
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి స్మార్ట్‌ఫోన్ రెడ్ మి నోట్ 5కి షాకిచ్చేలా ఒప్పో రియల్ మి 2 మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లోకి రాబోతోంది. మాతృ సంస్థ దాని చీలిక తరువాత, రియల్ మీ రెండవ స్మార్ట్ ఫోన్‌నులాంచ్ చేయబోతోంది. తొలి మొబైల్‌గా రియల్ మి 1 డివైస్ భారీ విక్రయాలనున మోదు చేయగా దీనికి సక్సెసర్‌గా రియల్ మి2ను వచ్చేవారం విడుదల చేయనుంది. ఆగస్టు 28న జరగనున్న ఈ కార్యక్రమానికి కంపెనీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. డ్యుయల్ రియర్ కెమెరాలు, నోచ్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేషియల్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్లుగా రియల్ మి 2ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇక దీని ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి.
6.23 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
19:9 యాస్పెక్ట్ రేషియో
మీడియా టెక్ హీలియో పీ60
1080 x 2280 పిక్సెల్స్ రిజల్యూషన్
16+2ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్
4230ఎంఎహెచ్ బ్యాటరీ
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.10వేల లోపే నిర్ణయించవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment