అరిచేతిలో ఒదిగిపోయిన ఆధునిక టెక్నాలజీ | smart technology thrives in 2014 year | Sakshi
Sakshi News home page

అరిచేతిలో ఒదిగిపోయిన ఆధునిక టెక్నాలజీ

Published Sun, Dec 28 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

అరిచేతిలో ఒదిగిపోయిన ఆధునిక టెక్నాలజీ

అరిచేతిలో ఒదిగిపోయిన ఆధునిక టెక్నాలజీ

టెక్నాలజీ.. 2014 సంవత్సరంలో సరికొత్త మలుపులు తిరిగింది. స్మార్ట్ఫోన్లు ఈ సంవత్సరమే రాజ్యమేలాయి. ఇంతకుముందు కూడా కొంతవరకు ఉన్నా.. ఈసారి మరింత వేగంగా జనంలోకి చొచ్చుకెళ్లాయి. ఫలితంగా మొబైల్ ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది. రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు రావడం, అవి కూడా చవక ధరల్లో అందుబాటులోకి రావడంతో ఎక్కువమంది వీటివైపు మొగ్గు చూపారు. ఇక ధర ఎంతైనా.. బ్రాండు పేరు, అందులో ఫీచర్లు బాగుంటే చాలు.. కొత్తదానికీ బోలెడంత ఆదరణ లభించింది. కేవలం ఫోన్లు మాత్రమే కాదు.. గూగుల్ గ్లాస్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ లాంటి సరికొత్త పరికరాలు టెక్నాలజీ ప్రియులకు పండగ చేశాయి. స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం పెరగడంతో బ్యాటరీ బ్యాకప్ కోసం పవర్ బ్యాంకులు కూడా బాగా అమ్ముడయ్యాయి... ఈ ఏడాది ఎక్కువగా ఆదరణ పొందిన కొన్ని పరికరాలు.. వాటి వివరాలు చూద్దాం.

ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్
యాపిల్ సంస్థ విడుదల చేసిన ఈ రెండు ఫోన్లు మార్కెట్లను విపరీతంగా ముంచెత్తాయి. వీటికోసం జనం స్టోర్ల వద్ద క్యూలు కట్టారు. ఇంతకుముందు వచ్చిన యాపిల్ ఫోన్ల కంటే ఇవి కొంత పెద్దవి, వేగంగా పనిచేశాయి. ఐఫోన్ 6 సుమారు రూ. 53,500, 6 ప్లస్ అయితే 80,500 వరకు వెళ్లాయి.

యాపిల్ వాచ్
యాపిల్ సంస్థ కొత్త వాచీని విడుదల చేసింది. ఇది కేవలం సమయాన్ని చూపించడమే కాదు.. దాన్ని ధరించినవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడి, వారిని ఫిట్గా ఉంచుతుంది. ఇది కొత్త ఐఫోన్లతో పాటు వస్తుంది. దీనికి మాగ్నెటిక్ ఛార్జర్ ఉంటుంది. ఆరోగ్య, ఫిట్నెస్ యాప్లు ఉంటాయి. అంతేకాదు.. ఇది సమయం కూడా చూపిస్తుంది..



యాపిల్ ఐఓఎస్ 8
యాపిల్ పరికరాలన్నింటికీ ఉపయోగపడే ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేశారు. కొత్తగా వచ్చిన ఐఓఎస్ 8 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను సెప్టెంబర్ 17న విడుదల చేశారు. ఐప్యాడ్లలో స్క్రీన్ను రెండుగా విభజించడం దీని ప్రత్యేకత. అయితే.. దీనివల్ల డివైజ్లు బాగా స్లో అయ్యాయన్న ఫిర్యాదు కూడా వచ్చింది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్4
భారతీయ మార్కెట్లలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఫాబ్లెట్ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4 కూడా ఈ ఏడాదే విడుదలైంది. దీపావళికి వచ్చిన ఈ గాడ్జెట్ ఖరీదు రూ. 58,300. ఇందులో ఆటో సెల్ఫీల లాంటి అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఇది యాపిల్ ఐఫోన్ 6, 6ప్లస్ పరికరాలతో పోటీపడింది. ఇందులో 16 మెగాపిక్సెల్స్ వెనక కెమెరా, 3.7 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.



మోటరోలా మోటో జి
సెల్ఫోన్లను భారత దేశంలో తొలినాళ్లలోనే తెచ్చిన మోటరోలా కంపెనీ తాజాగా మోటో జి ఫోన్ విడుదల చేసింది. ఇందులో 4.5 అంగుళాల డిస్ప్లే, గీతలు పడని గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్, క్వాడ్ కోర్ 1.2 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్ ఉన్నాయి.

గూగుల్ ఆండ్రాయిడ్ వన్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్లలో విడుదల చేసింది. దీని ధర రూ. 6,399. తక్కువ ధరలోనే ఫ్రంట్ కెమెరా కూడా అందించడం దీని ప్రత్యేకత. 1 జిబి మెమొరీ, క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ దీని ప్రధాన ఫీచర్లు. డ్యూయల్ సిమ్, ఎఫ్ఎం రేడియో కూడా ఉన్నాయి.



నోకియా లూమియా 525
ఏడాది క్రితం తొలిసారిగా విండోస్ ఓఎస్తో నోకియా సంస్థ లూమియా 520ని విడుదల చేసింది. అప్పటికి అది చాలా హిట్టయింది. కానీ, అందులో కేవలం 512 ఎంబీ ర్యామ్ ఉండటంతో తర్వాత చాలామంది దూరమయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని లూమియా 525ను జనవరిలో విడుదల చేశారు. బ్రహ్మాండమైన బ్యాటరీ, మెరుగైన ర్యామ్తో ఇది వచ్చింది. 10వేల రేంజిలో ఈ ఫోన్లు బాగా అమ్ముడయ్యాయి.  



గూగుల్ నెక్సస్ 6, 9, ఆండ్రాయిడ్ లాలీపాప్
గూగుల్ తన ఆండ్రాయిడ్ పేర్లన్నీ తినే పదార్థాలవే పెడుతుంది. అలాగే కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్కు లాలీపాప్ అని పెట్టి అక్టోబర్ 17న విడుదల చేసింది. జెల్లీబీన్ తర్వాత ఇది వచ్చింది. అలాగే, యాపిల్తో పోటీగా తన నెక్సస్ ఫోన్లను కూడా గూగుల్ తెచ్చింది. అయితే నెక్సస్ సిరీస్లో వచ్చిన రెండు మోడళ్లను రెండు వేర్వేరు కంపెనీలు తయారుచేశాయి.



అమెజాన్ ఫైర్ ఫోన్
అమెజాన్ సంస్థ తన 'ఫైర్ ఫోన్' అనే హై ఎండ్ హ్యాండ్ సెట్ను విడుదల చేసింది. ఇది టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ అని చెప్పుకొంది. ఇది యాపిల్, శాంసంగ్ ఫోన్లకు దీటుగా మార్కెట్లోకి వచ్చింది. దీనికి హెచ్డీ కెమెరా ఉంది.

ప్లే స్టేషన్ 4
సోనీ సంస్థ విడుదల చేసే ప్లే స్టేషన్లంటే పిల్లలకు చెప్పలేనంత మోజు. ఈ సిరీస్లో ప్లే స్టేషన్ 4 జపాన్లో ఫిబ్రవరి 22న విడుదలైంది. ఇంతకు ముందు మోడళ్లతో పోలిస్తే నాజూగ్గా ఉండి.. తేలిగ్గా ఉండటంతో జనం కూడా బాగానే ఆదరించారు. దీనికి కొత్త డ్యూయల్ షాక్4 కంట్రోలర్ ఉండటంతో అందరికళ్లూ వెంటనే పడ్డాయి. ఇప్పటివరకు వచ్చిన ప్లే స్టేషన్ కంట్రోలర్లలో ఇదే టాప్.



ఎక్స్ బాక్స్ వన్
మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన గేమింగ్ కన్సోల్ ఎక్స్ బాక్స్ వన్. ఇది ఆసియాలో అధికారికంగా సెప్టెంబర్ నెలలో విడుదలైంది. దీని ధర రూ. 39,990. దీనికి వైర్లెస్ కంట్రోలర్ ఉంది. కొత్త వినియోగదారులకు ఎక్స్ బాక్స్ లైవ్ గోల్డ్ను 14 రోజుల ట్రయల్ ఆఫర్ను కూడా ఇచ్చారు. ఇందులో బ్లూరే డిస్క్ డ్రైవ్ ఉంది. కేవలం చేతులు ఊపడం ద్వారా కూడా ఇందులో ఆటలు ఆడచ్చు.

సోనీ ఎక్స్పీరియా జడ్3 కాంపాక్ట్
సోనీ తన ఎక్స్పీరియా సిరీస్లో జడ్2ను విడుదల చేసిన తర్వాత దానికంటే మరింత నాజూగ్గా జడ్3ని సెప్టెంబర్లో విడుదల చేసింది. దాని ధర రూ. 44వేలు. పాతదానికంటే చిన్న సైజులో ఉండటం, మెరుగైన బ్యాటరీ లైఫ్, మెరుగైన కనెక్టివిటీ దీని ప్రత్యేకతలు.

బ్లాక్బెర్రీ పాస్పోర్ట్
బ్లాక్బెర్రీ సిరీస్లో ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లలోకీ ఎక్కువ ఫీచర్లున్నది.. పాస్పోర్ట్. దీని ధర రూ. 45,777. ఇందులో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజి, 3 జిబి ర్యామ్, క్వాడ్ కోర్ 2.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ ఉన్నాయి. ఇక బ్లాక్బెర్రీ అనగానే గుర్తుకొచ్చే అనేక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

నోకియా లూమియా 830
మంచి స్టైలుతో.. అల్యూమినియం ఫినిష్తో వచ్చిన నోకియా లూమియా 830 ఈ సిరీస్లో వచ్చిన వాటిలో అన్నింటికంటే అత్యాధునికమైనది. దీనికి మంచి మెటల్ బటన్లు కూడా పెట్టారు. దాంతో చూసేందుకు చాలా అందంగా కనపడింది. దీని ధర సుమారు రూ. 25వేలు. నోకియా మాత్రమే కావాలనుకునేవాళ్లు.. దీన్ని అందిపుచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement