ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. చైనాతో పోటీ పడేందుకు కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలని ఓపెన్ఏఐ పిలుపునిచ్చింది. దీనికోసం యూఎస్.. దాని మిత్రదేశాలు కలిసి పనిచేయాలని కోరింది. వాషింగ్టన్‌లో జరిగిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఓపెన్‌ఏఐ కొత్త పాలసీ బ్లూప్రింట్‌లో ఈ ప్రతిపాదన వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా తన ఆధిక్యాన్ని ఎలా కొనసాగించగలదో ఓపెన్ఏఐ వివరించింది. ఇదే జరిగితే యూఎస్ మిత్ర దేశాలు లేదా భాగస్వాములు గ్లోబల్ నెట్‌వర్క్ కూడా పెరుగుతుంది. చైనా నుంచి మన దేశాన్ని, మిత్ర దేశాలను రక్షించుకోవడానికి ఏఐ ఆవశ్యకతను కూడా ఓపెన్ఏఐ వెల్లడించింది.
దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏఐ ఓ అద్భుతమైన అవకాశం అని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఏఐను అందించడం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడం వంటివి కూడా ఏఐ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్‌వర్డ్‌లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!
ఏఐను అభివృద్ధి చేయడానికి అవసరమైన చిప్స్, పవర్, డేటా సెంటర్ల సరఫరాను విస్తరించేందుకు ఓపెన్ఏఐ గతంలో కూడా ప్రయత్నించింది. దీనికోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్‌మాన్ యూఎస్ అధికారులతో సమావేశమై ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐను అభివృద్ధి చేయడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి అగ్రరాజ్యంలో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment