టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వాట్సాప్ ప్రజల జీవితంలో ఓ భాగమైపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా వ్యక్తిగత అవసరాల కోసం, వ్యాపార కార్యకలాపాల కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలో 35 మొబైల్ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు. దీనికి కారణం ఏంటి? జాబితాలో ఏఏ ఫోన్‌లు ఉన్నాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.
యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. అయితే కొన్ని స్మార్ట్‌ఫోన్స్ మాత్రం ఈ అప్డేట్స్ పొందలేవు. ఇందులో ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్, యాపిల్ ఐఫోన్ ఐఓఎస్ 12 వెర్షన్ మొదలైనవి ఉన్నాయి. ఇలాంటి వాటిలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది.
జాబితాలోని ఫోన్‌లు
►శాంసంగ్: గ్యాలక్సీ ఏస్ ప్లస్, గ్యాలక్సీ కోర్, గ్యాలక్సీ ఎక్స్‌ప్రెస్2, గ్యాలక్సీ గ్రాండ్, గ్యాలక్సీ నోట్ 3, గ్యాలక్సీ ఎస్3 మినీ, గ్యాలక్సీ ఎస్4 యాక్టీవ్, గ్యాలక్సీ ఎస్4 మినీ, గ్యాలక్సీ ఎస్4 జూమ్
►మోటోరోలా: మోటో జీ, మోటో ఎక్స్
►యాపిల్: ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ
►హువావే: అసెండ్ పీ6 ఎస్, అసెండ్ పీ6 ఎస్, అసెండ్ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625
►లెనోవో: లెనోవా 46600, లెనోవా ఏ8580, హువావే ఏ85870
►సోనీ: ఎక్స్‌పీరియా జెడ్1, ఎక్స్‌పీరియా ఈ3
►ఎల్‌జీ: ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7
Comments
Please login to add a commentAdd a comment