెళ్లకుండా కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ‘లేపనాలు’ (చికిత్సలు) అద్దడానికి ప్రయత్నిస్తు న్నారు. అన్నీ పండించే రైతుకు అన్నం కరువు, అయినా ‘సున్నం’ తిని బతకమంటూ వ్యవస్థ మిగిలిన ‘మూలుగల’ను కూడా పాలకులు పిండేస్తున్నారు. బ్యాంకింగ్, సహకార సంస్థలు, పరపతి సంస్థలు ఒక్కటొక్కటిగా మూలపడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మూలా లన్నీ దేశ సాంస్కృతిక, చారిత్రిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, తాత్విక రంగాల పునాదులపై ఆధారపడి ఉంటాయి. వీటన్నింటినీ కూలంకషంగా మథించిన తరువాతనే మానవజాతి ఉత్థాన పతనాల గురించి శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతాన్ని రూపొందించిన ఏకైక దార్శనికుడు కారల్‌మార్క్స్.. తత్వశాస్త్రజ్ఞులు ప్రపంచానికి భాష్యం చెబుతూ వచ్చారు. కానీ ఇకనుంచి మనం ప్రపంచ పరిణామాన్ని విలువైన మలుపు తిప్పాలన్నాడు. టెక్నాలజీ ముసుగులో సరికొత్త దోపిడీ కనుకనే భారతదేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన గాల్ బ్రెయిత్, సోవియెట్ యూనియన్‌లో పాలకుల వికృత విధానాల మూలంగా సోషలిజం వ్యవస్థకు చేటు మూడినప్పుడు దాన్ని మార్క్సిజం పతనంగా ప్రపంచ పెట్టుబడిదారీ వర్గమూ, వారి నాయకులూ పట్టలేని ఆనందంతో ప్రకటనలు గుప్పిస్తున్నప్పుడు ఇలా వ్యాఖ్యానించారు: ‘‘సోషలిజానికి ఒకచోట ఎన్ని అవాంతరాలొ చ్చినా, మార్క్స్ మార్క్సిజం మాత్రం జగజ్జేగీయమానంగా ప్రపంచం ఉన్నంతవరకూ వెలుగొందుతూనే ఉంటుందన్నాడు. దోపిడీ దౌర్జన్యా లపై ఆధారపడి మనుగడ సాగించగోరే పెట్టుబడి వ్యవస్థ మనుగడ నిరంతరం సైన్స్, టెక్నాలజీల వృద్ధిమీద ఆధారపడి కొనసాగించాల నుకుంటుంది. కానీ దాని దోపిడీ స్వరూపాన్ని విడనాడకుండానే దోపిడీని టెక్నాలజీ ముసుగులో కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. కనుకనే ప్రపంచవ్యాపితంగా అన్ని ఖండాలలోని బడుగు, బలహీన వర్ధమాన దేశాలను అప్పుల కుంపటిలోకి నెట్టి నిరంతర రుణాలలో మగ్గిపోయేటట్టు చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటోంది. ఇందుకు టెక్నాలజీలో ప్రవేశపెట్టిన డిజిటల్ యుగం మరింత రాక్షస రూపంలో ఇళ్లల్లోకే కాదు, పడక గదుల్లోకి కూడా దూరి తిష్టవేసి, పౌర సామాజి కుల గోప్యతకు రక్షణలేని దుస్థితిని ఆవిష్కరిస్తోంది. ‘ఆధునికత’ పేరిట సాగే ఈ వికృత ఆవిష్కరణలన్నీ పాత, కొత్త వలస సామ్రా జ్యాలు, వాటిపై ఆధారపడి మనుగడ సాగించజూస్తున్న కొన్ని వర్ధ మాన నయా పెట్టుబడిదారీ వ్యవస్థలు, పాలకులు తమ మనుగడను మరికొన్నాళ్లు పొడిగించుకోవడానికి తోడ్పడుతున్నాయి. అభిజిత్ అభ్యుదయ కోణం పరిమితమే! ఈ దశలో అభిజిత్ ప్రభృతులు నోబెల్ గ్రహీతలయినందుకు సంతోషిద్దాం. కానీ అభిజిత్ బెనర్జీలోని పరిమిత అభ్యుదయ కోణాన్ని హర్షిస్తూనే, కొద్దికాలం క్రితం ఆయనలో తొంగిచూసిన అభ్యుదయ వ్యతిరేక సామాజిక దృక్పథాన్ని కూడా ఖండించకుండా ఉండలేం. మహిళలపట్ల అభిజిత్ దృక్పథాన్ని, రేప్, సెక్స్ (లైంగిక, అత్యాచార సమస్యలపైన) విషయాలపై వెలిబుచ్చిన విస్మయకర మైన అభిప్రాయాలపైన ‘ఫ్రీప్రెస్ జర్నల్’ (16.10.2019) ఒక వ్యాసం ప్రచురించింది. దేశంలో పెరిగిపోతున్న సెక్స్, రేప్‌లకు కారణం స్త్రీ–పురుషుల మధ్య కలివిడిగా జరిపే సంభాషణలే కారణ మన్నది అభిజిత్ అభిప్రాయం. లైంగిక వ్యవహారాల్లో అసమానత లను సమాజం ఎలా తొలగించగలదో చూడాలని అభిజిత్ ఆ జర్న ల్లో పేర్కొన్నందుకు ‘గబ్బు’ లేచింది. సెక్స్ కోర్కెలు తీర్చుకోవ డంలో స్త్రీ పురుషుల మధ్య అసమానతలుండకూడదన్నది ఆయన అభిప్రాయంలా ఉంది. ఏది ఏమైనా, ఇలాంటి భావాలన్నీ బుద్ధి జాఢ్యజనితోన్మాదం కిందకు, పెడదారి కిందికి వస్తాయి. అయితే సమాజ దోపిడీపై ఆధారపడి బతుకుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తుల ఆలోచనా సరళిలో ఈ పెడదారులు సహజమై ఉండాలి. ఎందుకంటే, ఒకవైపున దారిద్య్ర బాధనుంచి సామాన్య ప్రజా బాహు ళ్యాన్ని తప్పించేందుకు ఆర్థిక శాస్త్రంలో నూతన ప్రయోగాలకు, ఆవిష్కరణలకు నడుం కట్టిన అభిజిత్ ప్రస్తుత విద్యా విధానంలో పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని కాకుండా కాంట్రాక్టు పద్ధతిపై ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ ఉండా లని ప్రతిపాదించడం విద్యా బోధనా క్రమంలో ఎలాంటి అస్తవ్యస్త స్థితికి కారణమవుతుందో బోధపడటం లేదు. శాశ్వత ప్రాతిపదికపై ఉపాధ్యాయుల నియామకాలకన్నా కాంట్రాక్టు పద్ధతిపై టీచర్లను నియమించడమే మేలన్నది అభిజిత్ భావన. నూతన ప్రయోగాలకు మౌలిక ‘బీజం’ ఎక్కడ? ఇంతకూ అభిజిత్ ప్రభృతులకు, తాము పేదరిక నిర్మూలనకు గాను ఉద్దేశిస్తున్న ఆర్థిక శాస్త్రంలో ఆవిష్కరించిన ‘నూతన ప్రయోగాల’కు మౌలికమైన ఆలోచనా బీజం ఎక్కడనుంచి మొలకెత్తాలో తెలిసి ఉండాలి. ఆ మౌలిక వాస్తవాన్ని 19వ శతాబ్దిలోనే దోపిడీ సమాజంలో బతుకుతున్న ఇంగ్లండ్ శ్రమజీవులైన ప్రజలకు షెల్లీ మహాకవి ఇచ్చిన సందేశ కవితలో ఇలా ఆవిష్కరించారు: ‘‘పంట విత్తనం చల్లేది నీవు, కోసుకెళ్లేది వాడు! సంపద సృష్టించేది నీవు, అప్పనంగా అనుభవించేది వాడు! అందమైన బట్టల సృష్టి నీవు, వాటిని ధరించేది వాడు! ఆయుధాలు తయారు చేసేది నీవు, వాటిని నీమీదికే ఉపయోగించేది వాడు! విత్తనం చల్లు– కానీ ఏ నిరంకుశుడూ అనుభవించకుండా చూడు! సంపదను సృష్టించు– కానీ మరెవడో వచ్చి అనుభవించకుండా చూడు! బట్టలు తయారుచేయి– కానీ సోమరిపోతుకు దక్కకుండా చూడు! ఆయుధాలు తయారు చేయి– కానీ వాటిని నీ రక్షణ కోసమే వాడుకో!’’ అర్ధశాస్త్రంలో నూతన ఆవిష్కరణలు అలాంటి మహోదయానికి దారితీయగలగాలి. ఎండమావుల్ని తొలగించగలగాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మనుషులను వేటాడే మనిషి
‘రాత్రివేళ అంబులెన్స్ వచ్చి నన్ను పట్టుకుపోయే సందర్భం కోసమని సిద్ధంగా ఉండేందుకు– పడుకోబోయే ముందు నా పాదాలను శుభ్రంగా కడుక్కునే వయస్సులోనూ, స్థితిలోనూ ఉన్నాను’ అనే 61 ఏళ్ళ జెనీనా మాటలతో, ఓల్గా తొకార్చుక్ పోలిష్ నవల ‘డ్రైవ్ యువర్ ప్లవ్ ఓవర్ ద బోన్స్ ఆఫ్ ద డెడ్’ మొదలవుతుంది. జెనీనా ఒకానొకప్పుడు వంతెన నిర్మాణ ఇంజనీరూ, క్రీడాకారిణీ. ‘జాతీయ సరిహద్దులతో నిమిత్తంలేకుండా, ఫోన్ సిగ్నళ్ళు ఇటూ అటూ కూడా అందే’ ఆధునిక పోలండ్ – చెక్ రిపబ్లిక్ సరిహద్దుల్లో ఉన్న పేరుండని గ్రామంలో శీతాకాలం అది. లోకం నుంచి దూరం పాటిస్తూ, జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, విలియమ్ బ్లేక్ కవిత్వాన్ని అనువదిస్తూ కాలం గడుపుతుంది కథకురాలైన జెనీనా. ఆ వేటాడే సమాజంలో నివసించే శాకాహారైన ఆమెను, ‘అడివిలో ఉండే మతిస్థిమితం లేని ముసలామె’ అనుకుంటారు స్థానికులు. జెనీనాకు, ‘మనుషుల పేర్లు ఉపయోగించడం ఇష్టముండదు. మొదటిసారి, ఒక వ్యక్తిని చూసినప్పుడు తట్టే విశేషణమే నచ్చుతుంది.’ అందుకనే ఊరివారిని తనకు తోచిన పేర్లతోనే పిలుస్తుంది. కీటక శాస్త్రవేత్త అయిన బౌరస్ ఆ పల్లెకు వచ్చి, జెనీనా ఇంట్లో ఉంటాడు. ఒకరోజు– ఆమె పొరుగింట్లో ఉండే ‘ఆడ్‌బాల్’ వచ్చి, పక్కనే ఉంటుండే వేటగాడైన, ‘బిగ్ ఫుట్’ చనిపోయున్నాడని చెప్తాడు. మృతుడి గొంతుకు జింక ఎముక అడ్డం పడుంటుంది. పక్కనున్న ఫొటోలో, జెనీనా కుక్కలను వేటాడి చంపేసిన వ్యక్తుల మొహాలుంటాయి. ఆ తరువాత, మరికొందరు మధ్యవయస్కులైన వేటగాళ్ళు మరణిస్తారు. అందులో ఒకరి హత్య పురుగులను గొంతులోకి దింపడం ద్వారా జరుగుతుంది. ఆ మరణాలు ఊర్లో అలజడి సృష్టిస్తాయి. ‘సంభవిస్తున్న ఈ విషాద ఘటనలకి కారణం జంతువులే అని నమ్మాలని నేను పోలీసు విభాగానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను’ అని ఆమె రాసిన తరువాత, పల్లెవాసులందరికీ ఆమెకు పిచ్చి అన్న అభిప్రాయం బలపడుతుంది. ‘నా రోగాలెప్పుడు మోసం చేస్తూ నన్ను పట్టుకుంటాయో కూడా తెలియదు... ఒకోసారి రోజులకొద్దీ కొనసాగుతాయి... మందులు, ఇంజెక్షన్లు పని చేయవు’ అనే జెనీనాను, ‘జీవితంలో నీవు చేసినదేమిటి?’ అని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఆమెకు నోటి మాట రాదు. ‘మేము ప్రేమించిన– మా బాల్యం, యవ్వనం గడిచిన జాగాలు ఇక లేవు. వాటి బాహ్యరూపం మాత్రమే భద్రపరచబడి, లోపలేమీ లేని ఈ పెంకులని చూడటం మరీ బాధాకరం. వెళ్ళేందుకు నాకే చోటూ లేదు. ఇది జైలుశిక్ష. నేను చూడగలిగే దిగంతం దీని గోడలే’ అనుకుంటుంది. ఊరంతా జెనీనాయే హంతకురాలన్న నిర్ణయానికి వచ్చి, ఆమెను నిలదీస్తారు. తను జబ్బుపడే వేళయినప్పుడు, తన కుక్కలను వేటాడినవారిని తానే చంపేసేదాన్నని ఒప్పుకుంటుంది. జెనీనా, బౌరస్ కలిసి చెక్ రిపబ్లిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు. నవల్లో ఉన్న 17 అధ్యాయాలూ, బ్లేక్ కవితల్లో నుంచి తీసుకున్న ఉల్లేఖనాలతోనే మొదలవుతాయి. 2009లో పోలిష్ భాషలో వచ్చిన పుస్తకం–ప్రకృతి, దానిపైన మానవుల ప్రభావం, వేట, దాని క్రూరత్వం వంటి సమకాలీన సాహిత్య సమస్యలకు సరితూగి, పాతదనిపించదు. అధికారం, డబ్బు, పితృస్వామ్యం గురించి మాట్లాడే నవల వచనం– సున్నితమైన హాస్యం నుండి విచారానికీ, దుర్బలత్వానికీ పాదరసంలా మారుతుంటుంది. ఏంటోనియా లాయిడ్ జోన్స్ ఇంగ్లిష్ అనువాదాన్ని రివర్ హెడ్ బుక్స్– ఆగస్టు 2019లో ప్రచురించింది. ఈ మర్మంతో కూడిన నవల కట్టుకథ శీర్షిక, బ్లేక్ ‘ప్రావర్బ్స్ ఆఫ్ హెల్’లో ఒకటి. ఆగెనెస్కియా హాలెండ్ దర్శకత్వంలో ఈ నవల ఆధారంగా 2017లో సినిమా కూడా వచ్చింది. 1962లో జన్మించిన ఓల్గా తొకార్చుక్ తన ఫ్లైట్స్ నవలకుగానూ 2018లో మ్యాన్ బుక్ ఇంటర్నేషనల్ బహుమతి పొందారు. ఇది పొందిన మొట్టమొదటి పోలిష్ రచయిత్రి ఈమె. కార్యకర్త కూడా అయిన తొకార్చుక్ పుస్తకాలన్నీ పోలండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీల చరిత్రకు సంబంధించినవై, పౌరాణిక స్వరంతో వినిపిస్తాయి. 29 భాషల్లోకి అనువదించబడిన రచయిత్రి పుస్తకాలు ఆమె ఎంతోకాలం గడిపిన కోయెడ్జో్క లోయ నేపథ్యంగా రాసినవి. 2018 నోబెల్ పురస్కారాన్ని కూడా ఓల్గాకు ప్రకటించడంతో ఒకే ఏడాది రెండు ప్రధాన అవార్డులు ఆమెను వరించినట్టయింది. అయితే బుకర్ బహుమతి ఒక పుస్తకానికి ఇచ్చేది కాగా నోబెల్ జీవితకాల కృషికి దక్కే గుర్తింపు.2019 నోబెల్ పురస్కారాన్ని ఆస్ట్రియన్ రచయిత పీటర్ హ్యాంకీకి ప్రకటించినప్పుడే, 2018కి గానూ ఓల్గాకు ఇస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది నోబెల్ కమిటీ మీద వచ్చిన వివాదాల నేపథ్యంలో అవార్డును ఎవరికీ ప్రకటించలేదు. ఆ వాయిదా పడిన అవార్డును ఇప్పుడు ప్రకటించారు. కృష్ణ వేణ -
‘విక్రమ్’ సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది!
చండీగఢ్ : సైన్స్ అంటేనే తెలియని విషయాలను తెలుసుకోవడం అని.. ఆ క్రమంలో ఒక్కోసారి అపజయాలు కూడా ఎదురవుతాయని నోబెల్ బహుమతి గ్రహీత, ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జ్ హారోచ్ అన్నారు. అద్భుత విజయాలతో పాటు ఓటములను సైతం చిరునవ్వుతో స్వీకరించి వాటిని అధిగమించే దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. చండీగఢ్‌లో జరుగుతున్న ‘నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా 2019’ కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సెర్జ్ మాట్లాడుతూ.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైందని తాను భావించడం లేదన్నారు. విక్రమ్ ల్యాండర్‌కు ఏమైందో తనకు తెలియదు గానీ.. ఇస్రో కచ్చితంగా సమస్యను పరిష్కరించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సైన్స్ విభాగంలో పనిచేసే వారు అస్సలు నిరాశ చెందకూడదు. ప్రయోగాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారన్న మాట నిజమే. ఆర్థిక అంశాలతో పాటు రాజకీయాలు కూడా దీనితో ముడిపడి ఉంటాయి. ఒక ప్రయోగం చేపట్టేపుడు మీడియా విపరీతంగా కవర్ చేయడం... ఈ క్రమంలో ఏ చిన్న తప్పు జరిగినా అది పెద్దదిగా కనిపించడం సహజమే. అంచనాలు పెరిగే కొద్దీ విమర్శల స్థాయి కూడా పెరుగుతుంది. యువత మెదళ్లపై పెట్టే పెట్టుబడే ఏ దేశానికైనా అత్యుత్తమైనది. యువ సంపద భారీగా ఉన్న భారత్ ఈ మేరకు పెట్టుబడులు పెడుతూ విదేశాల్లో ఉన్న తమ వాళ్లను ఇక్కడికి రప్పించాల్సిన అవసరం ఉంది. గణిత, భౌతిక శాస్త్రాలతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్‌లో కూడా భారత్ నాణ్యమైన విద్యనందిస్తోంది. చంద్రయాత్ర వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీడియా ప్రచారం కల్పించే ఖర్చుతో మరిన్ని చిన్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చనేది నా భావన’ అని సెర్జ్ పేర్కొన్నారు. అదే విధంగా వాతావరణ మార్పుల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్్డ ట్రంప్ వైఖరి గురించి ప్రస్తావించగా..‘ ఆయనకు అసలు మెదడు లేదు. అందుకే ఆయనలోనూ ఏమార్పు ఉండదు’ అని వ్యాఖ్యానించారు. కాగా భౌతిక శాస్త్రం(మెజరింగ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్ క్వాంటం సిస్టమ్)లో తన పరిశోధనలకు గానూ మరో శాస్త్రవేత్త డేవిడ్ జే. విన్లాండ్తో కలిసి సెర్జ్ 2012లో నోబెల్ బహుమతి అందుకున్న విషయం తెలిసిందే. -
‘ఎన్నికల వేళ ఆ అంశాలను తెరపైకి తెచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ఏడాది రామ మందిర నిర్మాణం, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వంటి అంశాలు కీలకంగా ముందుకొచ్చాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ నరేంద్ర మోదీ సర్కార్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పక్కదారిపట్టి ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోవడం, ప్రజలను వేధించడం ఆమోదయోగ్యం కాదని, దేశంలో ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో పలు విశ్వవిద్యాలయాలు వాటి స్వేచ్ఛను, స్వతంత్రతను కాపాడుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇతర సంస్థల పరిస్థితీ అలాగే ఉందని, చివరికి పాత్రికేయులు సైతం తమ స్వేచ్ఛను కోల్పోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీయేతర లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన గతంలో పిలుపుఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన క్రమంలో బీజేపీయేతర పార్టీల కూటమిలో చేరేందుకు వామపక్షాలు వెనుకాడరాదని సూచించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 31 శాతం ఓట్లు పొందిన పార్టీ రాజకీయాల్లో పెడపోకడలను ప్రోత్సహిస్తోందని అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. -
కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరి నోబెల్ సర్టిఫికెట్ మాయం
-
కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరి.. నోబెల్ సర్టిఫికెట్ మాయం
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగలు పడ్డారు. సామాజిక సేవకు గుర్తింపుగా ఆయనకు లభించిన విశిష్ట అవార్డు నోబెల్ బహుమతికి సంబంధించిన సర్టిఫికెట్‌ను ఎత్తుకెళ్లారు. ఆయన ఇంటిని దుండగులు చిన్నాభిన్నం చేసినట్లు కూడా తెలిసింది. అయితే, నోబెల్ బహుమతి ఆయన జాతికి అంకితం చేసిన నేపథ్యంలో అది ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ఉన్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. సామాజిక ఉద్యమకారుడే అయినప్పటికీ కైలాస్ సత్యార్థి భారతీయ బాలలహక్కుల కోసం అమితంగా పోరాడే ప్రముఖ ఉద్యమకారుడు. ఆయన 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ (బాల్యాన్ని కాపాడే ఉద్యమం) స్థాపించి, 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు. ఆయన 2014 నోబెల్ బహుమతిని, పాకిస్థాన్ అక్షర సాహసి మలాలా యూసఫ్జాయ్తో సంయుక్తంగా "యువత, బాలల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి, బాలలందరికీ విద్యాహక్కు’ అనే అంశానికి నోబెల్ పురస్కారం పొందారు. తాజాగా ఆయన ఇంట్లో పడిన దొంగలు ఈ నోబెల్ అవార్డుతోపాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కైలాష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. -
నోట్ల రద్దుతో ప్రజల్లో మార్పు రాదు..
నోబెల్ గ్రహీత పాల్ క్రుగ్మన్ అభిప్రాయం న్యూఢిల్లీ: నోట్ల రద్దు భారీ స్థారుులో నష్టం కలిగించే చర్య అని నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు పాల్ క్రుగ్మన్ అన్నారు. ఇది ప్రజల ఆలోచనను మార్చలేదన్నారు. మనీ లాండరింగ్ విషయంలో మరింత జాగ్రత్త పడతారని, పక్కదారులు వెతుకుతారని, మరోసారి ఇలానే చేస్తే తమను తాము రక్షించుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆచరిస్తున్న విధానం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగించేదిగా పేర్కొన్నారు. క్రుగ్మన్ అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. డీమోనిటైజేషన్ను అసాధారణ చర్యగా పేర్కొన్నారు. రూ.2,000 నోటు విడుదల సరైంది కాదన్న ఆయన... నల్లధనాన్ని ఏరిపారేయడానికి ఇదొక ప్రయత్నమని చెప్పారు. -
'మలాలా స్కూల్‌ని పేల్చేస్తాం'
లండన్: బ్రిటన్ లోని ఎనిమిది పాఠశాలలను బాంబులతో పేల్చివేస్తామని ఉగ్రవాదులు సోమవారం బెదిరించారు. పాకిస్థానీ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయి చదువుతున్న స్కూల్ కూడా ఉగ్రవాద బెదిరింపులు వచ్చిన వాటిలో ఉంది. ఇంగ్లండ్ బిర్మింగ్ హామ్ లోని ఆరు స్కూళ్లు, స్కాట్లాండ్ గ్లాస్ గౌలోని రెండు పాఠశాలలను పేల్చివేస్తామని ఉగ్రవాదులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ పాఠశాలల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. 18 ఏళ్ల మాలాలా ప్రస్తుతం బిర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఈ పాఠశాలతో పాటు మరో ఏడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బెదిరింపులు ఉత్తవేనని తనిఖీల అనంతరం పోలీసులు తేల్చారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకకపోవడంతో విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లోకి వెళ్లేందుకు అనుమతించారు. గతకొన్నిరోజులుగా ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ బ్రిటన్ ను వణికిస్తున్నాయి. తాజా ఉగ్రవాద బెదిరింపులు కూడా ఉత్తివేనని పోలీసులు తేల్చారు. -
'యూపీఏ కంటే మోదీ సర్కార్ మరింత నిర్లక్ష్యం'
న్యూఢిల్లీ: విద్యా, వైద్య రంగాలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కూడా విద్యా, వైద్యం, ఆరోగ్య రంగాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. అయితే, గత యూపీఏ ప్రభుత్వం కంటే కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రెండు రంగాలను మరింత నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశానికి చెందిన న్యూక్లియర్ ప్లాంట్లు చాలా ప్రమాదకరమని, కర్బన ఉద్ఘారాల నేపథ్యంలో పర్యావరణం దెబ్బతింటుందని ఆర్థికశాస్త్ర నిపుణుడు అమర్త్యసేన్ విచారం వ్యక్తం చేశారు. -
'బుల్లెట్లు కాదు.. పుస్తకాలందించండి'
లండన్: బుల్లెట్ల సమాజం నుంచి బయటపడటం ఒక్క విద్య ద్వారానే సాధ్యం అని పాకిస్థాన్ బాలికల అక్షర సాహసి, నోబెల్ బహుమతి విజేత యూసఫ్ జాయ్ మలాలా పేర్కొంది. ప్రపంచ నేతలంతా బుల్లెట్ల నుంచి దూరంగా జరిగి పుస్తకాలనే ఎంచుకోవాలని సూచించింది. 12 ఏళ్ల బాలికలందరికీ నిర్బంధ విద్యను అందించేలా కృషిచేయాల్సిందిగా ఆమె కోరింది. టెలిగ్రాఫ్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశిస్తూ మలాలా ఒక సంక్షిప్త సందేశాన్ని తెలియజేసింది. తానింకా టీనేజర్ అయినప్పటికీ ఒక బ్రహ్మాండమైన ఆశను కలిగి ఉన్నానని, పన్నెండేళ్ల లోపు బాలికలందరికి కచ్చితంగా ఉచిత విద్యను అందించగలమన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, అది ఎప్పుడు చేద్దామనే విషయంలో ప్రతిఒక్కరు ఒక అంతిమ ఆలోచనకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడిప్పుడే విద్యార్థినులు బడిబాట పడుతున్నారని, సెకండరీ విద్యకు చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోందని మలాలా గుర్తు చేసింది. అయితే, సెకండరీ స్థాయిలోనే విద్యను ఆపేసే బాలికలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయని, ఆ దేశాలు కూడా ఈ విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నాయని ఇది కాస్తంత గమనించాల్సిన విషయం అని మలాలా సూచించింది. -
మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు
ప్రపంచంలోనే అతి పిన్న వయసులో నోబెల్ శాంతిబహుమతిని గెలుచుకున్న పాకిస్థానీ బాలిక మలాలా యూసుఫ్జాయ్కి మరో అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఈసారి అమెరికా లిబర్టీ మెడల్ ఆమెను వరించింది. ఈ అవార్డు విలువ దాదాపు 61 లక్షల రూపాయలు. ఈ మొత్తాన్ని ఆమె పాకిస్థాన్‌లో చదువు కోసం విరాళంగా ఇచ్చింది. బాగా ధైర్యసాహసాలు చూపించిన వాళ్లకు లిబర్టీ మెడల్ ఇస్తారు. అపార ధైర్యసాహసాలు ప్రదర్శించి, కనీసం ప్రాథమిక మానవహక్కులు కూడా లభించని ప్రాంతంలో ఉన్న ప్రజలకోసం గళమెత్తి పోరాడినందుకు ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు అమెరికాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ (ఎన్సీసీ) ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మలాలా బ్రిటన్‌లో నివసిస్తోంది. 2012లో తాలిబన్లను ఎదిరించి ఆమె అంతర్జాతీయంగా ఒక్కసారిగా పేరుప్రఖ్యాతులు సంపాదించింది. -
ఉన్నట్లా? లేనట్లా?
దైవికం దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోవడమనే ఒకానొక మానవ అభాగ్యత నుండి పుట్టే నిస్పృహలోంచి, ఉంటే ఏదో ఒక రుజువుగానైనా ఎందుకు దర్శనమివ్వడు అన్న తొందరపాటు వాదన నుంచీ ఏర్పడేదే ఈ సంశయశీలత. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ కొలంబియా రచయిత. 87 ఏళ్ల వయసులో అనారోగ్యం వల్ల ఇటీవలే చనిపోయారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖులైన రచయితలలో ఒకరిగా ఆయనకు పేరు. నోబెల్ గ్రహీత. గట్టి అభిప్రాయాలు ఉన్న మనిషి. ధైర్యం కూడా ఎక్కువే. ఎంత ధైర్యం అంటే... తన దేశ రాజకీయ విధానాలను సైతం అయన బహిరంగంగానే విమర్శించేవారు. అంతటి మనిషి కూడా దేవుడి ఉనికి విషయంలో చివరి వరకు సంశయంగానే ఉండిపోయారు! ‘‘దేవుణ్ణి నమ్మను. కానీ దేవుడంటే భయపడతాను’’ అంటారు గార్షియా. బహుశా ఉన్నాడు అని నమ్మి ఉంటే, ఆయనకా భయం ఉండకపోయేదేమో. ఇంతకూ గార్షియాకు దేవుడంటే భయం దేనికి? రాజకీయ విధానాలను విమర్శించినట్లుగా... ఆ విధాత తలపుల గురించి కూడా తాను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడతానేమోనన్న భయమా? చెప్పలేం. అయితే ఆయన రాసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’, ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రియార్క్’ నవలల్ని గమనిస్తే దేవుడి ఉనికి పట్ల సందేహాలున్న వ్యక్తికి అంతటి ఊహాశక్తి (సృజన) ఎలా సాధ్యం అని కూడా అనిపిస్తుంది. మొత్తానికి గార్షియా అలా అనడం (దేవుణ్ణి నమ్మను. కానీ భయపడతాను అని)... మానవ స్వభావాలపై ఆయన పరిశీలనకు ఒక వ్యక్తీకరణ కావచ్చు. ఇదంతా కాదు, గార్షియాకు దేవుడు ఉన్నట్టా? లేనట్టా? ఏమో ఆయనే బతికొచ్చి చెప్పాలి. దేవుడిపై గార్షియాకు ఉన్న సంశయం లాంటిదే, గార్షియా లోని ‘యాగ్నాస్టిసిజం’పై మన సంశయం. యాగ్నాస్టిక్ అంటే దేవుడు ఉన్నాడని కానీ, లేడని కానీ విశ్వసించేవాడు కాదు. ఉన్నాడో లేదోనన్న సంశయంలో ఉన్నవాడు. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోవడమనే ఒకానొక మానవ అభాగ్యత నుండి పుట్టే నిస్పృహలోంచి, ఉంటే ఏదో ఒక రుజువుగానైనా ఎందుకు దర్శనమివ్వడు అన్న తొందరపాటు వాదన నుంచీ ఏర్పడేదే ఈ సంశయశీలత. దేవుణ్ని నమ్ముకున్న వారు సుఖంగా నిద్రపోతారు... ఆయన ఉన్నాడన్న నిశ్చింతతో. దేవుడు లేడనుకున్నవారు సుఖనిద్రకు ఏర్పాట్లు చేసుకుంటారు... ఎవరూ లేరన్న నిశ్చయంతో. ఇక మిగిలింది సంశయశీలురు. దేవుడు ఉన్నాడో లేడో తెలీక పక్కపై అటు ఇటు కదులుతుంటారు. తెల్లారుతుంది కానీ ఏదీ తేలదు. ‘తెల్లారడం’ దైవికం అని తెలుసుకునే వరకు సంశయం తొలగిపోదు. తెల్లారడం అంటే చీకటి చెదిరిపోయి, వెలుగు వ్యాపించడం ఒక్కటేనా? మౌనంగా, మాటమాత్రం లేకుండా జరిగిపోయేవి చాలా ఉంటాయి. చల్లని గాలికి నెమ్మదిగా ఊగే పచ్చటి చెట్లు, పరిమళాలు వెదజల్లే పూలు, మంచుతో తడిసిన గడ్డి.. అన్నీ తెల్లారడంలో భాగమే. అన్నీ చల్లని, స్వచ్ఛమైన దేవుడి రూపాలే. ప్రకృతిలోని ఈ దివ్యత్వాన్ని వీక్షించగలిగితే సంశయాలన్నీ వేకువ పిట్టల్లా ఎగిరిపోతాయి. సాయం సంధ్యలోకి మౌనంగా ఒరిగిపోయి చీకటిని వెలిగించే నక్షత్రాల నిశ్శబ్దం కూడా దైవమే నంటారు మదర్ థెరిస్సా. దైవాత్మను స్పృశించడానికి అలాంటి నిశ్శబ్దంలోకి, అలాంటి మౌనంలోకి మనసు లీనం అవ్వాలట. అప్పుడు ఎటు చూసినా దేవుడే దర్శనమిస్తాడని అంటారు మదర్. ఈ మాటనే మార్టిన్ లూథర్ కింగ్ ఇంకోలా చెప్పారు. ‘‘దేవుడు తన సువార్తను బైబిల్లో మాత్రమే రాయలేదు. చెట్లు, పూలు, మేఘాలు, నక్ష త్రాలన్నిట్లోనూ రాశారు’’ అని. అయినా సరే, మనకింకా సంశయం ఎందుకంటే దేవుడి ని మనం మనిషి రూపంలో మాత్రమే చూడాలనుకుంటున్నాం! - మాధవ్ శింగరాజు -
పరిశో‘ధనం’ లాభదాయకం
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర పరిశోధనలకు ఎందుకు ఎక్కువ నిధులు కేటాయిం చాలని మథనపడే రాజకీయవేత్తలు బోయింగ్ లాంటి అంతర్జాతీయ కంపెనీలను చూసి నేర్చుకోవాలని నోబె ల్ అవార్డు గ్రహీత ఒలివర్ స్మితీస్ వ్యాఖ్యానించారు. ఎంత ఎక్కువ పెట్టుబడులు పెడితే అంత ఎక్కువ లాభాలిచ్చే రంగం పరిశోధనలేనని ఆయన స్పష్టం చేశారు. పరి శోధనల ద్వారానే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని, తద్వారా కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని అన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) 26వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఒలివర్ స్మితీస్ ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘కొత్త ఆలోచనలు ఎలా వస్తాయన్న’ అంశంపై ఆయన యువ శాస్త్రవేత్తలనుద్దేశించి చేసిన ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. వ్యాధుల నిర్ధారణకు చవకైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు సీసీఎంబీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సంస్థ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు తెలిపారు. గత ఏడాది వ్యవస్థాపక దినోత్సవం తరువాత సీసీఎంబీలో చేపట్టిన కొత్త పరిశోధనల గురించి ఆయన వివరించారు. కిడ్నీ వ్యాధులను చవకైన పద్ధతుల్లో గుర్తించేం దుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు. వయోవృద్ధుల్లో కనిపించే అనేక సమస్యలకు పరిష్కారాలు వెతికేందుకు బయోఏజ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు.