vacuum cleaner
-
ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలు
ఎవరూ చేయలేని అద్భుతాలు చేసినప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది. 23 ఏళ్ల విద్యార్థి 'తపాలా నాదముని' బాల్‌పాయింట్ పెన్ భాగాలను ఉపయోగించి ఒక వాల్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్ కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.చిన్నప్పటి నుంచే గాడ్జెట్లను తయారు చేయడం పట్ల అభిరుచి కలిగిన నాదముని 2020లో 0.69 ఇంచెస్ వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దానికంటే 0.07 ఇంచెస్ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. దీనిని తయారు చేయడానికి 8 నెలల సమయం రూ. 20000 డబ్బు ఖర్చు అయినట్లు సమాచారం.ఈ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌లో రివాల్వింగ్ ఫ్యాన్, ఫోర్-వోల్ట్ వైబ్రేషన్ మోటారును ఉపయోగించారు. ఇది సులభంగా దుమ్ము కణాలను సేకరిస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ తయారీకి కొన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బిట్స్, మెటల్ కూడా ఉపయోగించినట్లు నాదముని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలునాదముని రూపొందించిన ఈ చిన్న ఆవిష్కరణలే.. అతన్ని సూక్ష్మ ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామిగా నిలిపాయని పేర్కొన్నారు. దీనిని చూసి కాలేజీలోని విద్యార్థులందరూ ఆశ్చర్యపోతున్నారని, అధ్యాపకులు అభినందిస్తున్నారని నాదముని వెల్లడించారు. -
చేతిలో ఇమిడిపోయేలా.. వంటింటికి పనికొచ్చే వాక్యూమ్ క్లీనర్
ఇళ్లల్లో సాధారణంగా ఉపయోగించే వాక్యూమ్ క్లీనర్లు చాలా పెద్దగా ఉంటాయి. నేరుగా ఎలక్ట్రిక్ కనెక్షన్‌తో పనిచేసేవి కొన్ని, రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు కొన్ని. ఇవి నేలను శుభ్రం చేయడానికి బాగా పనికొస్తాయి. వంటింటిని శుభ్రం చేయడానికి ఇవి అంత అనువైనవి కాదు. మహా అయితే, ఇవి వంటింట్లోని నేలను మాత్రమే శుభ్రం చేయగలవు. ఇలాంటి వాక్యూమ్ క్లీనర్లు ఇంట్లో ఉన్నా, స్టవ్ పెట్టుకునే ప్లాట్‌ఫామ్, వాష్‌బేసిన్, డైనింగ్ టేబుల్ మీద పడిన చెత్తను తొలగించాలంటే చేతికి పని చెప్పక తప్పదు. అమెరికన్ కంపెనీ బ్రిగీ చేతిలో ఇమిడిపోయే మినీ వాక్యూమ్ క్లీనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది వంటింటి అవసరాలకు పూర్తిగా అనువైనది. స్టవ్ ప్లాట్‌ఫామ్ మీద, డైనింగ్ టేబుల్స్ మీద పడిన చెత్తను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాదు, మంచాల మీద, సోఫాల మీద పడిన చెత్తను కూడా క్షణాల్లో తొలగించి, శుభ్రం చేస్తుంది. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బరువు 375 గ్రాములు మాత్రమే! దీనిలోని మూడంచెల ఫిల్టర్ సిస్టమ్ సూక్షా్మతి సూక్ష్మమైన చెత్త కణాలను కూడా సునాయాసంగా తొలగించగలదు. దీని ధర 69.99 డాలర్లు (రూ.5,825) మాత్రమే! -
సెల్ఫ్ క్లీనింగ్ రోబో వాక్యూమ్ క్లీనర్ - ధర ఎంతో తెలుసా?
విద్యుత్తుతో పనిచేసే వాక్యూమ్ క్లీనర్లు ఇప్పటికే చాలా చోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రోబో వాక్యూమ్ క్లీనర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రోబో వాక్యూమ్ క్లీనర్లు గదిలోని చెత్తను పూర్తిగా తొలగించాక, వాటిలోని అర చెత్తతో నిండిపోతోంది. ఆ చెత్తను మనం తొలగించాల్సి ఉంటుంది. అయితే, చైనీస్ హైటెక్ కంపెనీ ‘జియావోమీ’ ఇటీవల సెల్ఫ్ క్లీనింగ్ రోబో వాక్యూమ్ క్లీనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘రోబోరాక్ ఎస్7 మాక్స్ అల్ట్రా’ పేరుతో తెచ్చిన ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ గదిలోని చెత్తను తొలగించాక, తనను తాను శుభ్రం చేసుకుంటుంది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) ఇందులోని సెన్సర్లు గదిలోని చెత్తను రకాల వారీగా గుర్తించి, అందుకు అనుగుణంగా పనిచేస్తాయి. సూక్ష్మమైన ధూళికణాలను కూడా ఏరివేసేందుకు ఇవి దోహదపడతాయి. గదిలో అడ్డదిడ్డంగా వస్తువులు పడి ఉంటే, అడ్డంకులను దాటుకుని మరీ ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ పనిచేస్తుంది. దీని ధర 1299 డాలర్లు (రూ.1,06,581). -
టెక్...టాక్
వివో వి27 ప్రో సైజ్: 6.78 అంగుళాలు బరువు: 182 గ్రా. మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్ 256జీబి 8జీబి ర్యామ్ 256జీబి 12జీబి ర్యామ్ డిస్ప్లే: 1080“2400 పిక్సెల్స్ ఫీచర్స్: డ్యూయల్–ఎల్ఈడీ ఫ్లాష్ వోఎస్: ఆండ్రాయిడ్ 13, ఫన్‌టచ్ 13 కలర్స్: బ్లాక్, మింట్ రీయూజబుల్ నోట్‌బుక్ పేపర్ వృథా కాకుండా రూపొందించిన ఎకో–ఫ్రెండ్లీ రీయూజబుల్ నోట్‌బుక్ ఇది. బ్రాండ్: రాకెట్ సైజ్: 8.5“9.5 పేజీలు: 82 ► పైలట్ ఫ్రిక్సియన్ పెన్ డెస్క్‌టాప్ వాక్యూమ్ క్లీనర్ బ్రాండ్: రెమ ఎక్స్ఎక్స్ ఫిల్టర్టైప్: ఫోమ్ ► మల్టీపుల్: డెస్క్‌టాప్, లాప్టాప్...మొదలైనవి. ►హైస్పీడ్ సెంట్రెఫిగల్ ఫ్యాన్ ► ఫామ్ ఫ్యాక్టర్: హ్యాండ్ హెల్డ్ -
అరె..! ఇది వాక్యూమ్ క్లీనరా..మనిషి చేసే పనులన్నీ ఇదే చేస్తుందే..!
అమెరికన్ కంపెనీ అంకర్ అదిరిపోయే రోబోట్ వాక్యూమ్ 'రోబోవాక్ జి ఎక్స్ 8' హైబ్రిడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏఐ మ్యాప్ 2.0 టెక్నాలజీతో మనిషి చేసే పనులన్నింటిని ఇదే చేస్తుంది. రోబోవాక్ జి ఎక్స్ 8 ఫీచర్లు ఇళ్లలోని జంతు ప్రేమికులకు మరింత సౌకర్యంగా రోబోవాక్ జి ఎక్స్ 8 గా ఉండనుంది. ఇందులో ఉండే ఐపాత్ లేజర్ నావిగేషన్, ట్విన్ టర్బైన్ టెక్నాలజీ అండ్ వైఫై ఫీచర్లు ఇంటిని క్లీన్ చేసే సమయంలో అడ్డంగా ఉన్న మూగజీవాల్ని తప్పుకొని వెళ్లిపోతుందని అంకర్ ప్రతినిధులు తెలిపారు. గుండ్రంగా ఉండే రోబోవాక్ జి ఎక్స్ 8 ఇంట్లో మనుషులు శుభ్రం చేయలేని ప్రాంతాల్ని సులభంగా చేరుకుంటుంది. ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తుంది. ధర ఎంతంటే..? అల్ట్రా-ప్యాక్ డస్ట్-కంప్రెషన్ టెక్నాలజీ డస్ట్ బాక్స్ వాల్యూమ్ వినియోగాన్ని పెంచుతుంది. తద్వారా మునుపెన్నడూ లేనంతగా ఎక్కువ డస్ట్‌ను సేకరిస్తుంది. డస్ట్ తక్కువగా ఉన్నప్పుడు దాని వేగాన్ని తగ్గిస్తుంది. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ను మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సిన పనిలేకుండా నో గో జోన్ , మల్టీ ఫ్లోర్ మ్యాపింగ్ తో పనిచేస్తుంది. పెట్ హెయిర్ క్లీనింగ్, టూ-ఇన్-వన్ వాక్యూమ్, మ్యాపింగ్ 2000పీఏ ఎక్స్2 సెక్షన్ పవర్‌తో లేజర్ నావిగేషన్ ఫీచర్లు ఉన్నాయి. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. ధర రూ. 34,999/- 12 నెలల వారంటీతో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. -
వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్ధ రియల్మీ భారత మార్కెట్లో మరింత పురోగతిని సాధించేందుకు గృహోపకరణాల రంగంలోకి అడుగుపెట్టింది. గృహోపకరణాల విభాగంలో ప్రముఖ చైనీస్ సంస్ధ షావోమీ ఇప్పటికే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షావోమీ పోటీగా భారత మార్కెట్లలోకి వాషింగ్మెషిన్లను, వాక్యూమ్ క్లీనర్స్‌ను, ఎయిర్ ఫ్యూరిఫైయర్, రోబోట్ వాక్యూమ్ గృహోపకరణాలను రియల్మీ లాంచ్చేసింది. చదవండి: AI స్వగతం: తప్పులు లేకుండా చెప్పే యాంకర్లు.. రైటర్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో కొనుగోలుదారులకు ఈ ఉపకరణాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ గృహోపకరణాలను లాంచ్ సందర్భంగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్, రియల్మీ ఇండియా, యూరోప్, అండ్ లాటిన్ సీఈవో మాధవ్ సేత్ మాట్లాడుతూ..‘భారతీయులకు టెక్లైఫ్ను అందించేందుకు రియల్మీ ఎప్పుడు ముందుఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ హోమ్ కేటగిరీని మెరుగుపరుస్తూ..భారత్‌లో రియల్మీ నెం.1 లైఫ్‌స్టైల్, టెక్లైఫ్ బ్రాండ్‌గా నిలిచేందుకు కంపెనీ కృషి చేస్తోంద’ని వెల్లడించారు. రియల్మీ గృహోపకరణాల ధరలు ఇలా ఉన్నాయి..! రియల్మీ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 1000 తగ్గింపు వర్తించనుంది. రియల్మీ హ్యండ్హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 500 తగ్గింపు వర్తించనుంది. రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ ధర రూ .24,999 అయితే ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది రూ .19,999 కే విక్రయించబడుతుంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో రియల్మీ రెండు కొత్త టాప్-లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లను కూడా విడుదల చేసింది. వాషింగ్ మెషీన్ల ధర రూ .12,990(7.5 కిలోలు ), రూ .15,990(8 కిలోలు). చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! -
బుల్లి వ్యాక్యూమ్ క్లీనర్.. గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు
కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం గ్రామానికి చెందిన చుండూరు పవన్‌కుమార్ అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించాడు. దీన్ని వెర్నియర్ కాలిపర్స్‌తో కొలవగా 1.1 సెం.మీ. పొడవు, 1 సెం.మీ. వెడల్పుతో ఉంది. దీని తయారీలో మైక్రో మోటార్, ఇంజక్షన్ సిరంజి, ఫ్యాన్ రెక్కల కోసం కోక్ టిన్ ముక్కలు, బ్యాటరీలు ఉపయోగించినట్లు పవన్ తెలిపారు. గతంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి 1.4 సెం.మీ పొడవుతో వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేసినట్లు చెప్పారు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం పేర్కొన్నారు. -
రియల్ మీ నుంచి రెండు స్మార్ట్ వాచెస్, సేల్స్ ప్రారంభం
లాస్ ఎంజెంల్స్ కన్వెన్షన్ సెంటర్ కేంద్రంగా ప్రపంచంలో అతిపెద్ద గేమింగ్ ఆన్ లైన్ ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా రియల్ మీ సంస్థ రియల్ మీ వాచ్ 2, రియల్ మీ వాచ్ 2 ప్రో స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. దీంతో పాటు రియల్ మీ జిటి 5 జి స్మార్ట్‌ఫోన్, రియల్మీ ప్యాడ్, రియల్ మీ బుక్‌లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్ మీ వాచ్ 2 ప్రైస్, ఫీచర్స్ రియల్మే వాచ్ 2 స్మార్ట్ ఫోన్ 1.4 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ ప్లే, ఫుల్ ఛార్జింగ్ పెడితే 12 రోజుల వినియోగించుకునేలా బ్యాటరి వస్తుంది. ఇది IP68 (ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ కోడ్) డస్ట్ మరియు వాటర్-రెసిస్టెంట్ కోటింగ్ తో మరియు 90 స్పోర్ట్స్ మోడ్లతో లభ్యమవుతుంది. అంతేకాదు బ్లడ్, ఆక్సిజన్ మరియు హార్ట్ బీట్ రేట్ ను కౌంట్ చేస్తుంది. 100కి పైగా వాచ్ ఫేస్ ఫీచర్లను కలిగి ఉంది.దీని ధర 54.99 యూరోలు (సుమారు 4,889) తో కొనుగోలు చేయోచ్చు. నేటి నుండి రియల్మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. రియల్ మీ వాచ్ 2 ప్రో ప్రైస్ 'స్మార్ట్' రియల్ మీ వాచ్ 2ప్రో 1.75 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. రియల్మీ వాచ్ 2 మాదిరిగానే రియల్మీ వాచ్ 2 ప్రో ఐపి 68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కోటింగ్ తో వస్తుంది. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్లు, 100 కి పైగా వాచ్ ఫేస్‌లు, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్మార్ట్ నోటిఫికేషన్లు, డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్, మాగ్నెటిక్ ఛార్జింగ్ బేస్ ఫీచర్స్ ఉన్నాయి. రియల్మీ వాచ్ 2 ప్రో ధర 74.99 యూరోలకే (రూ. 6,889 సుమారు.) సొంతం చేసుకోవచ్చు. నేటి నుండి రియల్మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. రియల్ మీ టెక్ లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ రియల్ మీ చెందిన రియల్ మీ టెక్ లైఫ్ రోబో వాక్యూమ్ విడుదలైంది. స్మార్ట్ మ్యాపింగ్, నావిగేషన్ సిస్టమ్‌కు సహాయపడే లిడార్ సెన్సార్లతో సహా 38 ఇంటర్నల్ సెన్సార్లతో వస్తుంది. కొత్తగా ప్రారంభించిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌కు లిడార్ సెన్సార్ ఖచ్చితమైన రియల్ టైమ్ నావిగేషన్ మరియు ఖచ్చితమైన ఇన్-యాప్ రూమ్ మ్యాపింగ్ చేస్తుందని రియల్ మీ ప్రతినిథులు తెలిపారు. ఇక దాని పనితీరుకు సంబంధించి రియల్మీ టెక్లైఫ్ రోబోట్ సౌండ్ మోడ్‌లో శబ్దం స్థాయిలను 55dB కంటే తక్కువగా ఉంచుతుంది. 5200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 600 ఎంఎల్ డస్ట్ బిన్, 300 ఎంఎల్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ వాటర్ ట్యాంక్ కలిగి ఉంది. ఇది వాక్యూమ్ ఒకేసారి నేలని శుభ్రపరుస్తుంది మరియు తుడుచుకుంటుందని రియల్ మీ ప్రతినిధులు విడుదల సందర్భంగా చెప్పారు. చదవండి: Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ! -
బుల్లి వాక్యూమ్ క్లీనర్.. గిన్నీస్ రికార్డుల్లోకి
శ్రీకాళహస్తి: మారుమూల పల్లెటూరుకు చెందిన యువకుడి అద్భుత ఆవిష్కరణకు గిన్నిస్ బుక్‌లో చోటు లభించింది. తను రూపొందించిన 1.76 సెంటీమీటర్ల అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ వరల్డ్ రికార్డు కొల్లగొట్టింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన రామకృష్ణ, రమణమ్మ దంపతుల కుమారుడు తపాల నాదముని ఎన్ఐటీపీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాట్నా)లో బీఈ ఆర్కిటెక్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. 2016లో ఇన్స్పైర్ సైన్స్ మేళాలో పాల్గొని తన సత్తా చాటారు. తర్వాత 2.2 సెంటీమీటర్లు ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్‌ను తయారు చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. అనంతరం మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ (1.76 సెంటీమీటర్లు)ను రూపొందించారు. దీనిపై నాదముని మాట్లాడుతూ.. 8 నెలల పాటు శ్రమించి, రూ.25 వేల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశానన్నారు. గిన్నిస్ బుక్ వారికి పంపించగా మూడు రోజుల క్రితం సర్టిఫికెట్ అందజేసినట్లు తెలిపారు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ క్లినికల్ ల్యాబొరేటరీల్లో వాడేందుకు ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. -
తాళాబత్తుల చేతి నుంచి మరో సూక్ష్మ పరికరం
తూర్పుగోదావరి, పెద్దాపురం: ప్రముఖ గిన్నిస్ బుక్ పురస్కార గ్రహీత, సూక్ష్మ కళాఖండాల శిల్పి తాళాబత్తుల సాయి ముచ్చటగా మూడోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించే క్రమంలో మంగళవారం మరో అద్భుతాన్ని సృష్టించాడు. పెన్ క్యాప్ పరిమాణంలో సూక్ష్మ వాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించాడు. ప్రపంచంలో తొలిసారి 2015లో ఇంగ్లాండ్‌కు చెందిన టాబీ బేటసన్ 5.7 సెంటీ మీటర్ల పరిమాణంలో దీన్ని తయారు చేయగా, సాయి కేవలం 5.4 సెంటీ మీటర్ల సూక్ష్మ వాక్యూమ్ క్లీనర్ తయారుచేశారు. ఇందుకు ఓ పెన్ క్యాప్, 12 వాట్స్ మోటార్, 12 వాట్స్ బ్యాటరీ, ఒక స్విచ్, నెట్ క్లాత్‌ను ఉపయోగించి దీనిని తయారు చేశారు. దీనికి సంబంధించిన కొలతలను లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ సాయిరామ్ నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. స్థానిక విలేకర్లతో సాయి మాట్లాడుతూ 2016లో సూక్ష్మ మౌస్ ప్రో, 2017లో సూక్ష్మ నాటికల్ బోర్డును తయారు చేసి రెండు దఫాలు గిన్నిస్ బుక్ రికార్డు సాధించానని, ఈ దఫా హ్యాట్రిక్ సాధించాలనే తపనతోనే ఈ వాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. -
ఇంటిప్స్
కార్పెట్లను వాడని రోజుల్లో మడతపెట్టి లోపల పెట్టకూడదు. చాప చుట్టినట్లు రోల్ చేయాలి. మడతపెడితే ఆ మడతలు అలాగే నిలిచిపోతాయి. మళ్లీ పరిచినప్పుడు చక్కగా పరుచుకోకుండా... ఆ మడతల దగ్గర కార్పెట్ పైకి లేస్తుంది. కార్పెట్‌ను వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేసేటప్పుడు ఒకటే వైపుకి స్ట్రోక్స్ ఇవ్వాలి. అప్పుడే ఫర్ అంతా ఒకే దిశలో ఉండి డిజైన్ చక్కగా కనిపిస్తుంది. వాక్యూమ్ క్లీనర్‌ని ఎటుపడితే అటు దిశమారుస్తూ క్లీన్ చేస్తే డిజైన్ షేప్ అవుట్ అవుతుంది. నీటిలో ఉతికి ఆరిన తర్వాత పరిచేటప్పుడు ఫర్ని పొడి బ్రష్‌తో స్మూత్‌గా రుద్దాలి. -
వాక్యూమ్ క్లీనర్లా లాగేశారు!
డీమోనిటైజేషన్ ప్రక్రియపై అంతర్జాతీయ ద్రవ్య నిధి వ్యాఖ్యలు... ⇒ కొత్త నోట్ల సరఫరా మాత్రం నత్తనడకే... ⇒ ప్రజలు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొన్నారు... ⇒ వినిమయంపై భారీగా ప్రతికూల ప్రభావం... వాషింగ్టన్: మోదీ సర్కారు చేపట్టిన నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) వ్యవహారంపై అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. రద్దు రేసిన రూ.1,000; రూ.500 పెద్ద నోట్లను వ్యవస్థ నుంచి వాక్యూమ్ క్లీనర్ మాదిరిగా వెనక్కి లాగేశారని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే, వాటి స్థానంలో కొత్త నోట్ల సరఫరా మాత్రం నత్తనడకగా సాగిందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎ.కషిన్ అభిప్రాయపడ్డారు. డీమోనిటైజేషన్‌తో దేశంలో తీవ్ర నగదు కొరతకు దారితీసిందని.. ప్రజల వినిమయంపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఆయన అన్నారు. ‘రద్దయిన నోట్లను వ్యవస్థ నుంచి వెనక్కి గుంజేసిన తర్వాత వాక్యూమ్ క్లీనర్ రివర్స్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. కొత్త నోట్ల సరఫరా చాలా నెమ్మదిగా జరిగింది. దీనివల్ల నగదు కొరత తీవ్రతరమై.. వినిమయం తీవ్రంగా పడిపోయింది’ అని ఆయన చెప్పారు.‘అభివృద్ధి చెందిన దేశాలు ప్రవేశపెట్టిన సహాయ ప్యాకేజీలు ‘హెలీకాప్టర్ డ్రాప్స్’గా (హెలికాప్టర్ ద్వారా నగదు వెదజల్లడం) చాలా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు భారత్‌లో చేపట్టిన డీమోనిటైజేషన్ ప్రక్రియను ‘వాక్యూమ్ క్లీనర్’తో పోల్చవచ్చు’ అని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎ.కషిన్ విశ్లేషించారు. భారత్‌పై ఐఎంఎఫ్ వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు కషిన్ పైవిధంగా స్పందించారు. ఇండియా మిషన్ చీఫ్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. నివేదికలో వివరాలు... ⇔ ప్రస్తుతం ఇంకా మార్కెట్లో నగదు కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త నోట్ల సరఫరా పెంపును కొనసాగించాలి. అవసరమైతే తాత్కాలిక మినహాయింపులను పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పాత నోట్లను మళ్లీ వినియోగించడం కూడా ఇందులో ఒకటి. ⇔ నోట్ల రద్దు కారణంగా తాత్కాలికంగా ఎదురుకానున్న వృద్ధి మందగమనాన్ని తట్టుకునే సామర్థ్యం ఫైనాన్షియల్ వ్యవస్థకు ఉంది. అయితే, కార్పొరేట్ రంగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా మొండి బకాయిలు మరింత ఎగబాకే అవకాశం ఉంది. ⇔ దీనివల్ల బ్యాంకులు ఇతరత్రా ఆర్థిక సంస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. డీమోనిటైజేషన్ వల్ల దెబ్బతిన్న రంగాలకు తగిన చేయూతనివ్వాలి. ⇔ నోట్ల రద్దు ప్రకంపనలు ఆర్థిక వ్యవస్థలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉంది. మార్చి చివరికి ఈ సమస్యలు తగ్గుముఖం పట్టొచ్చు. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువ స్థాయిలోనే ఉండటం... సానుకూల రుతుపవనాలు, సరఫరాపరమైన అడ్డంకుల తొలగింపులో పురోగతి వంటివి డీమోని టైజేషన్ ఇబ్బందులను అధిగమించడంలో తోడ్పడతాయి. గ్లోబల్ షాక్‌ల ప్రభావం భారత్‌పై తక్కువే.. భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగైన స్థితిలో ఉందని ఐఎంఎఫ్ సీనియర్ అధికారి పాల్ కషిన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురయ్యే షాక్‌ల ప్రభావం ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువగానే ఉంటుందని చెప్పారు. ‘ఇటీవలి కాలంలో పలు దేశాల్లో వృద్ధి మందగమనాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీవ్రంగా దెబ్బతినడం, డిమాండ్ పడిపోవడం వంటివి జరిగితే భారత్‌పైనా ప్రభావం చూపుతుంది. అయితే, ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఈ ప్రభావం స్వల్పమే’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా దేశీ డిమాండ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో డీమోనిటైజేషన్‌కు ముందు వినిమయం అత్యంత మెరుగైన స్థితిలో ఉండేదని ఆయన పేర్కొన్నారు. కాగా, గడచిన కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న ద్రవ్యపరపతి విధానం, కార్యాచరణ భేషుగ్గా ఉందని కషిన్ చెప్పారు. ‘డీమోనిటైజేషన్ వల్ల వినిమయం దెబ్బతినడం వంటి స్వల్పకాలిక అడ్డంకులు తొలగిపోతే.. వృద్ధి మళ్లీ పట్టాలెక్కుతుంది. ప్రస్తుత 2016–17లో వృద్ధి రేటు 6.6%కి తగ్గొచ్చు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఈ ప్రభావం ఉంటుంది. అయితే, మధ్యకాలానికి మళ్లీ 8%పైగా వృద్ధి రేటు బాటలోని వచ్చేస్తుంది’ అని కషిన్ వివరించారు. -
కార్పెట్ క్లీనింగ్!
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో వాడే కార్పెట్ శుభ్రంగా లేకపోతే అతిథుల దృష్టిలో చులకనవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలూ తలెత్తే ప్రమాదముంది. అందుకే కార్పెట్‌ను క్లీన్‌గా ఉంచుకోవాలి. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా ఉండటం కోసం ప్రధాన ద్వారం దగ్గర మ్యాట్‌ను ఉపయోగించాలి. పాదరక్షలు ఇంటి బయటే విడవాలి. మరకలు పడితే వీలైనంత త్వరగా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. నాణ్యమైన యాసిడ్, డిటర్జెంట్, షాంపూలనే కార్పెంట్ క్లీనింగ్‌కు వాడాలి. లేకపోతే రంగు పోయే ప్రమాదముంది. స్టీమ్ క్లీనింగ్‌తో కూడా కార్పెట్‌ను క్లీన్ చేసుకోవచ్చు. అయితే ముందుగా కార్పెట్ బాగా తడిగా ఉండకుండా చూసుకోవాలి. స్టీమ్ క్లీన్ చేసే ముందు బ్రెష్ చేయడం కూడా మరవద్దండోయ్. -
ఇంటి శుభ్రం.. ఇలా సులభం
సాక్షి, హైదరాబాద్: ఇంటికి రంగుల్ని వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. రంగులు వేయకున్నా ఇల్లంతా మెరవాలంటే ఎలా? కొంత సమయాన్ని వెచ్చించి, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే చాలు ఇంటిని అందంగా తీర్చిదిద్దవచ్చు. ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరుచూ నిర్వహణ ఉన్నప్పుడే. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించుకోవాలి. దీని కోసం డోర్మ్యాట్ల వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూ, చెప్పులను బయటే విప్పి ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది. కార్పెట్లు: కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటిని తరుచుగా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్లపై టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావుకప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఆ పేస్టును ఆరనిచ్చి, వాక్యూమ్ క్లీనర్‌తో మరకలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. గోడలు: గోడలను తరుచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. దీంతో ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలగిపోతాయి. గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జంట్లతో శుభ్రం చేయాలి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయకూడదు. మైక్రోఓవెన్: మైక్రోఓవెన్‌ను అధికంగా వాడటం వల్ల ఎక్కువగా మురికిపడుతుంది. దీన్ని శుభ్రం చేయడానికి సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనిగర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడి చేయాలి. దీంతో గట్టిగా ఉండే ఆహారపదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి. వంటింట్లో..: స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు, నీటిలోని ఉప్పు పేరుకుపోవడం వల్ల చూడడానికి వికారంగా కన్పిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసేలా కన్పించాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపైన ఏర్పడే నీటి మర కల్ని టూత్‌పేస్టుతో రుద్దడం ద్వారా తొలగించవచ్చు. వంటింట్లోని సింక్ పరిశుభ్రంగా కన్పించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్ కలిపి ప్రయత్నించండి.