Linux
-
ఈ కంప్యూటర్ ధర కేవలం రూ. 1000 మాత్రమే..!
సాధారణంగా ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ధర ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తాం..? సుమారు రూ. 15 వేల నుంచి 50 వేల వరకు ఉండే అవకాశం ఉంది. సదరు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కాన్ఫీగరేషన్ బట్టి ధర మారుతూ ఉంటుంది. కాగా బ్రియాన్ బెంచాఫ్ అనే ఒక డెవలపర్ కేవలం 15 డాలర్లకే(సుమారు రూ. 1000) (Minimum Viable Computer) కంప్యూటర్ను తయారు చేసి అందరితో ఔరా..! అన్పిస్తున్నాడు...అసలు ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది..ఇతర విషయాల గురించి తెలుసుకుందాం..! స్మార్ట్‌ఫోన్ సైజులో..! బ్రియాన్ తయారుచేసిన మినీ పాకెట్ సైజ్ కంప్యూటర్ ఇంచుమించు స్మార్ట్‌ఫోన్ సైజులో ఉంటుంది. ఇది ఒక Linux ఆపరేటింగ్ సిస్టమ్. దీనిలోని ఆల్విన్నర్ F1C100s సిస్టమ్-ఆన్-ఎ-చిప్‌తో అనుసంధానించబడిన సాధారణ రెండు-పొరల పవర్ కంట్రోల్ బోర్డ్‌ను (పీసీబీ)ను ఉపయోగించారు. అంతేకాకుండా సింగిల్ CPU కోర్ కేవలం 533MHz వద్ద క్లాక్ చేయబడింది. విశేషమేమిటంటే Linux కు చెందిన ఆధునిక సంస్కరణలను అమలు చేయడానికి మద్దతును కలిగి ఉంది. ఇది స్క్రిప్ట్‌లను, పింగ్ రిమోట్ సర్వర్లను అమలు చేయగలదు. వివిధ రకాల USB పరికరాలతో ఆపరేట్ చేయవచ్చును. ఫీచర్స్‌లో కంప్యూటర్స్‌తో సమానంగా..! బ్రియాన్ తయారుచేసిన ఈ లైనక్స్ కంప్యూటర్లో సాధారణ కంప్యూటర్లో ఉండే ఫీచర్స్ అన్ని ఉన్నాయి. 2.3-అంగుళాల డిస్ప్లేతో స్ప్లిట్ ఐదు-వరుసల ఆర్తోగోనల్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. ఈ కంప్యూటర్ స్క్రీన్ 240 x 320 రిజల్యూషన్‌ను కలిగి ఉంది అంతేకాకుండా ఇది టచ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. దీనిలో AAA NiMH సెల్‌ను అమర్చాడు. ఇతర పెరిఫెరల్స్ కోసం ప్రామాణిక USB-A పోర్ట్ ఉంది. Wi-Fi అడాప్టర్, కీబోర్డ్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కోసం యుటిలిటీ మద్దతు ఇచ్చే ఏదైనా ప్లగ్ ఇన్ చేయవచ్చు. అయితే, పరికరాన్ని ఛార్జ్ చేయడానికి USB-C పోర్ట్‌ను ఉపయోగించాలి. ఈ కంప్యూటర్ను తయారుచేయడానికి బ్రియాన్ కేవలం 14.16 డాలర్లను మాత్రమే ఖర్చు చేశాడు. ఈ ప్రాజెక్టును రియాలిటీగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విటర్లో పేర్కొన్నాడు. ఇతరుల సహాయంతో దీనిని మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని బ్రియాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. I designed the 'minimum viable computer', a full Linux computer that fits in your pocket. It costs $15.https://t.co/P7F3Re1mGw If you'd like to see more of this, please like, retweet, and share the above link in whatever forum or aggregator you frequent. pic.twitter.com/XzBSULz3El — VT-69 (@ViolenceWorks) January 26, 2022 చదవండి: మాస్కున్న ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు..కేవలం వారికి మాత్రమే..! -
క్లౌడ్ కంప్యూటింగ్‌లో సత్తా చాటనున్న ఐబీఎం
న్యూయార్క్ : టెక్నాలజీ దిగ్గజం ఐబిఏం క్లౌడ్ కంప్యూటింగ్‌లో అడుగుపెట్టేందుకు సాప్ట్వేర్ కంపెనీ రెడ్ హ్యట్ను 34బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్టు వెల్లడించింది. మెరుగైన లాభాలను ఆర్జిస్తూ వంద ఏళ్ల చరిత్ర ఉన్న రెడ్ హ్యట్ కంపెనీని గత ఏడాది ఐబిఏం కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. ఐబిఏం చీఫ్ ఎగ్జక్యూటివ్ గిన్ని రోమెట్టి సాంప్రదాయ హర్ఢ్వేర్ ఉత్పత్తులను తగ్గించి, వేగంగా అభివృద్ది చెందుతున్నసాప్ట్వేర్ సేవలపై, క్లౌడ్ కంప్యూటింగ్‌లపై దృష్టి పెట్టడంతో ఈ భారీ కొనుగోలుకు మార్గం సుగమమైంది. 63 శాతం ప్రీమియంతో రెడ్ హ్యట్ షేర్లను కొనుగోలు చేయడానికి జూన్ నెలఖారున ఈయు రెగ్యులేటర్లు, మే నెలలో యుఏస్ రెగ్యులేటర్లు ఐబిఏం ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. 1993లో స్థాపించిన రెడ్ హ్యట్ సంస్థ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ప్రత్యేకతను ఎర్పరుచుకుంది. ఇది మైక్రోసాప్ట్ కార్ప్చే తయారు చేయబడిన సాప్ట్‌వేర్‌కు కంటే భిన్నంగా ఉండి, ఓపెన్ సోర్స్ సాప్టవేర్గా లైనక్స్ అత్యంత ఆదరణ పోందింది. -
లినక్స్కు షాకిచ్చిన అధ్యయనం
న్యూయార్క్: లినక్స్ ఆపరేటింగ్ సిస్టంకు షాకిచ్చే అంశం తాజా అధ్యయనం వెల్లడైంది. హైజాకర్లు సులువుగా దాడిచేసేంత బలహీనంగా ఉందని ఓ స్టడీలో తేలింది. కాలిఫోర్నియాలో రివర్సైడ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ అధ్యయనంలో లైనక్స్ సాఫ్ట్ వేర్ లోపాన్ని గుర్తించారు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థి యో కావ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో లినక్స్ ఆపరేటింగ్ వ్యవస్థలోని ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ (టీసీపీ) బలహీనతను గుర్తించారు. తత్ఫలితంగా రిమోట్ తో ఇంటర్నెట్ కమ్యూనికేషన్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే ఈ మెయిల్స్ ను చేరవేసే ఈ టీసీపీ స్వీక్వెన్స్ నంబర్ల ద్వారానే ఎటాకర్లు దాడిచేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ లోపం ద్వారా ఆన్ లైన్ లో రెండవ వ్యక్తి కనెక్షన్ ని తొలగించి, తప్పు డు సమాచారాన్ని అవతలి వ్యక్తికి అందించే అవకాశం ఉందని హెచ్చరించారు. కేవలం 90 శాతం సక్సెస్ రేటుతో ఒక్క నిమిషంలోనే ఈ దాడి జరిగిపోవచ్చని పేర్కొన్నారు. దీనిపై లినక్స్ సంస్థను అప్రమత్తం చేశారు. ఇది లినక్స్ లేటెస్ట్ వెర్షన్ కూడా వర్తింస్తుందని హెచ్చరించారు. ఈ అధ్యయనాన్ని టెక్సాస్ లోని ఆస్టిన్, యూజ్ నిక్స్ భద్రతా సింపోసియం, ఈ వారంలో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. డేటాను ఒక సోర్స్ నుంచి సమాచారాన్ని బదిలీ చేయడానికి లీనక్స్ సహా ఇతర ఆపరేటింగ్ వ్యవస్థలు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ను వినియోగిస్తాయి. ఈ సమాచారం సరైన గమ్యానికి చేరిందో లేదో ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపి) ద్వారా నిర్ధారించుకుంటాయి. ఇద్దరు వ్యక్తులు ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు, టీసీపీ డేటా ను ప్రత్యేకమైన సీక్వెన్స్ నంబర్ల ద్వారా గుర్తించి, సందేశాన్ని చేరవేస్తుంది. అయితే దాదాపు నాలుగు బిలియన్లకు పైగా ఉన్న ఈ సీక్వెన్లను ఐడెంటిఫై చేయడం సాధ్యం కాదని పరిశోధకులు తెలిపారు. అలాంటిది లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లో టీసీపీ బలహీనంగా ఉన్నట్టు గుర్తించినట్టు తాజా అధ్యయనం రిపోర్టు చేసింది అయితే ఈ అధ్యయనంపై లినక్స్ సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.