oppo mobile
-
అదిరిపోయే టెక్నాలజీ తీసుకొచ్చిన ఒప్పో
చైనా: మొబైల్ తయారీదారులు వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీనీ తీసుకొస్తున్నారు. ఇప్పటీకే శామ్సంగ్ వంటి సంస్థలు మడతపెట్టే ఫోన్లను తీసుకొస్తుండగా. ఎల్జీ, షియోమీ వంటి సంస్థలు కూడా కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో ఒప్పో కూడా స్లైడ్-ఫోన్ టెక్నాలజీ కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పో జపాన్ కు చెందిన నెండో సంస్థతో కలిసి నాల్గవ చైనా ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డిజైన్ ఎక్స్పో (సిఐఐడిఇ)లో ఈ స్లైడ్-ఫోన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. (చదవండి: ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల పవర్ ఫుల్ గా ఐఫోన్ 12ప్రో) ఈ ‘స్లైడ్-ఫోన్’ చూడటానికి ట్రిపుల్-హింజ్ ఫోల్డబుల్ స్క్రీన్ తో ఉండి, పొడవుగా కనిపిస్తుంది. దీనిని పూర్తిగా మడిచినప్పుడు క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. మూడు మడతల్లో భాగంగా ఒక్కో మడతను ఓపెన్ చేసిన ప్రతిసారి స్క్రీన్ పరిమాణం 40 మిమీ పెరుగుతుంది. మొదటి స్క్రీన్ స్లైడ్ చేస్తే మీకు నోటిఫికేషన్లు, కాల్ హిస్టరీ, మ్యూజిక్ ప్లేయర్ వంటి వాటిని మనం గమనించవచ్చు. రెండవ సారి స్క్రీన్ స్లైడ్ చేస్తే సెల్ఫీలు తీసుకోవటానికి 80 మి.మీ డిస్ప్లే పరిమాణంలో తెరుచుకుంటుంది. మొత్తం స్క్రీన్‌ను స్లైడ్ చేస్తే మీకు గేమింగ్, మల్టీ-టాస్కింగ్ లేదా వీడియోలను చూడటానికి స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ పరిమాణాన్ని సగం వరకు తగ్గించవచ్చు. అలాగే ఈ మొబైల్ కి ఒకవైపు మ్యూజిక్ ప్లే/స్టాప్ ,మ్యూట్, వాల్యూమ్ షట్టర్ వంటి బటన్లు ఉన్నాయి. ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాధారణ ఛార్జింగ్ తో పాటు దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నట్లు ఒప్పో విడుదల చేసిన వీడియోలో తెలుస్తుంది. -
ఒప్పో ఎఫ్7 ధర తగ్గింది
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి ఒప్పో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎఫ్7 పై ధర తగ్గించింది. గతేడాది 22,990 రూపాయలకు లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను 3 వేల రూపాయలు తగ్గించి, 19,990 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. కంపెనీ ధర తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,200 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను అందించనున్నామని, నెలకు రూ.664 ఈఎంఐ ఆఫర్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. యాక్సిస్ బ్యాంక్ బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు తమ బుజ్ క్రెడిట్ కార్డుపై 5 శాతం తగ్గింపు, వీసా కార్డు యూజర్లకు తొలి మూడు ఆన్లైన్ పేమెంట్లపై 5 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఒప్పో ఎఫ్7 రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఒకటి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, రెండు 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. ధర తగ్గింపుతో ఈ రెండు స్మార్ట్ఫోన్లు రూ.19,990కు, రూ.23,990కు లభ్యమవనున్నాయి. ఒప్పో ఎఫ్7 ఫీచర్లు.. బెజెల్-లెస్ 6.23 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే టాప్‌లో కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ మీడియాటెక్ హిలియో పీ60 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ 25 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0 వెనుక వైపు 16 ఎంపీ షూటర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఇనార్భిట్ మాల్లో సురభి సందడి
మాదాపూర్ : జెంటిల్మెన్ సినిమా ఫేమ్ సురభి మాదాపూర్‌లోని ఇనార్భిట్ మాల్లో సందడి చేసింది. ఒప్పో మొబైల్ ఎఫ్–1 సెల్ఫీ ప్రొమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. వివిధ పోటీల ద్వారా గెలుపొందిన విజేతలకు మొబైల్స్‌ను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఫో మొబైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అమెజాన్ లో ఒప్పొ ఫోన్లు
హైదరాబాద్: భారత్‌లో ఆన్లైన్లో ఒప్పొ మొబైల్ ఫోన్లను అమెజాన్‌డాట్‌కామ్ విక్రయించనున్నది. ఈ మేరకు అమెజాన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఒప్పొ మొబైల్స్ ఇండియా సీఈవో టామ్ లూ ఒక ప్రకటనలో తెలిపారు. ఒప్పో ఎన్1, ఒప్పొ ఫైండ్ 7లతో సహా ఇప్పటివరకూ తాము భారత్‌లో విడుదల చేసిన అన్ని మొబైల్ ఫోన్లను అమెజాన్‌డాట్‌కామ్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. తాము ఇటీవల అందించిన ఒప్పొ ఫైండ్ 7, ఒప్పొ ఫైండ్ 7ఏ మొబైళ్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించారు. రూ.10,000 నుంచి రూ.40,000 రేంజ్లో కనీసం 10 మొబైళ్ల ఫోన్లను ఈ ఏడాది చివరికల్లా అందించనున్నామని పేర్కొన్నారు. ఏడాది కాలంలో సర్వీస్ సెంటర్ల సంఖ్యను 200కు విస్తరిస్తామని వివరించారు. ఒప్పొతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందని అమెజాన్ ఇండియా డెరైక్టర్(మేనేజ్మెంట్) సమీర్ కుమార్ పేర్కొన్నారు.