సాక్షి, ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అనేక రూమర్లు, లీకేజీ తరువాత 5జీ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. క్వాడ్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ , వూక్ ఫ్లాష్ ఛార్జ్ 4.0.90 హెర్ట్జ్ డిస్‌ప్లే ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కాగా ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ 2 సిరీస్‌లో ఇది నాలగవది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ ఇప్పటికే లాంచ్ చేసింది. వీటి ధరలు దాదాపు లక్ష రూపాయలుగా ఉంచిన సంగతి తెలిసిందే. (బీఎండబ్ల్యూ సూపర్ బైక్స్ లాంచ్)
ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో ఫీచర్లు
6.5-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
2400 x 1080 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10-బేస్డ్ కలర్ ఓఎస్ 7
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి సాక్
12 జీబీ ర్యామ్ 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
48+13+ 8+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
44 మెగాపిక్సెల్ సెల్పీకెమెరా
4025 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
ధర : సుమారు రూ. 58,000
Comments
Please login to add a commentAdd a comment