కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం గ్రామానికి చెందిన చుండూరు పవన్‌కుమార్ అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించాడు. దీన్ని వెర్నియర్ కాలిపర్స్‌తో కొలవగా 1.1 సెం.మీ. పొడవు, 1 సెం.మీ. వెడల్పుతో ఉంది. దీని తయారీలో మైక్రో మోటార్, ఇంజక్షన్ సిరంజి, ఫ్యాన్ రెక్కల కోసం కోక్ టిన్ ముక్కలు, బ్యాటరీలు ఉపయోగించినట్లు పవన్ తెలిపారు. గతంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి 1.4 సెం.మీ పొడవుతో వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేసినట్లు చెప్పారు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment