నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్‌లో జరిగిన అహ్మదాబాద్ యూనివర్సిటీ 11వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆర్థికవేత్త ఇటీవల తన పశ్చిమ బెంగాల్ పర్యటన గురుంచి కొన్ని ఆసక్తికర విషయాల పంచుకున్నారు. భారతదేశంలోని ప్రజలు ఇంకా తీవ్రంగా బాధపడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 2019 స్థాయి కంటే తక్కువగా ఉందని అన్నారు. ప్రజల చిన్న కోరికలు కూడా తీర్చుకోలేక పోతున్నారని అన్నారు.
మీ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి గాని, కుటుంబం లేదా సమాజం ఒత్తిడికి గురికాకుండా ఉండాలని అన్నారు. మీ జీవితంలో నిజంగా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ధైర్యం కలిగి ఉండాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మన భారతదేశంలోని ప్రజలు ఇంకా తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన అన్నారు. "నేను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో కొంత సమయం గడిపాను. వారు చెప్పిన మాటలు వీని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. గ్రామీణ ప్రజలు చిన్న, చిన్న కోరికలు కూడా నెరవేర్చుకోలేకపోతున్నారు" అని బెనర్జీ అన్నారు.
"మనం చాలా బాధ అనుభవిస్తున్నాము నేను అనుకుంటున్నాను. ప్రస్తుత దేశం ఆర్థిక వ్యవస్థ 2019లో ఉన్న దానికంటే చాలా దిగువన ఉంది. ఎంత దిగువన ఉందో మాకు తెలియదు, కానీ ఇది చాలా తక్కువగా ఉంది అని నేను చెప్పగలను. ఈ విషయంలో నేను ఎవరినీ నిందించడం లేదు" అని ఆర్థికవేత్త చెప్పారు, 2019లో ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమర్లతో పాటు అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్యు)లో తను చదువుకుంటున్నప్పుడు తీహార్ జైలులో 10 రోజులు గడిపానని బెనర్జీ ప్రేక్షకులకు తెలియజేశారు. స్నాతకోత్సవం సందర్భంగా ప్రైవేట్ వర్సిటీకి చెందిన నలుగురు డాక్టరల్ విద్యార్థులతో సహా 833 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.
(చదవండి: మదుపరుల ఇంట కనకవర్షం కురిపిస్తున్న ఈ కంపెనీ స్టాక్స్!)
Comments
Please login to add a commentAdd a comment