
హైదరాబాద్ చందానగర్‌లోని బిగ్ ‘సి’ షోరూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంచలన మోడల్ ‘ఒప్పో ఎఫ్9 ప్రో’ మొబైల్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిగ్ ‘సి’ బ్రాండ్ అంబాసిడర్, సినీనటి రాశిఖన్నా సహా సంస్థ సీఎండీ బాలు చౌదరి, డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, జీ. బాలాజీ రెడ్డి, ఒప్పో సంస్థ ప్రతినిధులు పీటర్ (స్టేట్ హెడ్) యాంగల్ (సేల్స్ హెడ్) పాల్గొన్నారు.
మార్కెట్‌లో ఈ నెల 31 నుంచి ఒప్పో ఎఫ్9 ప్రో మొబైల్ లభ్యమవుతుంది. ధర రూ.23,990. బిగ్ ‘సి’ మొబైల్స్‌లో ‘ఒప్పో ఎఫ్9 ప్రో’ను ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు ఏడాదిపాటు స్క్రీన్ మార్పిడి వారంటీ, ఉచిత 3.2 జీబీ జియో ఇంటర్నెట్ ప్యాక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment