సూక్ష్మ కళాఖండాల శిల్పి సాయి శిల్పి సాయి రూపొందించిన పెన్ క్యాప్ వ్యాక్యూమ్ క్లీనర్
తూర్పుగోదావరి, పెద్దాపురం: ప్రముఖ గిన్నిస్ బుక్ పురస్కార గ్రహీత, సూక్ష్మ కళాఖండాల శిల్పి తాళాబత్తుల సాయి ముచ్చటగా మూడోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించే క్రమంలో మంగళవారం మరో అద్భుతాన్ని సృష్టించాడు. పెన్ క్యాప్ పరిమాణంలో సూక్ష్మ వాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించాడు. ప్రపంచంలో తొలిసారి 2015లో ఇంగ్లాండ్‌కు చెందిన టాబీ బేటసన్ 5.7 సెంటీ మీటర్ల పరిమాణంలో దీన్ని తయారు చేయగా, సాయి కేవలం 5.4 సెంటీ మీటర్ల సూక్ష్మ వాక్యూమ్ క్లీనర్ తయారుచేశారు. ఇందుకు ఓ పెన్ క్యాప్, 12 వాట్స్ మోటార్, 12 వాట్స్ బ్యాటరీ, ఒక స్విచ్, నెట్ క్లాత్‌ను ఉపయోగించి దీనిని తయారు చేశారు. దీనికి సంబంధించిన కొలతలను లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ సాయిరామ్ నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. స్థానిక విలేకర్లతో సాయి మాట్లాడుతూ 2016లో సూక్ష్మ మౌస్ ప్రో, 2017లో సూక్ష్మ నాటికల్ బోర్డును తయారు చేసి రెండు దఫాలు గిన్నిస్ బుక్ రికార్డు సాధించానని, ఈ దఫా హ్యాట్రిక్ సాధించాలనే తపనతోనే ఈ వాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment