ఇళ్లల్లో సాధారణంగా ఉపయోగించే వాక్యూమ్ క్లీనర్లు చాలా పెద్దగా ఉంటాయి. నేరుగా ఎలక్ట్రిక్ కనెక్షన్‌తో పనిచేసేవి కొన్ని, రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు కొన్ని. ఇవి నేలను శుభ్రం చేయడానికి బాగా పనికొస్తాయి.
వంటింటిని శుభ్రం చేయడానికి ఇవి అంత అనువైనవి కాదు. మహా అయితే, ఇవి వంటింట్లోని నేలను మాత్రమే శుభ్రం చేయగలవు. ఇలాంటి వాక్యూమ్ క్లీనర్లు ఇంట్లో ఉన్నా, స్టవ్ పెట్టుకునే ప్లాట్‌ఫామ్, వాష్‌బేసిన్, డైనింగ్ టేబుల్ మీద పడిన చెత్తను తొలగించాలంటే చేతికి పని చెప్పక తప్పదు.
అమెరికన్ కంపెనీ బ్రిగీ చేతిలో ఇమిడిపోయే మినీ వాక్యూమ్ క్లీనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది వంటింటి అవసరాలకు పూర్తిగా అనువైనది. స్టవ్ ప్లాట్‌ఫామ్ మీద, డైనింగ్ టేబుల్స్ మీద పడిన చెత్తను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాదు, మంచాల మీద, సోఫాల మీద పడిన చెత్తను కూడా క్షణాల్లో తొలగించి, శుభ్రం చేస్తుంది. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బరువు 375 గ్రాములు మాత్రమే! దీనిలోని మూడంచెల ఫిల్టర్ సిస్టమ్ సూక్షా్మతి సూక్ష్మమైన చెత్త కణాలను కూడా సునాయాసంగా తొలగించగలదు. దీని ధర 69.99 డాలర్లు (రూ.5,825) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment