ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలు | World Smallest Vacuum Cleaner Using A Pen | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలు

Published Sat, Sep 7 2024 9:46 AM | Last Updated on Sat, Sep 7 2024 1:33 PM

World Smallest Vacuum Cleaner Using A Pen

ఎవరూ చేయలేని అద్భుతాలు చేసినప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది. 23 ఏళ్ల విద్యార్థి 'తపాలా నాదముని' బాల్‌పాయింట్ పెన్‌ భాగాలను ఉపయోగించి ఒక వాల్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్ కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది.

చిన్నప్పటి నుంచే గాడ్జెట్‌లను తయారు చేయడం పట్ల అభిరుచి కలిగిన నాదముని 2020లో 0.69 ఇంచెస్ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ రూపొందించారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దానికంటే 0.07 ఇంచెస్ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. దీనిని తయారు చేయడానికి 8 నెలల సమయం రూ. 20000 డబ్బు ఖర్చు అయినట్లు సమాచారం.

ఈ చిన్న వ్యాక్యూమ్‌ క్లీనర్‌లో రివాల్వింగ్ ఫ్యాన్, ఫోర్-వోల్ట్ వైబ్రేషన్ మోటారును ఉపయోగించారు. ఇది సులభంగా దుమ్ము కణాలను సేకరిస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్‌ తయారీకి కొన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బిట్స్, మెటల్ కూడా ఉపయోగించినట్లు నాదముని పేర్కొన్నారు.

 ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలు

నాదముని రూపొందించిన ఈ చిన్న ఆవిష్కరణలే.. అతన్ని సూక్ష్మ ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామిగా నిలిపాయని పేర్కొన్నారు. దీనిని చూసి కాలేజీలోని విద్యార్థులందరూ ఆశ్చర్యపోతున్నారని, అధ్యాపకులు అభినందిస్తున్నారని నాదముని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement