'యూపీఏ కంటే మోదీ సర్కార్ మరింత నిర్లక్ష్యం'
న్యూఢిల్లీ: విద్యా, వైద్య రంగాలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కూడా విద్యా, వైద్యం, ఆరోగ్య రంగాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. అయితే, గత యూపీఏ ప్రభుత్వం కంటే కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రెండు రంగాలను మరింత నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశానికి చెందిన న్యూక్లియర్ ప్లాంట్లు చాలా ప్రమాదకరమని, కర్బన ఉద్ఘారాల నేపథ్యంలో పర్యావరణం దెబ్బతింటుందని ఆర్థికశాస్త్ర నిపుణుడు అమర్త్యసేన్ విచారం వ్యక్తం చేశారు.