ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగలు పడ్డారు. సామాజిక సేవకు గుర్తింపుగా ఆయనకు లభించిన విశిష్ట అవార్డు నోబెల్ బహుమతికి సంబంధించిన సర్టిఫికెట్‌ను ఎత్తుకెళ్లారు. ఆయన ఇంటిని దుండగులు చిన్నాభిన్నం చేసినట్లు కూడా తెలిసింది. అయితే, నోబెల్ బహుమతి ఆయన జాతికి అంకితం చేసిన నేపథ్యంలో అది ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌లో ఉన్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. సామాజిక ఉద్యమకారుడే అయినప్పటికీ కైలాస్ సత్యార్థి భారతీయ బాలలహక్కుల కోసం అమితంగా పోరాడే ప్రముఖ ఉద్యమకారుడు. ఆయన 1980లో బచ్‌పన్ బచావో ఆందోళన్ (బాల్యాన్ని కాపాడే ఉద్యమం) స్థాపించి, 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు.