ఒప్పో ఎఫ్‌7 ధర తగ్గింది | Oppo F7 Gets Upto Rs.3000 Price Cut In India | Sakshi
Sakshi News home page

ఒప్పో ఎఫ్‌7 ధర తగ్గింది

Published Tue, Jul 10 2018 11:06 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Oppo F7 Gets Upto Rs.3000 Price Cut In India - Sakshi

ఒప్పో ఎఫ్‌7 స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి ఒప్పో తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఎఫ్‌7 పై ధర తగ్గించింది. గతేడాది 22,990 రూపాయలకు లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను 3 వేల రూపాయలు తగ్గించి, 19,990 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. కంపెనీ ధర తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్‌  కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,200 వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను అందించనున్నామని, నెలకు రూ.664 ఈఎంఐ ఆఫర్‌ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. యాక్సిస్‌ బ్యాంక్‌ బుజ్‌ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు తమ బుజ్‌ క్రెడిట్‌ కార్డుపై 5 శాతం తగ్గింపు, వీసా కార్డు యూజర్లకు తొలి మూడు ఆన్‌లైన్‌ పేమెంట్లపై 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఒప్పో ఎఫ్‌7 రెండు వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఒకటి 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, రెండు 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌. ధర తగ్గింపుతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు రూ.19,990కు, రూ.23,990కు లభ్యమవనున్నాయి.

ఒప్పో ఎఫ్‌7 ఫీచర్లు..
బెజెల్‌-లెస్‌ 6.23 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
టాప్‌లో కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌
ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌
మీడియాటెక్‌ హిలియో పీ60 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
25 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0
వెనుక వైపు 16 ఎంపీ షూటర్‌ విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
3,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement