ప్రవక్త మార్గం అనుసరణీయం
– లావుబాలీ దర్గా పీఠాధిపతి అబ్దుల్లా హుసేన్ బాద్‌షా ఖాద్రి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మహమ్మద్ ప్రవక్త మార్గం అనుసరణీయమని లావుబాలీ దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా అబ్దుల్లా హుసేన్ బాద్‌షా ఖాద్రి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక దర్గా ఆవరణలోని ఫైజానే లతీఫ్ మదరసాలో హిఫ్జ్ విద్యార్థులు, ఉర్దూ పాఠశాలల విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలపై ప్రసంగాలు నిర్వహించారు. మెరుగైన ప్రసంగాలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి మార్గం చూపారన్నారు. ఆయన అల్లా ఆదేశాలను ఆచరించి చూపిన గొప్ప ప్రవక్త అని కొనియాడారు. కార్యక్రమంలో దర్గా సజ్జాదే నషీన్ ఖల్ఫాయే అక్బర్ సయ్యద్‌షా హాషిం ఆరిఫ్‌పాషా ఖాద్రి, సయ్యద్‌షా అల్తాఫ్ హుసేని, సయ్యద్‌షా సుల్తాన్ మొహియుద్దీన్ హుసేని, మొయీజ్‌పాషా ఖాద్రి, సయ్యద్ షుజావుద్దీన్ అహ్మద్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.